Vande Bharat Sleeper Train | రైల్వే ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ ట్రెయిన్​..

ప్రయాణికులకు రైల్వే శాఖ నూతన సంవత్సరంలో గుడ్​న్యూస్​ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది.

by Harsha Vardhan
0 comments
Vande Bharat Sleeper Train

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Vande Bharat Sleeper Train | ప్రయాణికులకు రైల్వే శాఖ నూతన సంవత్సరంలో గుడ్​న్యూస్​ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ ప్రకటించారు. ఈ రైలు సుదూర ప్రయాణాలకు ప్రత్యేకంగా రూపొందించిన ఆధునిక శైలిలో తయారైంది.

రైల్వే మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. మొదటి వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper Train) అస్సాం రాష్ట్రంలోని గువాహటి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హౌరా (కోల్‌కతా) మధ్య నడవనుంది. 20 రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది.

Vande Bharat Sleeper Train | మరింత సులభతర ప్రయాణం

వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్​ ఉంది. వీటిలో స్లీపర్ వెర్షన్ రాకతో రాత్రిపూట ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. ఈ రైలు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో గాజు గ్లాసులో నీటిని నింపి ఉంచినా.. అతివేగంలో కూడా అది కదలకుండా స్థిరంగా ఉండడం దాని అత్యాధునిక సాంకేతికతను తెలియజేస్తోంది.

Vande Bharat Sleeper Train | అత్యాధునిక సౌకర్యాలు

ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 11 త్రి టైర్​ ఏసీ, 4 టు టైర్​ ఏసీ, ఒక క్లాస్​ ఏసీ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 823 మంది ప్రయాణికులు సాగే సామర్థ్యం కలిగి ఉంటుంది. అత్యాధునిక సస్పెన్షన్ వ్యవస్థ, ఆటోమేటిక్ తలుపులు, కవచ్ యాంటీ-కొలిజన్ సిస్టమ్, సీసీటీవీ నిఘా వంటి సౌకర్యాలు ప్రయాణికుల భద్రత, సౌలభ్యాన్ని మరింత పెంచుతాయి.

Vande Bharat Sleeper Train | టికెట్ ధరల వివరాలివే..

మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని టికెట్ ధరలు నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. గువాహటి-హౌరా మధ్య ఒకవైపు ప్రయాణానికి..

  • మూడో శ్రేణి ఏసీ (3AC): సుమారు రూ. 2,300 (భోజనం సహా)
  • రెండో శ్రేణి ఏసీ (2AC): సుమారు రూ. 3,000
  • మొదటి శ్రేణి ఏసీ (1AC): సుమారు రూ. 3,600

ఇదే మార్గంలో విమాన టికెట్ ధరలు రూ. 6,000 నుంచి రూ. 8,000 వరకు ఉండగా, ఈ రైలు ధరలు సగం కంటే తక్కువగా ఉండడం ప్రత్యేక ఆకర్షణ. రాబోయే నెలల్లో మరిన్ని వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇది భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది.

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

Leave a Comment

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00