తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: credit card payment | ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం సర్వసాధారణం అయిపోయింది. మాల్స్, షోరూంలు, సూపర్ మార్కెట్స్ ఎక్కడికి వెళ్లినా క్రెడిట్ కార్డుల ద్వారానే ప్రజలు బిల్లులు చెల్లింపులు చేస్తున్నారు. అయితే బిల్లు జనరేట్ అయ్యాక చాలా మంది ఫుల్ పేమెంట్ చేస్తున్నా.. కొందరు మినిమమ్ డ్యూ కడుతుంటారు. అయితే ఇలా మినిమమ్ డ్యూ కట్టడం మంచిదేనా? దీని వలన సిబిల్ స్కోర్ పడిపోతుందా? అనే విషయాలు తెలుసుకుందాం..
నేటి కాలంలో చేతిలో డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు ఉండడంతో ఏ వస్తువులైనా కొనుగోలు చేస్తున్నాయి. అయితే చాలా మంది సకాలంలో బిల్ పేమంట్ చేయలేక మినిమమ్ డ్యూ చెల్లిస్తుంటారు. ఇలా తరచూ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందని, అలాగే మీరు కట్టే అమౌంట్ ఇంట్రస్ట్ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
credit card payment | మినిమమ్ డ్యూ అంటే..
క్రెడిట్ కార్డు బిల్ పూర్తి పేమెంట్ చేయలేని వారికి వివిధ పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి. మినిమమ్ పేమెంట్, పూర్తి అమౌంట్ కట్టడం, అదర్ అమౌంట్ లాంటి ఆప్షన్లు ఉంటాయి. అయితే సకాలంలో బిల్ పే చేయలేని వారు మినిమమ్ డ్యూ కడుతుంటారు. చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అసలు బిల్లులో 5 శాతాన్ని, మినిమమ్ డ్యూ గా చెల్లించేందుకు అనుమతిస్తాయి. బ్యాంకును బట్టి వీటిలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
credit card payment | లేట్ ఫీ, పెనాల్టీల నుంచి మాత్రమే ఊరట
క్రెడిట్ కార్డు యూజర్లు కొందరు మినిమమ్ డ్యూ కట్టడం వల్ల ఏ ఇబ్బంది ఉండదని భావిస్తుంటారు. అయితే ఇది నిజం కాదు. మినిమమ్ అమౌంట్ పేమెంట్ చేయడం వలన కేవలం లేట్ ఫీజు, పెనాల్టీల నుంచి మాత్రమే ఊరట కలుగుతుంది. అయితే మీరు చెల్లించాల్సిన మొత్తంపై వడ్డీని పడుతుంది.
credit card payment | సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా?
మినిమమ్ డ్యూ ఎక్కువ సార్లు పేమెంట్ చేయడం వల్ల సిబిల్ స్కోర్ పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా అధిక వడ్డీలు, పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. అంతే కాకుండా మీ అప్పు అనేది కూడా పెరిగిపోతుంది. అందుకే మినిమమ్ డ్యూ కట్టకపోవడం మంచిదంటులున్నారు. అదనపు ఛార్జీలు పడకుండా ఉండాలంటే మొత్తం బిల్ ఒకేసారి చెల్లించడం సరైందని పేర్కొంటున్నారు. ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుండా ఉండడం మూలంగా క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోపై ప్రభావం చూపింది. దీని వలన సిబిల్ స్కోర్‌పై ప్రభావం ఉంటుంది. మినిమమ్ డ్యూ చాలా కాలంగా ఉంచడం వల్ల అప్పు పెరగడం, అధిక వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. దీంతో సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది.
ఇది కూడా చదవండి.. : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
