తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Most expensive coffee | సాధారణంగా మనం తాగే కాఫీ 20 నుంచి 30 రూపాయలు ఉంటుంది. ఇంకా పెద్ద కెఫేలకు వెళ్తే.. సుమారు రూ. 400 నుంచి రూ. 500 వరకు ఉండొచ్చు. కానీ ఈ కాఫీ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెతారు. దీని రేటు అక్షరాలా రూ. 60 వేలు. ధర చూసి ఆశ్చర్యపోతున్నారా.. అవునండీ మీరు చదివేది నిజమే. దుబాయ్‌లోని రోస్టర్స్ స్పెషాలిటీ కాఫీ హౌస్ ఈ కాఫీతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సైతం సాధించింది.
Most expensive coffee | ఒక కప్పు ధర రూ.2500 దిర్హమ్స్
దుబాయ్ ‘రోస్టర్స్ స్పెషాల్టీ కాఫీ హౌస్’లో (Roasters Specialty Coffee House) లభించే ఈ కాఫీ అత్యంత ఖరీదైనదిగా గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness World Records) చోటు సాధించింది. ఒక్క కప్ ధర ఏకంగా 2,500 దిర్హామ్స్ అంటే 680 యూఎస్ డాలర్లు. ఇక మన కరెన్సీలో రూ. 60వేలకు పైమాటే. ఎందుకింత రేటు అనుకుంటున్నారు. ఈ కాఫీలో వాడే బీన్స్ ధర కిలోకు రూ. లక్షల్లో ఉంటుంది.
Most expensive coffee | దుబాయ్ కాఫీ కల్చర్‌కు కొత్త ఒరవడి
రోస్టర్స్ స్పెషాల్టీ కాఫీ హౌస్ యూఏఈలో 15 ఔట్‌లెట్లను నడుపుతోంది. అంతేకాకుండా దుబాయ్‌లో నాలుగు బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. ఈ రికార్డు దుబాయ్‌లోని స్పెషాలిటీ కాఫీ సంస్కృతికి కొత్త ఒరవడి తెచ్చిన్లయ్యింది.
Most expensive coffee | ఈ కాఫీ ఎందుకు ప్రత్యేకమంటే..
ఈ కప్ కాఫీ కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. ఇది ఒక లగ్జరీ అనుభూతి.. గెయిషా బీన్స్‌ను V60 టెక్నిక్‌తో బ్రూయింగ్ చేస్తారు. ఎడో కిరికో గ్లాస్‌లో సర్వ్ చేస్తారు. దీని తయారీలో ప్రతి దశలో శ్రద్ధ వహిస్తారు.
Most expensive coffee | మీకూ టేస్ట్ చేయాలనుందా..!
గిన్నిస్ రికార్డును సాధించిన ఈ కాఫీని మీరు టేస్ట్ చేయాలనుకునే దుబాయ్‌లోని రోస్టర్స్ ఔట్‌లెట్‌లకు సందర్శించాల్సిందే.. ‘ఈ కప్పు కాఫీతో పెద్ద దావత్ చేసుకోవచ్చు.. ఇంత లగ్జరీ మనకెందుకులే బాసు’ అనుకుంటున్నారా.. అయితే మన దగ్గర మాంచీ టేస్ట్‌తో పాటు మన బడ్జెట్లో దొరికే కేఫ్‌లున్నాయి.. అక్కడికి వెళ్లి తాగేద్దాం పదండి..
