Laptop Charging |ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టి వాడుతున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: నేటి ఆధునిక యుగంలో కాలేజీ స్టుడెంట్ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి వరకు ల్యాప్‌టాప్ తప్పనిసరి అయిపోయింది. నిత్యం జీవితంలో ఇది కూడా ఓ భాగంగా మారిపోయింది. ఆఫీస్ వర్క్, ప్రాజెక్ట్స్ ఇలా ఏదీ చేయాలన్నా దీని అవసరం తప్పదు. ఈ నేపథ్యంలో ల్యాప్‌టాప్‌ను భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం వాడే డివైజ్ ఏ కంపెనీకి చెందినదైనా సరే.. దానిని నిర్వహణ అనేది ఎంతో ముఖ్యం. కొన్ని జాగ్రత్తలు తీసుఉకుంటూ వాడితే సుదీర్ఘకాలం బాగుంటుంది. ల్యాప్‌టాప్ నిర్వహణలో ఎలాంటి జాగ్రత్త చర్యలు పాటించాలో తెలుసుకుందామా మరి..
Laptop Charging |ఇలా ఓపెన్ చేయకండి..
ల్యాప్‌టాప్‌ను కొందరు ఒక మూల నుంచి తెరుస్తుంటారు. ఈజీగా ఉంటుందని ఇలా ఓపెన్ చేస్తుంటారు. అయితే తరచూ ఇలా చేయడం వల్ల పైభాగంలోని డిస్ప్లే ఒకవైపు వంగిపోతుంది. దీంతో ఇటీవల కొన్ని ల్యాప్‌టాప్‌లను ఓపెన్ చేసేందుకు స్పెషల్‌గా ‘బంప్’ ఇస్తున్నారు. ల్యాప్‌టాప్‌ను ఎప్పుడైనా సరే మధ్యలో నుంచే తెరవాలి. అంతేకాకుండా ల్యాప్‌టాప్‌లను ఒకవైపు నుంచి ఇతరులకు ఇవ్వడం.. ఒంటి చేతితో పట్టుకెళ్లడం సురక్షితం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. మెటల్ బాడీ ఉండే డివైజ్‌లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోయినా.. ప్లాస్టిక్‌తో చేసిన బాడీ ఉన్నవయితే కొన్ని సార్లు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Laptop Charging |వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి..
ల్యాప్‌టాప్‌లకు వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం అవసరం. బయటి గాలి లోపలికి వెళ్లడం, లోపలి గాలి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం ల్యాప్‌టాప్‌లలో ఫ్యాన్లు కింది వైపు ఉంటాయి. మనం ల్యాప్‌టాప్‌ను సోఫా, బెడ్, తొడలు, మెత్త(దిండు)పై ఉంచి వాడినట్లయితే వెంటిలేషన్ సరిగ్గా ఉండదు. దీంతో అవి త్వరగా వేడెక్కుతాయి. ఈ కారణంగా వాటి పనితీరు మందగించి ‘హ్యాంగ్’ అవుతూ ఉంటుంది.
Laptop Charging |దుమ్ము దూళి లోపలికి వెళ్లకుండా..
చాలామంది సాధారణంగా ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేసిన అనంతరం దానిని మూసివేయకుండా అలాగే వదిలేస్తారు. దీంతో దుమ్ము, ధూళి, చిన్నచిన్న అణువులు కీబోర్డు, స్పీకర్ల ద్వారా లోపలికి వెళ్తాయి. అవి హార్డ్‌వేర్ కాంపోనెంట్లలోకి చేరడం మూలంగా పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇలా క్లీన్ చేయండి..
చాలామంది ల్యాప్‌టాప్ కీబోర్డుల్లో చేరిన దుమ్మును క్లీన్ చేయడానికి టూత్‌బ్రష్ లాంటివి వాడుతుంటారు. అయితే ఇలా చేయకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘ల్యాప్‌టాప్ క్లీనింగ్ కిట్’ను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కీబోర్డు పాడవకుండా, డస్ట్ లోనికి వెళ్లకుండా తెరలు సైతం అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. అలాగే స్క్రీన్లను శుభ్రం చేయడానికి వాటర్ స్ప్రేలను వాడుతుంటారు. అలా చేయకూడదు. నీరు ల్యాప్‌టాప్ లోపలికి వెళ్లి హార్డ్‌వేర్ కాంపోనెంట్ల ద్వారా షార్ట్‌సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది.

బ్యాటరీ విషయంలో జాగ్రత్తలు..
సాధారణంగా చాలా మంది ల్యాప్‌టాప్‌లను వంద శాతం ఛార్జింగ్ చేస్తుంటారు. అలాగే జీీరో అయ్యే వరకూ వాడుతుంటారు. ఇది బ్యాటరీ పనితీరును దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే 20 – 80 శాతం ఛార్జింగ్ సురక్షితమని పేర్కొంటున్నారు. ల్యాప్‌టాప్ కొనుగోలు చేసినప్పుడు వచ్చిన ఛార్జర్‌ను వాడాలని సూచిస్తున్నారు. Laptop Charging :థర్డ్‌పార్టీ సాఫ్ట్వేర్లు వినియోగించొద్దు..
నెట్లో కనిపించే థర్డ్‌పార్టీ యాప్‌లను చాలామంది ఇన్స్టాల్ చేస్తుంటారు. అయితే ఇది వ్యక్తిగత గోప్యతతో పాటు ల్యాప్‌టాప్ పనితీరును దెబ్బతీస్తుంది. సంబంధిత మైక్రోసాఫ్ట్ స్టోర్, ప్లేస్టోర్, యాప్‌స్టోర్ ద్వారానే యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఇన్‌స్టాలింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
సమస్యలు వస్తే..
ల్యాప్‌టాప్‌లలో సమస్యలు తలెత్తినసమయంలో దగ్గరలోని సర్వీస్ సెంటర్లకు వెళుతుంటారు. ఇలా చేయవద్దు. సంబంధిత కంపెనీ అథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలోనే రిపేర్‌కు ఇవ్వాలి. ముందు బయట రిపేర్ చేయించి.. అనంతరం ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లడం వల్ల ఏడాది వరకు ఉండే వారంటీని సైతం నిరాకరిస్తారని నిపుణులు చెబుతున్నారు. (x.com/ze_rusty)
Ujjwala Scheme : ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్..!

