తెలుగున్యూస్టుడే,ఇంటర్నెట్ డెస్క్: Winter Blues Natural Remedies | చలికాలం వచ్చిందంటే చాలామందికి అనేక సార్లు ఏదో బద్ధకం, నీరసం అనిపిస్తుంది. చల్లని గాలులు, త్వరగా చీకటి పడడం, రోజులో ఎక్కువ సమయం మంచంపైనే గడపాల్సి రావడం వల్ల మనసు కుంగిపోతుంది. ఉదయాన్నే లేవాలని, బయటకు అడుగుపెట్టాలనే ఉత్సాహం రాదు. ఇలాంటి భావోద్వేగాలు సాధారణంగా అందరిలోనూ కొంతమేర కనిపిస్తాయి. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా ఉండడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీన్నే ‘సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్’ (SAD) లేదా ‘వింటర్ బ్లూస్’ అంటారు. ఈ సమస్య ప్రధానంగా శీతాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉండడం వల్ల వస్తుంది. ఇది మెదడులో సెరటోనిన్ (సంతోష హార్మోన్) స్థాయిలను తగ్గించి, మెలటోనిన్ (నిద్ర హార్మోన్)ను పెంచుతుంది. ఫలితంగా మూడ్ డౌన్ అవుతుంది.
Winter Blues Natural Remedies | వింటర్ బ్లూస్ లేదా SAD లక్షణాలు ఏమిటి?
- రోజంతా నీరసం, విచారం లేదా నిరుత్సాహం అనిపించడం
- శక్తి స్థాయిలు తగ్గిపోవడం, అలసటగా ఉండడం
- ఇష్టమైన పనులపై ఆసక్తి కోల్పోవడం
- కార్బోహైడ్రేట్స్ ఆహారం అధికంగా తినడం, బరువు పెరగడం
- ఏకాగ్రత సమస్యలు, దృష్టి కేంద్రీకరించలేకపోవడం
- అపరాధ భావన, నిరాశ, తనను తాను విలువలేనివాడిగా భావించడం
- అతిగా నిద్రపోవడం లేదా నిద్రలేమి
- తీవ్రమైన సందర్భాల్లో జీవితం మీద విరక్తి కలగడం
ఈ లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి.

Winter Blues Natural Remedies | మూడ్‌ను బూస్ట్ సూచనలు
కొన్ని సహజమైన జీవనశైలి మార్పులతో వింటర్ బ్లూస్ సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ రోజువారీ జీవితంలో సులభంగా అమలు చేయదగినవే.
Winter Blues Natural Remedies | సూర్యకాంతిని ఎక్కువగా పొందండి..
చలికాలంలో బయటకు వెళ్లి కాసేపు నడవడం లేదా పార్కులో గడపాలి. సూర్యకాంతి మెదడు రసాయనాలను సమతుల్యం చేసి, జీవ గడియారాన్ని సరిచేస్తుంది. రోజూ 20-30 నిమిషాలు బయట గడిపితే నిద్ర మెరుగవుతుంది. అంతేకాకుండా మూడ్ కూడా బాగుపడుతుంది.
Winter Blues Natural Remedies | స్నేహితులు, కుటుంబంతో సమయం గడపండి
ఒంటరితనం అనేది వింటర్ బ్లూస్‌ను మరింతగా పెంచుతుంది. అందుకే స్నేహితులతో బయటకు వెళ్లండి. ఇష్టమైన సినిమాలు చూడడం, లేదా పుస్తకాలు చదడం చేయాలి. లేదంటే ఆటలు ఆడండి. ఇవి హ్యాపీ హార్మోన్స్‌ను పెంచుతాయి.
Winter Blues Natural Remedies | బాడీ డబ్లింగ్ టెక్నిక్..
ఇది ఒక ఆసక్తికరమైన పద్ధతి. మరొకరి సమక్షంలో (ఫేస్ టు ఫేస్ లేదా వర్చువల్‌గా) పనులు చేయడం లాంటివి చేయాలి. ఉదాహరణకు, ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి పనులు పూర్తి చేయడం లేదా స్నేహితుడితో కలిసి ఒకే సినిమా చూడడం వల్ల నిరాశను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Winter Blues Natural Remedies | ధ్యానం, ప్రాణాయామం
నిత్యం 10-15 నిమిషాలు ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. అనేక అధ్యయనాల్లో ఇది మూడ్‌ను మెరుగుపరుస్తుందని నిరూపితమైంది. అలాగే ఇంట్లోనే యోగా, డ్యాన్స్ లేదా సాధారణ వాకింగ్ చేయండి. వ్యాయామం ఎండార్ఫిన్స్ (హ్యాపీ హార్మోన్లు) విడుదల చేసి, శక్తిని పెంచుతుంది.
ఈ చిట్కాలు అన్నీ సహజమైనవి మరియు సులభంగా అమలు చేయదగినవి. అయితే లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా రోజువారీ జీవితాన్ని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడితే తప్పనిసరిగా మానసిక ఆరోగ్య నిపుణులు లేదా వైద్యులను సంప్రదించండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్లో దొరికినా సమాచారం ఆధారంగా ప్రచురితం చేశారు. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడి సలహా తీసుకోండి.
ఇది కూడా చదవండి..: Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai

