Credit cards | వామ్మో ఏం వాడకమయ్యా సామి..

నేటి కాలంలో క్రెడిట్​ కార్డుల వాడకం సర్వసాధారణంగా మారింది.

by Harsha Vardhan
1 comment
Credit cards

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్ డెస్క్: Credit cards | నేటి కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

సూపర్​మార్కెట్​కు (Super market) వెళ్లినా, షాపింగ్​ మాల్​కు (Shopping mall) వెళ్లినా, రెస్టారెంట్​కు (Restaurant) వెళ్లినా ఇలా అన్ని చోట్లా ప్రజలు క్రెడిట్​ కార్డులు వాడుతున్నారు.

అంతలా అలవాటు పడిపోయారు. అయితే సాధారంగా ఓ వ్యక్తి ఐదు నుంచి పది కార్డులు ఉంటే ఎక్కువ. కానీ ఈ వ్యక్తి వద్ద ఉన్న క్రెడిట్​ కార్డులెన్నో తెలిస్తే నోరెళ్లబెడతారు.

Credit cards | వందల కార్డులు

హైదరాబాద్​కు చెందిన మనీష్ ధమేజా అనే వ్యక్తి దగ్గర ఏకంగా 1,638 క్రెడిట్​ కార్డులు ఉన్నాయి. ఏంటి నిజమేనా అనుకుంటున్నారా.. నిజ్జంగా నిజమేనండి.. ప్రపంచంలో ఇన్ని కార్డులు ఏకైక వ్యక్తి ఈయనే. ఇన్ని క్రెడిట్​ కార్డులు వాడుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో (guinness world record) చోటు సంపాదించుకున్నాడు. ఈ ఘనత సాధించిన వ్యక్తి తెలంగాణ వాసి కావడం హాట్ టాపిక్​గా మారింది. అయితే మనీష్ అన్ని వందల కార్డులు ఎలా మెయింటెన్​ చేస్తున్నాడనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది.

Credit cards | అప్పటి నుంచి..

2016లో నోట్లు రద్దు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది క్యాష్​ కోసం ఇబ్బందులు పడ్డారు. మనీష్​కు సైతం అందరిలాగే కరెన్సీ నోట్ల సమస్య రావడంతో క్రెడిట్​ కార్డుల వినియోగం మొదలు పెట్టాడు. కరెన్సీకి బదులుగా వీటితో చెల్లింపు చేయడం ప్రారంభించాడు. ఇలా అతడి క్రెడిట్​ కార్డుల ప్రయాణం మొదలైంది.  కార్డుల ద్వారా ఆర్థిక సౌలభ్యంతో పాటు రికార్డులు, క్యాష్​బాక్​లు, డిస్కౌంట్లు, మూవీ కూపన్లు వస్తుండడంతో విరివిరిగా వాడుతూ వచ్చాడు.

Credit cards | మనీష్​ ఏమంటున్నారంటే..

క్రెడిట్​ కార్డుల వినియోగంలో గిన్నిస్​ రికార్డు సాధించిన మనీష్​ ఏమంటున్నాడంటే.. ‘క్రెడిట్ కార్డులు నా జీవితంలో ఒక పెద్ద భాగమైపోయాయి. ఇవి లేకుండా నా జీవితం అసంపూర్ణం. వీటి వల్ల నేను ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాను. హోటల్ బుకింగ్ డిస్కౌంట్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫ్రీ మూవీ టిక్కెట్లు, స్పా వోచర్లు, గోల్ఫ్ సెషన్లు, ఫ్యుయల్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఇవన్నీ ఈ కార్డుల వల్లే లభిస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. కొందరైతే ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

1 comment

binance h"anvisningsbonus January 9, 2026,7:52 pm - January 9, 2026,7:52 pm

I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.

Reply

Leave a Comment

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00