తెలుగున్యూస్టుడే, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది. చాలా మంది పెట్రోల్ వాహనాల కంటే ఈవీ వెహికిల్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. డ్రైవింగ్‌కు సైతం ఈజీగా ఉండడంతో వీటిని ప్రిఫర్ చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లడానికి, సిటీలో డ్రైవింగ్‌కు కన్వీనియెంట్గా ఉండడంతో కొనుగోళ్లు బాగా పెరిగాయి. అయితే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర ఎక్కువగా ఉన్నా.. మరికొన్ని మోడల్స్ రూ. లక్షలో లభిస్తుండడంతో వీటి సేల్స్ పెరుగుతున్నాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణించడంతో పాటు పెట్రోల్ అవసరం లేకపోవడంతో కొనుగోలు చేస్తున్నారు. అయితే రూ. లక్షలో బడ్జెట్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఈవీ వెహికిల్స్ గురించి తెలుసుకుందాం..
Electric scooters |ఓలా S1 X
ఓలా ఎలక్ట్రిక్ మోడల్స్‌లో ఇది బడ్జెట్ స్కూటర్. దీని ఎక్స్-షోరూం ధర రూ. 94,999గా ఉంది. 2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వేరియంట్‌తో వస్తుంది. దీనికి IDC 108 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తోంది. 101 kph గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. 4.3-అంగుళాల LCD కన్సోల్, మూడు రైడ్ మోడ్లు, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

Electric scooters |టీవీఎస్ ఆర్బిటర్
టీవీఎస్ ఇటీవల కొత్త ఆర్బిటర్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి రూ. 1.05 లక్షలుగా ఉంది. కానీ PM E-డ్రైవ్ పథకంతో దీనిని రూ. లక్ష కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 158 కిలోమీటర్ల రేంజ్‌తో 3.1 kWh బ్యాటరీ ప్యాక్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో క్రూయిజ్ కంట్రోల్ ఉండడం విశేషం. అలాగే 5.5-అంగుళాల LCD కన్సోల్, హిల్-హోల్డ్ కంట్రోల్, USB ఛార్జింగ్, OTA అప్డేట్లు వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.
ఆంపియర్ మాగ్నస్ నియో ఈ జాబితాలో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్-షోరూం ప్రైస్ రూ. 84,999గా ఉంది. ఇందులో 2.3 kWh LFP బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 85-95 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ కలిగి ఉంది. కంపెనీ ఈ స్కూటర్‌కు 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్లు వారంటీ ఇస్తోంది.
Electric scooters| విడా V2 ప్లస్
హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ డివిజన్ స్కూటర్ విడా. ఇది లాంగ్ రేంజ్‌ను అందిస్తుంది. దీని ఎక్స్ షోరూం ప్రైస్ వచ్చేసి ధర రూ. 85,300గా ఉంది. 3.44 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ARAI-సర్టిఫైడ్ క్లెయిమ్డ్ రేంజ్ 143 కిలోమీటర్లుగా కంపెనీ చెబుతోంది. కీలెస్ స్టార్ట్-స్టాప్, 7-అంగుళాల కన్సోల్, క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది 6 kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది.
గమనిక: మేం అందించిన ఈ వివరాలు అవగాహన కోసం మాత్రమే. అంతేకాకుండా ఇవి ఎక్స్ షోరూం ధరలు. అలాగే ఇవి ప్రాంతాల వారీగా కూడా మారుతూ ఉంటాయి. ధరలు, ఇతర ఫీచర్స్, ఇతర పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోనూ షోరూంలో సంప్రదించండి..
ఈ క్రింది Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..! ఐతే ఓ లుక్కేయండి..
Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
