తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Smartphone Charging Tips | నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కామన్. ఫోన్ లేకపోతే ఏ పని కాని పరిస్థితులు రోజులు వచ్చాయి. అయితే నిత్యం వాడే ఫోన్ ఛార్జింగ్ విషయంలో అనేక మంది పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల ఫోన్ బ్యాటరీపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఈ జాగ్రత్తలను పాటిస్తే ఫోన్‌ను ఎక్కువ రోజుల పాటు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Smartphone Charging Tips | ఇలా చేయకండి..
మనం చేసే చిన్నచిన్న పొరపాట్లు ఫోన్ బ్యాటరీని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఉదాహరణకు రాత్రంతా ఫోన్ ప్లగ్‌చేసి ఉంచడం.. చీప్ కేబుళ్లను వాడడం వల్ల బ్యాటరీ పనితీరును తగ్గించి.. లైఫ్టైంను తగ్గిస్తాయి. అయితే బ్యాటరీలు సహజంగానే కాలక్రమేణా వాడుకతో దిగజారుతుంటాయి. కానీ కొన్ని తప్పులు ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయని తెలుసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫోన్ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది.
ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడం, పూర్తిగా డిశ్చార్జ్ చేయడం మానుకోవాలి. బ్యాటరీ పర్సెంటేజీ పూర్తిగా అయిపోయే వరకు చాలామంది ఛార్జింగ్ పెట్టరు. అలాగే ఛార్జింగ్ పెట్టాక 100 శాతం వరకు తొలగించారు. ఇది పాత నికెల్ బ్యాటరీల కాలం నాటి పద్ధతి. ప్రస్తుతం మనం వాడుతున్న ఫోన్లలో లిథియం అయాన్ లేదా సిలికాన్ కార్బన్ బ్యాటరీలు ఉంటాయి. వీటికి పూర్తిగా ఛార్జ్ చేయడం లేదా పూర్తిగా డిశ్చార్జ్ చేయడం హానికరంగా మారుతుంది. అయితే 20 శాతం నుంచి 80 శాతం బ్యాటరీ మెయింటెయిన్ చేయడం మంది. ఫోన్ ఛార్జింగ్ 20 శాతంలోపు పడిపోతే తక్కువ వోల్టేజ్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే 20 శాతం రాగానే ఛార్జింగ్ పెట్టాలి. అంతేకాకుండా బ్యాటరీ 90 శాతం –100 శాతం వద్ద అధిక వోల్టేజ్ వల్ల దెబ్బ తింటుంది. అందుకే 20–80 శాతం బ్యాటరీ మెయింటెన్ చేయాలి.
Smartphone Charging Tips | రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టొద్దు..
రాత్రి పూట ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉదయం తీసేయడం సౌకర్యంగా ఉన్నా.. బ్యాటరీ ఆయుష్షు దెబ్బతీస్తుంది. ఫోన్లో ఛార్జింగ్ 100 శాతానికి చేరిన తర్వాత కూడా చిన్నచిన్న పవర్ డ్రా జరుగుతుంది. ఇది వేడిని పెంచి సెల్‌లను దెబ్బతీస్తుంది. అయితే iPhoneలో Optimised Battery Charging, ఆండ్రాయిడ్ అయితే Adaptive Charging ఆప్షన్‌ను ఆన్‌చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఛార్జింగ్‌ను 80 శాతం వద్ద ఆపి, మీరు నిద్రలేచే సమయానికి పూర్తిచేస్తాయి.
Smartphone Charging Tips | ఛార్జింగ్ సమయంలో గేమింగ్, స్ట్రీమింగ్ వద్దు..
ఫోన్ ఛార్జ్ అవుతున్న సమయంలో గేమ్స్ ఆడడం, వీడియోలు చూడడం లేదా హై-పర్ఫార్మెన్స్ యాప్‌లు వాడడం మూలంగా బ్యాటరీపై పారాసిటిక్ లోడ్ (Parasitic Load) పడుతుంది. దీంతో వేడి పెరిగి బ్యాటరీ సైకిళ్లు అస్థిరంగా మారుతాయి. కాబట్టి ఛార్జింగ్ టైంలో గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటివి నిలిపివేయడం ఉత్తమం.
Smartphone Charging Tips | ఫోన్ వేడెక్కకుండా చూసుకోండి..
బ్యాటరీకి వేడి అనేది శత్రువు లాంటిది. అధిక ఉష్ణోగ్రతల్లో బ్యాటరీ కెపాసిటీ వేగంగా తగ్గిపోతుంది. అందుకే ఛార్జింగ్ సమయంలో ఫోన్‌ను బెడ్‌పై, దిండు కింద ఉంచకూడదు. అలాగే నేరుగా సూర్యకాంతి తగిలేలా పెట్టకూడదు.
Smartphone Charging Tips | ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఎక్కువగా వాడొద్దు..
ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యమైనదే.. అయినా దీర్ఘకాలంలో వేడి పెంచి బ్యాటరీకి హాని చేస్తుంది. ప్రతి రోజూ వాడడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. అవసరమైన సమయంలో మాత్రమే వాడండి. రోజువారీగా నార్మల్ ఛార్జర్‌ను ఉపయోగించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
