తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Bharat Taxi | దేశంలో ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ అయిన ఓలా, ఊబర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకోసం అతి త్వరలోనే ‘భారత్ ట్యాక్సీ’ (Bharat Taxi) సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కో- ఆపరేషన్, నేషనల్ ఈ- గవర్నెన్స్ డివిజన్ ఆధ్వర్యంలో సేవలను ప్రారంభించనుంది. అయితే డ్రైవర్ల నుంచి కమీషన్లు వసూలు చేయకుండా.. కేవలం సభ్యత్వ రుసుముతోనే సేవలను అందించనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలపై ప్రజల నుంచి కేంద్రానికి కొన్నేళ్లుగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Bharat Taxi | ప్రైవేటు సర్వీసులపై ఫిర్యాదులు
ప్రైవేట్ క్యాబ్ సర్వీసులపై ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదులు వస్తున్నాయి. ఇష్టారీతిన క్యాబ్ ధరలను పెంచడం, పాత వాహనాలను వినియోగించడం, సడెన్ క్యాన్సిలేషన్, వెంటనే రేట్లు పెరగడం తదితర ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వారి వద్ద నుంచి కంపెనీలు అత్యధికంగా కమీషన్లు తీసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆదాయంలో సుమారు 25 శాతం కమీషన్లకే పోతుందని క్యాబ్ డ్రైవర్లు వాపోతున్నారు.
Bharat Taxi | ఎప్పటి నుంచి ప్రారంభం అంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న భారత్ టాక్సీ సర్వీసులు నవంబర్‌లో ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. అయితే తొలుత దేశ రాజధానిలోని విమానాశ్రయాలతో పాటు ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ యాప్ ఆధారిత సేవలు అందించేందుకు ఇప్పటివరకు సుమారు 650 మంది డ్రైవర్లను నియమించుకుంది. ఢిల్లీలో సేవలను పరీక్షించిన అనంతరం దేశ వ్యాప్తంగా ప్రధాన సిటీలకు విస్తరించనుంది.
Bharat Taxi | సహకార సంస్థ ఏర్పాటు
భారత్ టాక్సీ సర్వీస్ ఏర్పాటు కోసం కేంద్రం ఇప్పటికే ‘సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్’ను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా దీనికోసం రూ. 300 కోట్ల వాటా మూలధనం కూడా కేటాయించింది. ఈ సహకార సంస్థకు ఇటీవల ఎన్నికలు సైతం నిర్వహించగా.. అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అలాగే ఎన్సీడీసీ (NCDC) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ గుప్తా వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.
Bharat Taxi | ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన పనిలేదు
‘భారత్ ట్యాక్సీ’ సేవల్లో రైడ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా డ్రైవర్లకే చెల్లించనున్నారు. డ్రైవర్లు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన పనిలేదు. అతి తక్కువ నామినల్ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫామ్‌తో పనిచేయవచ్చు. దీని వల్ల డ్రైవర్లకు ఎంతో మేలు జరుగనుంది.
Laptop Charging | ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టి వాడుతున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..!
