తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: sabarimala temple | శబరిమల అయ్యప్ప భక్తులకు ఇది శుభవార్త. మండల-మకరవిళక్కు సీజన్లో భాగంగా అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకుడి సమక్షంలో ఆలయ తలుపులు తెరిచారు. కానీ సోమవారం తెల్లవారు జాము నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.
sabarimala temple | నేటి నుంచి భక్తులకు అనుమతి
ఆలయ ప్రధాన పూజారి ఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను నిర్వహించారు. పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ నుంచి తీసుకువచ్చిన జ్వాలను ఉపయోగించి పవిత్రమైన 18 మెట్ల వద్ద అధి(పవిత్ర మంట)ని వెలిగించారు. కాగా.. ఆదివారమే ఆలయాన్ని తెరిచినా.. సోమవారం తెల్లవారుజామున అధికారిక ఆచారాలు, కొత్త పూజారులు తలుపులు తెరిచి తీర్థయాత్ర సీజన్‌ను ప్రారంభించారు. నేటి నుంచి భక్తులను అయ్యప్ప దర్శనం కోసం అనుమతిస్తున్నారు. కాగా.. తీర్థయాత్ర సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లను ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) పరిపాలనా కమిటీ పర్యవేక్షిస్తోంది.
sabarimala temple | అందుబాటులో స్పాట్ బుకింగ్ కేంద్రాలు!
ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకుని ప్రతిరోజూ 70,000 మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చు. పంబ, నీలక్కల్, ఎరుమేలి, వండిపెరియార్ సత్రం, చెంగన్నూర్లలో స్పాట్ బుకింగ్ సౌకర్యాలు ఉన్నాయి. అయ్యప్ప దర్శనానికి ఆన్లైన్ బుకింగ్ తప్పనిసరి చేశారు. దర్శన టికెట్లను sabarimalaonline.org వెబ్సైట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక అయ్యప్ప ఆలయం తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

sabarimala temple | భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. క్యూలో వేచి ఉండే భక్తులకు బిస్కెట్లు, తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించారు. చిన్నారులు, మహిళల కోసం స్పెషల్ క్యూ వ్యవస్థను తెచ్చారు. మాలికప్పురంలోని అన్నదాన మండపంలో భక్తులకు తగినంత ఆహారం లభించేలా ఏర్పాట్లు చేశారు.
sabarimala temple | డిసెంబర్ 27వ తేదీ వరకు..
41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగియనుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. తిరిగి డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు.
ఇది కూడా చదవండి..: Varanasi Movie | మహేశ్–రాజమౌళి మూవీ టైటిల్ ‘వారణాసి’.. రిలీజ్ డేట్ ఎప్పడంటే..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
