తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Gutti Bendakaya Fry Recipe | ‘గుత్తొంకాయా గుత్తొంకాయా.. గుంతలకిడి గుమ్మపేరు గుత్తొంకాయ..’ అని పాడుతూ గుత్తి వంకాయ కూరను లొట్టలేసుకుంటూ తినేఉంటారు.. గరంగరం అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే రోజూ తినేదానికంటే నాలుగు మద్దులు ఎక్కువగానే లాగించేస్తారు. అంతలా ఇష్టపడతారు ఎంతో మంది. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే రెసిపీ వంకాయ కూర అనుకుంటున్నారా.. అస్సలు కాదండోయ్.. మీ కోసం ముద్ద బెండకాయ వంటకాన్ని తీసుకొచ్చాం. దీని టేస్ట్ చేయాలంటే వాహ్ అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం.. ముద్ద బెండకాయ వంటకాన్ని తెలుసుకుందాం..
బెండకాయ వేపుడు (Gutti Bendakaya Fry Recipe) అంటే చిన్నాపెద్దా అందరూ ఇష్టపడతారు. అయితే ఇలా చేసి పెట్టారంటే బెండకాయ అంటే నచ్చనివాళ్లు కూడా వాహ్ అంటూ లొట్టలేసుకుంటూ ఆరగించేస్తారు. దీనిని చాలా సింపుల్‌గా చేసుకోవడంతో పాటు తక్కువ టైంలోని అయిపోతుంది. మరి, ఈ టేస్టీ టేస్టీ గుత్తి బెండకాయ ఫ్రై ప్రిపరేషన్ చూద్దాం.
Gutti Bendakaya Fry Recipe | ఫ్రైకి కావాల్సిన పదార్థాలు..
- బెండకాయలు : పావుకిలో
- నూనె : రెండు చెంచాలు
Gutti Bendakaya Fry Recipe | మసాలా కోసం కావాల్సినవి..
- పల్లీలు – మూడు లేదా నాలుగు చెంచాలు
- ధనియాల పొడి – ఒక స్పూన్
- జీలకర్ర పొడి – ఒక చెంచా
- పసుపు – పావు స్పూన్
- కారం – ఒక చెంచా
- గరంమసాలా – హాఫ్ స్పూన్
- ఆమ్చూర్ పొడి – హాఫ్ స్పూన్
- సోంపు పొడి – హాఫ్ స్పూన్
- ఉప్పు – మీ రుచికి తగినంత
- నూనె – రెండు చెంచాలు
Gutti Bendakaya Fry Recipe | తయారీ విధానం ఇలా..
- ‘గుత్తి బెండకాయ ఫ్రై’ కోసం ముందుగా లేత బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి.
- అనంతరం వాటిని పొడి క్లాత్‌తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత బెండకాయల రెండు వైపులా అంచులు తీసేయాలి. అలాగే చాకుతో నిలువుగా గాటు పెట్టుకోవాలి. ఇలా అన్ని బెండకాయలను సిద్ధం చేసిపెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక చిన్న బాండీ(కడాయి)లో పల్లీలను దోరగా వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి.. మిక్సీ జార్లో బరకగా, పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి, సోంపు పొడి ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవాలి.
- ఇక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గ్రైండ్ చేసుకున్న పల్లీపొడి, జీలకర్రపొడి, ధనియాల పొడి, కారం, పసుపు, సోంపు పొడి, గరంమసాలా, ఆమ్చూర్ పౌడర్, రుచికి తగినంత ఉప్పు, ఒకటి లేదా రెండు చెంచాల నూనె వేసి బాగా కలుపుకోవాలి.
- ఆ త్వరాత పల్లీపొడి మిశ్రమాన్ని చీల్చి పెట్టుకున్న బెండకాయల్లో తగినంత వేసి చక్కగా స్టఫ్ చేసుకోవాలి.
- ఆపై బెండకాయలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ అన్నివైపులా నూనె రాసి పెట్టుకోవాలి.
- స్టవ్ మీద పాన్ పెట్టి వేడి అయ్యాక సన్నని సెగ మీద ఉంచాలి. ఆ తర్వాత నూనె రాసిన బెండకాయల్ని స్టఫింగ్ ఉన్న వైపు బాగా వేగనివ్వాలి.
అన్నివైపులా తిప్పుతూ బాగా వేయించుకోవాలి. - స్టఫ్ చేసుకున్న బెండకాయలన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి.
ఇలా చేసిన వేడివేడి.. టేస్టీటేస్టీ గుత్తి బెండకాయ ఫ్రై ట్రై చేశారంటే వాహ్ అనాల్సిందే..
Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!
