తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: ఆకాశంలో విమానం ఎగురుతున్న సమయంలో దాని వెనుక పొడవైన తెల్ల గీతలను మీరు గమనించే ఉంటారు. విమానం వెళ్తుండగా దానరి వెనకాలే చారలు ఏర్పడుతుంటాయి. కాసేపటి తర్వాత అవి మాయమైపోతూ ఉంటాయి. అది పొగనా.. లేదా కాలుష్యమా.. ఇంకా ఏమైనా అని ఆలోచించారా.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా..
ఆకాశంలో విమానాలు వెళ్తున్న సమయంలో తెల్లని గీతలు ఏర్పడుతుంటాయి. అయితే వీటిని “కాంట్రైల్స్” (Contrails) లేదా “కండెన్సేషన్ ట్రైల్స్” (Condensation Trails) అంటారని నిపుణులు చెబుతున్నారు. విమానాలు ఎగిరే ఎత్తు చాలా ఎక్కువగా ఉండడం వల్ల.. వాతావరణ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉంటుందట. కానీ విమానం ఇంజన్లు మాత్రం అత్యంత వేడిగా.. 500 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తాయి. అయితే Contrails ఈ వేడి వాయువులు చల్లని గాలిని తాకినసమయంలో వాటిలోని నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. ఈ ప్రక్రియలో ఏర్పడే చిన్న మంచు కణాలు కలసి తెల్లని చారలు రూపంలో మనకు కనిపిస్తుంటాయి. ఈ తెల్లని గీతలనే వాస్తవానికి మంచు స్ఫటికాల సమాహారం. పొగ లేదా కాలుష్యం కావు.
Contrails అన్ని విమానాల్లో ఇలాగే జరుగుతుందా..
అన్ని విమానాలు ఇలాంటి కాంట్రైల్స్ను సృష్టించవని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆ సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రధానంగా.. విమానం ఎగురుతున్న ఎత్తు, ఇంజిన్ నుంచి వెలువడే వేడి, గాలిలోని తేమ, ఉష్ణోగ్రతలు సరిగ్గా కలిసినప్పుడు సమయంలో మాత్రమే కండెన్సేషన్ ట్రైల్స్ ఏర్పడతాయట. అయితే విమానాలు తక్కువ ఎత్తులో ఎగిరినా.. లేదంటే పొడి వాతావరణంలో ఉన్నా కూడా ఈ గీతలు కనిపించవని చెబుతున్నారు.
ఇక నుంచి ఎప్పుడైనా విమానం వెళ్తున్న సమయంలో గీతలు కనిపిస్తే దానిని కాలుష్యం అనుకోకండి. అది కేవలం ఘనీభవించిన నీటి ఆవిరి మాత్రమే. తెలుసుకున్నారుగా సైన్స్ ఎంత ఆశ్చరమైనదో.. గొప్పదో అని..
Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!
