Junk food | మీ పిల్లలకు జంక్​ ఫుడ్​ తినిపిస్తున్నారా.. రోగాలను కొనిస్తున్నట్టే లెక్క..!

నేటి పిల్లలు జంక్​ఫుడ్​ అలవాటు పడుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

by Harsha Vardhan
1 comment
Junk food

తెలుగున్యూస్​టుడే, వెబ్​డెస్క్​: Junk food | మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. నేటి కాలంలో జంక్​ ఫుడ్ (Junk food)​ దొరకని ప్రదేశం లేకుపోయింది. మెట్రోపాలిటన్​ సిటీ నుంచి కుగ్రామాల వరకు జంక్​ఫుడ్​ విస్తరించేసింది. టేస్టీగా ఉండడం, ఆకర్షనీయమైన ప్యాకింగ్​లు ఉండడంతో పిల్లలు వీటిని తినడానికి ఇష్టపడుతుంటారు. కొన్ని కంపెనీలు పిల్లలను ఆకర్షించేందుకు ప్యాకేజింగ్​లో చిన్నచిన్న బొమ్మలు, స్టిక్కర్లు ఇస్తుండడంతో పిల్లలు వీటిని కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆకర్షణీయమైర రుంగులతో, టేస్ట్‌తో పిల్లల మనసులను ఎల్లప్పుడూ లాగేస్తుంటాయి. అయితే వారిని ఈ ఆహారాలకు దూరంగా ఉంచడానికి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవడం తీసుకోవాలి.

Junk food | జంక్ ఫుడ్​ తీసుకోవడం కలిగే నష్టాలు..

పిజ్జాలు, బర్గర్లు, డొనట్స్​, కూల్​డ్రింక్​లతో పాటు ఇతర జంక్ ఫుడ్​లో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి హానికరం. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్​ లోపం వల్ల జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి బలహీనంగా మారుస్తుంది.

Junk food | ఊబకాయం

జంక్ ఫుడ్​లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎంత తిన్నా తృప్తి తక్కువగా ఉంటుంది, దీంతో పిల్లలకు కడుపు నిండినట్లు అనిపించకపోవడంతో అతిగా తింటారు. ఈ అతి వినియోగం అధిక కేలరీలకు దారితీస్తుంది. దీంతో బాల్యంలో ఊబకాయం (Obesity) వచ్చే ప్రమాదాన్ని పెరుగుతుంది. ఇంకా వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. తరచుగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ఒబెసిటీకి దారితీస్తుంది.

Junk food | అధిక రక్తపోటు

చాలా వరకు జంక్ ఫుడ్స్‌లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. సోడియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక రక్తపోటుకు దారి తీస్తుంది. గుండె జబ్బులు (Heart desecss), స్ట్రోక్‌కు ప్రధాన కారకాలుగా మారతాయి.

Junk food | అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)

జంక్ ఫుడ్‌లో న్యూరోట్రాన్స్​మీటర్​ పనితీరు, మెదడు అభివృద్ధికి అవసరమైన పోషకాలు ఉండవు. చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు పిల్లల్లో ADHD లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.

Junk food | ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ (Autoimmune disorders)

ప్రాసెస్ చేసిన ఆహారంలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. జంక్​ ఫుడ్​ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. కొందరిలో ఆటో ఇమ్యూన్​ డిజార్డర్ సమస్యలు ఏర్పడవచ్చు. ఇది వ్యక్తి శరీరం పొరపాటున దాని సొంత కణజాలాలపై దాడి చేస్తుంది.

Junk food | థైరాయిడ్ సమస్యలు 

జంక్ ఫుడ్‌లోని అనారోగ్యకరమైన కొవ్వులు, అందులోని రసాయన మిశ్రమాలు థైరాయిడ్ (Thyroid) సమస్య తలెత్తుతుంది. థైరాయిడ్ సమస్య వల్ల బరువు పెరగడం, అలసట, హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది.

Junk food | ఎలాంటి ఆహారం అందించాలంటే..

జంక్​ ఫుడ్​ పిల్లల పెరుగుదల, మెదడు పనితీరుపై ప్రభావితం చేస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలి. పిల్లలకు గింజలు, ఎండిన పండ్లు, సలాడ్లు, సీజనల్​ ఫ్రుట్స్​ వంటివి అందించాలి. అలాగే భోజనం సమతుల్యంగా ఉండాలి. రోజు సూర్యరశ్మికి కొద్ది సేపు పిల్లలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల డి విటమిన్​ లభిస్తుంది. క్రమంతప్పకుండా నీటిని తీసుకునేలా చూడాలి. అలాగే సరైన నిద్ర పోయేలా చూసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
Focus Mode
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00