తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: US Nuclear Testing | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. రష్యా, చైనా లాంటి దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో.. అమెరికా సైతం అణ్వాయుధ పరీక్షలను మళ్లీ ప్రారంభించాలని ఆదేశించినట్లు ప్రకటించారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక అయిన ‘ట్రూత్ సోషల్’లో ఈ విషయాన్ని వెల్లడించారు.
US Nuclear Testing | ట్రంప్ ఏమన్నారంటే..
“ప్రపంచంలో అత్యధికంగా అణ్వాయుధాలు అమెరికా వద్దనే ఉన్నాయి. నా తొలి పదవీ కాలంలో దీనిని సాధించాం. అయితే ఈ ఆయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి వల్ల అప్పట్లో పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఇతర దేశాలు తమ అణు సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటున్నాయి. ఇందులో రష్యా రెండో స్థానంలో ఉండగా.. చైనా మూడో స్థానంలో ఉంది. రానున్న ఐదేళ్లలో ఈ మూడు దేశాలు సమాన స్థాయికి చేరే ఛాన్స్ ఉంది. అందుకే మన దేశం తిరిగి అణ్వాయుధ పరీక్షలను ప్రారంభించాల్సిన అవసరం వచ్చింది. ఇందుకు సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌కు ఆదేశాలు జారీ చేశా. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభం కానుంది” అని ట్రంప్ తెలిపారు.
US Nuclear Testing తో ట్రంప్ తాజా వ్యాఖ్యలతో అమెరికా–రష్యా–చైనాల మధ్య అణు ఆయుధ పోటీ కొత్త దశకు చేరనున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల రష్యా తన అణు సామర్థ్యాలను పెంచుకునేందుకు విస్తృతంగా చర్యలు చేపడుతోంది. ఇటీవల రష్యా పరీక్షించిన పోసిడాన్ అణు డ్రోన్ సబ్‌మెర్సిబుల్ అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. అదే సమయంలో చైనా కూడా తన అణ్వాయుధాలను విస్తరించాలని భావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. ట్రంప్ దక్షిణ కొరియా బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్న కొన్ని గంటల ముందు ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే.. ట్రంప్ ప్రకటించిన ఈ నిర్ణయంపై అమెరికా రక్షణ శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనట్లు తెలుస్తోంది.
ఈ క్రింది Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..! ఐతే ఓ లుక్కేయండి..
Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!