తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Winter Skin Care Tips | చలికాలం వచ్చిందంటే చాలా మందికి చర్మ సంరక్షణ గురించి ఆందోళన మొదలవుతుంది. చల్లని గాలులు, పొడి వాతావరణం వల్ల చర్మం తేమను కోల్పోతుంది. దీంతో నిస్తేజంగా మారిపోతుంది. పెదవులపై పగుళ్లు ఏర్పడడంతో పాటు చేతులు, ముఖం పొడి బారి సన్నని గీతలు ఏర్పడడం సాధారణం. ఈ సమయంలో రసాయనాలతో నిండిన క్రీములు, లోషన్లపై ఆధారపడితే తాత్కాలిక ఉపశమనం లభించినా.. దీర్ఘకాలంలో చర్మం మరింత దెబ్బతినే అవకాశం ఉంది.
అందుకే సహజమైన, ఇంటి వద్దే అందుబాటులో ఉండే పదార్థాలతో చర్మ సంరక్షణ చేసుకోవడం ఉత్తమ మార్గం. ఈ చిట్కాలను పాటించడంతో చలికాలంలోనూ మీ చర్మం మృదువుగా, తేమతో నిండి, సహజ కాంతితో మెరిసిపోతుంది. అవేంటో తెలుసుకుందాం పదండి..
Winter Skin Care Tips | రోజూ తగినంత నీరు తాగండి..
చలికాలంలో దాహం అనిపించకపోవచ్చు గానీ శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇది చర్మంపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీంతో స్కిన్ పొడి బారడం, నిస్తేజంగా కనిపించడం జరుగుతుంది. రోజుకు కనీసం 8–10 గ్లాసుల నీరు తాగే అలవాటు చేసుకోండి. గది ఉష్ణోగ్రతలో ఉండే నీరు లేదా గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల చర్మం లోపలి నుంచి హైడ్రేట్ అవుతుంది.
Winter Skin Care Tips | చర్మ రకానికి తగిన మాయిశ్చరైజర్ ఎంపిక
స్నానం తర్వాత లేదా ముఖం కడిగిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారు షియా బట్టర్, కోకో బట్టర్ ఆధారిత క్రీములు, జిడ్డు చర్మం ఉన్నవారు జెల్ ఆధారిత లేదా ఆలివ్ ఆయిల్ మిశ్రిత లైట్ లోషన్లు ఉపయోగించవచ్చు. రోజుకు రెండు సార్లు (ఉదయం–సాయంత్రం) అప్లయ్ చేయాలి.

Winter Skin Care Tips | తేనెతో సహజ మాయిశ్చరైజింగ్
సహజ హ్యూమెక్టెంట్ అయిన తేనె చర్మంలోకి తేమను గ్రహిస్తుంది. శుభ్రమైన ముఖంపై సన్నని పొర తేనె రాసి 15–20 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. వారంలో ఇలా మూడు సార్లు చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
Winter Skin Care Tips | రాత్రిపూట నూనె మసాజ్
కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె లేదా జోజోబా నూనెలలో ఏదో ఒకటి ఎంచుకోండి. పడుకునే ముందు 8–10 నిమిషాలు ముఖం, మెడ, చేతులకు సున్నితంగా మసాజ్ చేసి రాత్రంతా ఉంచండి. ఉదయం సాధారణ నీటితో కడిగేయండి. వారం–పది రోజుల్లోనే చర్మం మెరవడంతో పాటు మృదువుగా మారుతుంది.

Winter Skin Care Tips | వేడి నీటికి ముఖం కడగొద్దు
వేడి నీరు చర్మంలోని సహజ నూనెలను తొలగించి పొడి బారేలా చేస్తుంది. ముఖం కడుక్కునేందుకు ఎల్లప్పుడూ చల్లని లేదా గోరువెచ్చని నీటినే వాడండి.
Winter Skin Care Tips | రోజ్‌వాటర్–గ్లిసరిన్–నిమ్మరసం మిశ్రమం
ఒక చిన్న స్ప్రే బాటిల్లో రోజ్‌వాటర్, గ్లిసరిన్ను సమాన నిష్పత్తిలో కలపండి. ఐదు–ఆరు చుక్కల నిమ్మరసం వేసి బాగా షేక్ చేయండి. రాత్రి శుభ్రమైన ముఖంపై స్ప్రే చేసి లేదా కాటన్‌తో తుడుచుకోండి. ఉదయానికి చర్మం సహజ కాంతితో నిండిపోతుంది.
గమనిక: పైచిట్కాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి చర్మ రకం, ఆరోగ్య పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ముందుగా డెర్మటాజిస్ట్ను సంప్రదించి ఏవైనా వాడండి.
ఇది కూడా చదవండి..: Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai







