తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Womens world cup 2025 | భారత్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి దక్కించుకుంది. నవీ ముంబయిలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫిక్రాను మట్టికరిపించింది. అద్వితీయమైన ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్ సేన విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచ కప్ కలను ముద్దాడింది. ఈ ఉద్విగ్న క్షణం కోసం దశాబ్దాల తరబడిగా ఎదురుచూసిన భారతావని పులకించిపోయింది.
Womens world cup 2025 | దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా
భారత మహిళా జట్టు చిరకాల కల సాకారమైంది. వన్డే ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. నవీ ముంబయి వేదికగా జరిగిన తుదిపోరులో సౌతాఫిక్రాపై భారత్ ఘన విజయం సాధించింది. 52 పరుగుల తేడాతో చిత్తుచేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
షెఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ విరోచిత సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ 5, షెఫాలీ వర్మ 2, శ్రీ చరణి ఒక్కో వికెట్ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా షెఫాలీ నిలిచింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును దీప్తి శర్మ అందుకుంది.
ఇది కూడా చదవండి..: Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!