తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: EPFO Passbook | గత కొన్ని రోజులుగా ఈపీఎఫ్‌వో సభ్యులు తమ పాస్‌బుక్‌లో (EPFO Passbook) 2025 సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన పాస్‌బుక్‌లు అప్డేట్ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది “నా ఖాతాలో మాత్రమే ఇలా జరిగిందా?” అని ఆందోళన చెందుతూ ఈపీఎఫ్‌వోను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఈ విషయంపై అధికారిక స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్‌వో.. ఈ సమస్య వల్ల ఎవరి డబ్బు కోల్పోలేదని, ఇది కేవలం సాంకేతిక కారణాల వల్ల వచ్చిన తాత్కాలిక ఇబ్బందేనని పేర్కొంది. ప్రస్తుతం కొత్తగా పునర్నిర్మించిన ఈసీఆర్ (ECR) లెడ్జర్లో డేటా పోస్టింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల జమల వివరాలు పాస్‌బుక్‌లో ప్రతిబింబించడం ఆలస్యమవుతోంది. త్వరలోనే ఈ డేటా పూర్తిగా అప్డేట్ అయి సభ్యుల ఖాతాల్లో కనిపిస్తుందని ఈపీఎఫ్‌వో హామీ ఇచ్చింది. అందువల్ల సభ్యులు అనవసర ఆందోళన చెందాల్సిన పని లేదని, కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.
EPFO Passbook | పాస్‌బుక్ లైట్
ఇదే సమయంలో సభ్యుల సౌలభ్యం కోసం ఈపీఎఫ్‌వో ఇటీవల ‘పాస్‌బుక్ లైట్’ అనే కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇకపై ప్రతిసారీ ప్రత్యేకంగా పాస్‌బుక్ పోర్టల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్‌లోనే ‘పాస్‌బుక్ లైట్’ ఆప్షన్ ద్వారా ప్రస్తుత బ్యాలెన్స్, జమ, విత్‌డ్రా వివరాలు సులభంగా చూసుకోవచ్చు.
ప్రస్తుతం పాస్‌బుక్‌లో రెండు నెలల జమ కనిపించకపోయినా, ఇది కేవలం సాంకేతిక అప్డేషన్ ప్రక్రియలో భాగమే తప్ప ఎటువంటి నష్టం జరగలేదు. త్వరలోనే అప్డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Loan rejection | మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా.. లోన్ రావడం లేదా.. ఈ కారణాలు ఉండొచ్చు..
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
