తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Silver Loan : అత్యవసర పరిస్థితుల్లో చాలామంది డబ్బులు కాలంటే గోల్డ్ లోన్ తీసుకుంటుంటారు.. వీటిపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుందనే అందరికీ తెలిసిందే. బంగారం వ్యాల్యూ ప్రకారం.. బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. అయితే ఆభరణాలు పెట్టి లోన్లు తీసుకునేవారి కోసం ఆర్బీఐ గుడ్న్యూస్ చెప్పింది. ఇక నుంచి బంగారమే వెండి సైతం తాకట్టు పెట్టి రుణాలు పొందవచ్చని తెలిపింది. ఇది 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
గత కొన్ని నెలలు బంగారం రేట్లు భారీగా పెరిగాయి. అంతేకాకుండా వెండి సైతం అదే బాటలో పయనిస్తోంది. గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యింది. కాగా.. ప్రస్తుతం కాస్త ధర తగ్గింది. అయితే ఇప్పుడు వెండి ఆభరణాలు, నాణేలు సైతం బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. కొత్త మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని వాణిజ్య బ్యాంకులతో పాటు బ్యాంకింగేంతర ఆర్థిక సంస్థలకు స్పష్టం చేసింది.
Silver Loan : ఎంత వరకు చెల్లిస్తారంటే..
ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు వెండి విలువ ఆధారంగా రుణ పరిమితిని నిర్ణయిస్తాయి. దీనినే లోన్ టు వాల్యూ రేట్ అంటారు. ఇది వెండి మార్కెట్ విలువలో ఎంత శాతం వరకు రుణం పొందవచ్చో నిర్దేశిస్తుంది. రూ.2.5 లక్షల వరకు.. వెండి మార్కెట్ విలువలో 85 శాతం వరకు లోన్ ఇస్తారు. అదే రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అయితే విలువలో 80 శాతం రుణం అందిస్తారు. రూ.5 లక్షలకు పైబడితే 75 శాతం వరకు మాత్రమే లోన్ ఇవ్వనున్నారు. కాగా.. Silver Loan ఒక్క వ్యక్తి గరిష్ఠంగా 10 కిలోల వరకు వెండిని తాకట్టు పెట్టవచ్చు. వెండి నాణేలు అయితే 500 గ్రాముల వరకే అర్హమవుతాయి.
ఈ US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. కూడా చదివేయండి.
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
