తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Railway tickets | రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. మీరు బుకింగ్ చేసుకున్న టికెట్ తేదీలనూ మార్చుకునే వెసులుబాటును కల్పించనుంది.
Railway tickets | రైల్వే ప్రయాణికులకు శుభవార్త..
రైల్వే ప్రయాణికులు ఇప్పటి వరకు జర్నీ కోసం ముందస్తు రిజర్వేషన్ బుక్ చేసుకుంటే.. అనుకోని కారణాల వల్ల ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తే టికెట్ కాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. తర్వాత మళ్లీ మరో తేదీన బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను గుర్తించిన రైల్వే శాఖ ఈ విధానానికి స్వస్తి పలకనుంది. ఇకపై కన్ఫామ్డ్ ట్రెయిన్ టిక్కెట్ల ప్రయాణ తేదీని ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో మార్చుకునే అవకాశం కల్పించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే జనవరి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు. ‘ఎన్‌డీటీవీ’తో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
Railway tickets | ప్రస్తుత నిబంధనలు..
ప్రస్తుతం ముందస్తుగా బుక్ చేసుకున్న రైల్వే టిక్కెట్లకు సంబంధించిన జర్నీ డేట్ను మార్చుకోవడానికి అవకాశం లేదు. తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణాన్ని కాన్సిల్ చేసుకోవాల్సి వస్తే టికెట్ రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఛార్జీలను ప్రయాణ తేదీ, టికెట్ కాన్సిల్ చేసుకునే సమయం ఆధారంగా భరించాల్సి ఉంటుంది. ఈ మొత్తం డబ్బులను కట్ చేసుకున్న తర్వాతే మిగతా అమౌంట్ను రీఫండ్ అవుతుంది.
Railway tickets | ఏం మార్చారంటే..
ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రయాణికుల ప్రయోజనాలు అనుగుణంగా లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. అందుకే వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త విధానాన్ని అమలుఓకి తేనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానంలో కన్ఫామ్డ్ టికెట్ల తేదీలను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే మార్చుకోవచ్చునని తెలిపారు. ప్రయాణిలు జర్నీ తేదీని మార్చుకునే సౌకర్యం కల్పించనున్నామని వివరించారు.
