Penci Sport plugin only working with the Soledad theme.

తాజా వార్తలు - Telugu News Today

Category: తాజా వార్తలు

  • Guava leaves benefits | ఆన్​లైన్​లో జామ ఆకుల​ అమ్మకం.. ధరెంతో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే..!

    Guava leaves benefits | ఆన్​లైన్​లో జామ ఆకుల​ అమ్మకం.. ధరెంతో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్ డెస్క్​​: Guava leaves benefits‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం’ అన్నారు శ్రీశ్రీ ఒకనాడు.. కానీ నేడు ‘జామ ఆకు.. మామిడి ఆకు.. వేప ఆకు.. కాదేదీ అమ్మకానికనర్హం’ అన్నట్లు మారిపోయింది ఆన్​లైన్ బిజినెస్​. గుండు పిన్ను నుంచి మొదలు బైకులు, కార్ల వరకు అన్నీ ఆన్​లైన్​లో అమ్మేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే.. ఇటీవల కాలంలో వేప ఆకులు, వేప కాయలు, మామిడి ఆకులు, జామ ఆకులు సైతం విక్రయిస్తున్నారు. అయితే ఇందులో జామ ఆకుల ధరలు చూస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే. మనం కూడా ఆన్​లైన్​లో విక్రయించేద్దాం అని అనిపిస్తుంది.

    ‌జామ చెట్టు.. ఒకప్పుడు ప్రతి ఒక్కరి పెరట్లో ఉండేది. రానురాను వీటి సంఖ్య తగ్గుతోంది. పల్లెల్లో ఇప్పటికీ వీధి ఐదారు చెట్లున్నా.. సిటీల్లో మాత్రం వీటి సంఖ్య తగ్గిపోతోంది. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ప్రతి ఇంట్లో ఈ చెట్టు తప్పనిసరిగా ఉండేది. ఖాళీ సమయాల్లో తెంపుకుని తినేది. కానీ కాలమారుతున్న కొద్దీ చెట్లు తగ్గిపోవడంతో కొనుక్కుని తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ప్రస్తుతమైతే జామ ఆకులు సైతం ఆన్​లైన్​లో విక్రయిస్తున్నారు.

    Guava leaves benefits | వీటి ధర చూస్తే షాకే..

    చిన్నతనంలో లేత జామ ఆకులో చింతపండు, కాస్త ఉప్పు కలిపి తింటే ఆ రుచి అమోఘంగా ఉండేది. టేస్ట్​ సూపర్​గా ఉండడమే కాదు.. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిలోని ప్రయోజనాలను గుర్తించి కార్పొరేట్​ సంస్థలు.. జామ ఆకులను ఆన్​లైన్​లో విక్రయిస్తున్నాయి. పచ్చి ఆకులతో పాటు ఎండిన ఆకులు, ఆకులతో చేసిన పౌండర్​ను సైతం అమ్ముతున్నారు. ఎండిన ఆకులైతే 50 గ్రాములకు రూ. 120 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు. అంటే కిలోకు రూ. 1200 నుంచి రూ. 3వేలకు అమ్ముతున్నారన్న మాట. ఇక పౌడర్​ను కూడా ఇదే ధరల్లో లభ్యమవుతోంది.

    Guava leaves benefits

    Guava leaves benefits | జామ ఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలు..

    జామ ఆకులను కొనుగోలు చేసి ఏం చేస్తారని అనుకుంటున్నారు.. వీటితో టీ తయారుచేస్తారని మీకు తెలుసా. జామ కాయలతో పాటు ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో విటమిన్ c, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. అందుకే వీటికి డిమాండ్​ పెరుగుతోంది. పచ్చి జామ ఆకులతో కొందరు రసం చేసుకుని తాగుతారు. మరికొందరు ఎండిన ఆకులతో టీ చేసుకుని ఆస్వాదిస్తుంటారు. ఎలా తీసుకున్నా వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

    Guava leaves benefits | బ్లడ్ షుగర్‌ కంట్రోల్..

    జామ ఆకుల రసం తాగితే.. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమపద్ధతికి చేరతాయి. డయాబెటిస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేసే అంశం. అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే మంచిదట. దీనివల్ల దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటాయంటున్నారు నిపుణులు. నాలుగు జామ ఆకుల్ని నీటిలో వేసి పది నిమిషాలు ఉడికించి.. ఆ నీటిని తాగేయడమే.

    ‌Guava leaves benefits | గుండె ఆరోగ్యానికి మేలు

    జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు.. గుండెకు మేలు చేయడంలో ఉపయోగపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అందువల్ల జామ ఆకుల రసం తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

    Guava leaves benefits | జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

    జామకాయలు జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. వీటి ఎంత తింటే అంతగా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఒక జామకాయ.. మన రోజువారీ అవసరమయ్యే ఫైబర్‌‌లో 12 శాతం ఇస్తుందట. జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియను మెరుగుపర్చడంలో దోహదం చేస్తుంది. అంతేకాకుండా డయేరియా(విరేచనాలు)కు చెక్ పెడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

    Guava leaves benefits | విటమిన్​ సీ పుష్కలం

    జామకాయలు, ఆకుల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో దోహదం చేస్తుంది. ఓ ఆరెంజ్ తినడం వల్ల వచ్చే సీ విటమిన్ కన్నా.. రెట్టింపు విటమిన్ జామకాయను తినడం ద్వారా వస్తుంది. అలాగే మనకు వేడి చేసినప్పుడు విటమిన్ సీ బాడీలో నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఈ సమయంలో జామకాయలు తినడం వల్ల తిరిగి తెచ్చుకోవచ్చు. జామ కాయలు, జామ ఆకులతో ఉండే ఉపయోగం తెలిసింది కాదా.. నిత్యం జీవితంలో వీటిని భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం (Health tips) మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందుకు మీ వ్యక్తిగత వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోని పాటించండి.

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    Follow Us : WhatsappFacebookTwitter

  • Bhai Dooj | నేడు భగినీ హస్త భోజనం.. అన్నాచెల్లెలి అనుబంధాల పండుగ.. దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటంటే..?

    Bhai Dooj | నేడు భగినీ హస్త భోజనం.. అన్నాచెల్లెలి అనుబంధాల పండుగ.. దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటంటే..?

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Bhai Dooj | భాయ్​ దూజ్​.. (భగినీ హస్త భోజనం) ఈ పండుగను ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో జరుపుకుంటారు. కార్తీకమాసంలో రెండో రోజు ఈ భాయ్ దూజ్ పండుగను చేసుకుంటారు. దీనిని మన తెలుగువారు యమ విదియ అని కూడా అంటారు. ఈ పండుగ పురాణాల్లో రక్షాబంధన్ అని చెప్పుకోవచ్చు. సోదరసోదరీమణికి సంబంధించిన పండుగ. అయితే ఈ యేడు నేడు (అక్టోబర్ 23న) జరుపుకుంటున్నారు.

    దేశంలోని అతిపెద్ద పండుగలలో భాయ్ దూజ్ కూడా ఒకటి, ఇది దీపావళి అనంతరం రెండు రోజుల తర్వాత, అలాగే గోవర్ధన్ పూజ ఒక రోజు తర్వాత జరుపుకుంటారు. అదే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో భగినీ హస్త భోజనం పండుగగా జరుపుకుంటారు. భగినీ అనగా సోదరి అని అర్థం. అంటే.. ఈ రోజు సోదరి వండి పెట్టే భోజనాన్ని సోదరులు తినాలి అన్నమాట. సోదరులు.. సోదరి ఇంటికి వెళ్లి.. భోజనం చేయడంతో పాటు ఆమెకు ఒక చీర, రవికను బహుకరించాల్సి ఉంటుంది. ఇది వారి మధ్య బంధాన్ని మరింత పెరిగేలా చేస్తుంది. సోదర, సోదరీ బంధం అనేది పుట్టుక నుంచి ఉంటుంది. అది ప్రేమానురాగాలతో నిండిన బంధం. అందుకే ఈ రోజున సోదరుడు సోదరి ఇంట్లో భోజనం చేస్తే.. ఆమె ఎంతో సంతోషిస్తుంది. అంతేకాకుండా.. పురాణాల ప్రకారం ఇద్దరికీ అపమృత్యు దోషాలు ఉండవు అని పండితులు చెబుతున్నారు. ఇందుకు ఒక పురాణ కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం..

    Bhai Dooj | ఈ రోజు ఏం చేయాలంటే..

    మహిళలు ఉదయమే నిద్రలేచి స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పాటు పూజ గదిలో దీపం వెలిగించాలి. విష్ణువు, వినాయకుడికి పూజ చేయాలి. ఈరోజున సోదరుడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. నుదుటున బొట్టు పెట్టి  హారతి ఇవ్వాలి. తన కుడిచేతి ఉంగరం వేలితో సోదరుడికి తిలకం దిద్దాలి. చేతికి రక్షా దారం కట్టి స్వీట్లు తినిపించాలి. అనంతరం సోదరిని దీవించి బహుమతి ఇవ్వడం ఆచారంగా వస్తోంది.

    Bhai Dooj | పురాణ గాథ..

    పూర్వకాలంలో యముడు మార్కండేయుడిని తనతో తీసుకువెళ్లేంఉదకు యమపాశం విసిరాడు. దీనిని తప్పించుకునేందుకు మార్కండేయుడు వెంటనే శివలింగాన్ని ఆలింగనం చేసుకొని.. కాపాడాలని వేడుకున్నాడు. అయితే.. యముడు విసిరిన యమపాశం మార్కండేయుడిని చుట్టుకుంది. ఆ క్రమంలో అది శివలింగాన్ని సైతం చుట్టుకుందట.

    Bhai Dooj | దీంతో కోపోద్రిక్తుడైన శివుడు తన త్రిశూలాన్ని యముడిపైకి వదిలాడు. త్రిశూలం.. వేగంగా యముడివైపు రావడంతో పరుగు మొదలుపెట్టాడు. ఏం చెయ్యాలో తెలియక.. తన సోదరి ఇంటికి వెళ్లాడు. చాలా కాలం తర్వాత అన్నయ్య రావడంతో.. ఆనందపడిన ఆమె.. యముడికి భోజనం పెట్టింది.

    సరిగ్గా అదే సమయంలో.. త్రిశూలం అక్కడికి వచ్చింది. భోజనం చేస్తున్న యముడి జోలికి వెళ్లకుండా ఆగిపోయింది. ఎందుకనగా.. భోజనం తినేవారిని మధ్యలో అంతరాయం కలిగించకూడదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉందని పండితులు చెబుతుంటారు. ఈ కారణంగానే త్రిశూలం.. తిరిగి శివుడిని చేరింది. అప్పటికి శివుడి ఆగ్రహం కాస్త చల్లారడంతో యుముడిని క్షమించి వదిలేశాడు.

    Bhai Dooj
    Bhai Dooj

    త్రిశూలం తిరిగి వెళ్లిపోవడంతో యముడు ఊపిరిపీల్చుకున్నాడు. తన చెల్లి చలవ వల్లే ప్రాణాలు కాపాడుకున్నాను అనుకున్నాడు. ఈ క్రమంలో ‘నా ప్రాణాలు కాపాడావు. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు.’ యముడి సోదరి స్పందిస్తూ నువ్వు ఆరోగ్యంగా ఉండటమే నాకు చాలు సోదరా అని అంది. కానీ యముుడు ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు. దాంతో ఆమె స్పందించి.. ‘నువ్వు ఎలాగైతే.. నా వంట తిని మృత్యువు నుంచి తప్పించుకున్నావో.. అలాగే.. సోదరి పెట్టే భోజనం ఆరగించిన వారిందరికీ అపమృత్యు దోషం లేకుండా కరుణించాలని’ కోరింది. దీంతో యముడు ఆ వరం ఇచ్చాడని పురాణ గాథ.

    గమనిక: Bhai Dooj ఈ కథనం ప్రజల విశ్వాసలతో పాటు సామాజిక మాద్యమాల్లో లభించిన సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చాం. దీనిని విశ్వసించడం అనేది మీ వ్యక్తిగతం.

    Benefits of smile | ఎంత నవ్వితే అంత ఆరోగ్యం.. నవ్వులో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం..!

    Follow Us : WhatsappFacebookTwitter

  • Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​​: Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచివని మనకు తెలిసిందే. దీంతో ఆరోగ్యమే కాదు.. సౌందర్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఎన్నో పోషకాలు ఉండే ఈ గింజల్ని తీసుకోవడం వల్ల అనే లాభాలు ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, బాడీ డీటాక్స్ చేయాలన్నా.. ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఆరోగ్యంతో పాటు అందానికి దోహదం చేసే సబ్జా గింజల గురించి తెలుసుకుందాం..

    సబ్జా గింజలు (Sabja Seeds) పోషకాలతో కూడిన సూపర్‌ఫుడ్. వీటిని ఎన్నో రకాల మెడిసిన్, వంటల్లో సైతం వాడుతుంటారు. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ఐరన్​, మెగ్నీషియం, కాల్షియం, వంటి ఖనిజాలతో పాటు ఇతర సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవి పేగు కదలికలను పెంచుతాయి. అంతేకాకుండా ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. వీటిని పరగడుపున తీసుకుంటే ఇంకా మంచిది. ఈ గింజలలో ఉండే సహజమైన డీటాక్స్ గుణాలు.. చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుందంటున్నారు.

    Sabja Seeds Benefits | డీటాక్సిఫికేషన్..

    సాధారణంగా వాహనాల నుంచి వెలువడే పొగ, కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల చర్మం కాంతిని కోల్పోతుంది. అంతేకాకుండా మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేయాలంటే సబ్జా గింజలు సరైన ఎంపిక అని అంటున్నారు. ఈ గింజల్లో ఉండే డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లోని టాక్సిన్లను బయటకు పంపిస్తాయని పేర్కొంటున్నారు. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది.

    Sabja Seeds Benefits | చర్మం కాంతివంతంగా..

    సబ్జా గింజల్లో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు దోహదం చేస్తుంది. అంతే కాకుండా ఈ గింజల్లో విటమిన్ ఏ, సీ, కాపర్, పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి మనలో చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.

    Sabja Seeds Benefits | ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేలా..

    కొంతమందికి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తే అంత త్వరగా తగ్గవు. అలాంటి వారు రెగ్యులర్​గా సబ్జా గింజలను తీసుకోవడం మంచిదట. ఇందులోని యాంటీ బయోటిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయని ఓ అధ్యయనంలో తేలింది.

    గమనిక: మేం అందించిన ఈ సమాచారం కేవలం సాధారణ సలహా కోసమే. ఆహార మార్పులు లేదా సప్లిమెంట్లను ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి.

    Benefits of smile | ఎంత నవ్వితే అంత ఆరోగ్యం.. నవ్వులో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం..!

  • Improve WiFi Speed |మీ ఇంట్లో వైఫై వేగం తగ్గిందా..? ఈ చిట్కాలతో సమస్యను పరిష్కరించుకోండి..!

    Improve WiFi Speed |మీ ఇంట్లో వైఫై వేగం తగ్గిందా..? ఈ చిట్కాలతో సమస్యను పరిష్కరించుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: మీ ఇంట్లో వై-ఫై వేగం సాధారణం కంటే నెమ్మదిగా వస్తోందా..? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసే ముందు.. మీరు స్వయంగా కొన్ని సులభతరమైన పరీక్షలు చేయవచ్చు. చిన్నచిన్న టెక్నిక్స్​ ద్వారా వేగాన్ని పెంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా..

    Improve WiFi Speed | మీ రౌటర్ స్థానం చెక్​ చేయండి..

    వై-ఫై వేగం తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రౌటర్ అమర్చిన స్థానం. ఒకవేళ మీ రౌటర్ ఇంటి మూలలో లేదంటే విడిగా ఉన్న ప్రాంతంలో ఉంటే అది సిగ్నల్ బలంతో పాటు కనెక్టివిటీపై ప్రభావితం చూపిస్తుంది. వైర్‌లెస్ రౌటర్ మాములుగా ఒక అంతస్తు ఇంటిని కవర్ చేయగలదు. కానీ, మీరు బహుళ అంతస్తుల ఇంట్లో ఉన్నట్లయితే సిగ్నల్​ కవరేజ్ కోసం వైఫై ఎక్స్‌టెండర్లు లేదా మెష్ రౌటర్లను వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే రౌటర్‌ను సిగ్నల్స్ గోడలు, తలుపులు లాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా వ్యాప్తి చెందే స్థానంలో ఉంచాలి.

    ‌How to Improve WiFi Speed : రౌటర్‌ను ఇంటి మధ్యలో ఉంచాలి..

    మీ వైఫై రౌటర్‌ను ఏర్పాటు చేయడానికి ఇంటి మధ్య భాగం అనువైన స్థలం. సాధారణంగా హాల్​ లేదా లివింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేయడం వల్ల ఇల్లు మొత్తం సిగ్నల్​ సమానంగా వస్తుంది. అంతేకాకుండా రౌటర్‌ను బుక్‌షెల్ఫ్ లేదా క్యాబినెట్ పైభాగం లాంటి ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేయడం మంచిది. ఇలా పెట్టడం వల్ల రౌటర్లు తక్కువ అడ్డంకులను ఎదుర్కోవడంతో పాటు సిగ్నల్​ను సమర్థవంతంగా ప్రసారం చేస్తుంది. దీని వల్ల వేగం బాగా ఉంటుంది.

    Improve WiFi Speed : రౌటర్‌ను ఈ ప్రదేశాల్లో పెట్టొద్దు..

    చాలా మంది రౌటర్‌ను టీవీల వెనుక లేదంటే ఫర్నిచర్ వెనుక, గృహోపకరణాల వెనుక ఏర్పాటు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సిగ్నల్​ కొంత వీక్​గా ఉంటుంది. మరో విషయం ఏమిటంటే.. మైక్రోవేవ్ ఓవెన్, టీవీ, ఎలక్ట్రానిక్ పరికరాల రౌటర్​ ఏర్పాటు చేయడం వల్ల సిగ్నల్ ప్రసారానికి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి రౌటర్​ చుట్టు పక్కల ఇలాంటి పరికరాలు లేకుండా ఖాళీ ప్రదేశంలో ఉంచాలి.

    ఇలాంటి చిన్నచిన్న టిప్స్​ పాటించి మీ రౌటర్​ వేగాన్ని పెంచుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు పాటించినా కూడా వైఫ్​ వేగం పెరగకపోయినట్లతే మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సంప్రదించాల్సి ఉంటుంది.

    Improve WiFi Speed
    Improve WiFi Speed

    Ujjwala Scheme : ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్..!

    Follow Us : Whatsapp, Facebook, Twitter

  • Ujjwala Scheme | ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్.. ఉజ్వల యోజనకు దరఖాస్తు చేసుకోండి..

    Ujjwala Scheme | ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్.. ఉజ్వల యోజనకు దరఖాస్తు చేసుకోండి..

    తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు మహిళలు ఇళ్లలో కట్టెల పొయ్యిపై వంట చేసేవారు. ఈ పొగ ఆరోగ్య సమస్యలకు దారితీసేది. అయితే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనుకుంది. ఇందుకోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనకు (Pradhan Mantri Ujjwala Yojana) శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2016 ఈ పథకాన్ని ప్రారంభించారు. యూపీలోని బలియాలో పథకాన్ని అంకురార్పణ చేశారు. ఈ పథకంలో భాగంగా పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందిస్తోంది. ఇందులో భాగంగా ఏడాదికి 12 సిలిండర్లు పొందవచ్చు. ఈ పథకానికి అర్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకుందాం..

    Ujjwala Scheme | రూ. 550కే గ్యాస్ సిలిండర్

    Ujjwala Scheme వంట గ్యాస్ సిలిండర్ రాకతో సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. గ్యాస్ వల్ల ముఖ్యంగా మహిళలకు కట్టెల పొయ్యి అవస్థలు తప్పాయి. అయితే వీటిని పేదలు కొనుగోలు చేయలేకపోయేవారు. దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజనను ప్రవేశ పెట్టింది. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా.. రూ.550కే సిలిండర్ను అందిస్తున్నారు.

    కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్
    ఉజ్వల యోజన కింద తొలి దశలో భాగంగా దేశ వ్యాప్తంగా 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లను ఇచ్చారు. అలాగే రెండో దశలో (UJJWALA 2.0) డిసెంబర్ 2024 వరకు 2.34 కోట్ల కనెక్షన్లు ఉచితంగా అందించారు. ప్రస్తుతం నూతన దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

    పొగ కష్టాలు దూరం
    ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన మహిళల ఇబ్బందులను తొలగించింది. కట్టెలు, బొగ్గులు, పిడకలు ఉపయోగించి వంట చేసేటప్పుడు విషపూరితమైన పొగ వస్తుంది. నిత్యం ఈ పొగను పీల్చుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉజ్వల యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. అలాగే అనారోగ్యాల బారిన నుంచి బయట పడేలా చేసింది.

    Ujjwala Scheme : ప్రయోజనాలివే..


    ఉజ్వల యోజనలో భాగంగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ లభిస్తుంది.
    రూ. 550కే గ్యాస్ సిలిండర్ లభ్యమవుతుంది.
    కనెక్షన్ తీసుకున్న సమయంలో గ్యాస్ నింపిన సిలిండర్ ఇస్తారు.
    ఈ పథకం పేద ప్రజలకు వరంలా మారింది.

    అర్హతలివే..

    పథకం లబ్ధిదారు మహిళ అయి ఉండాలి.
    వయస్సు 18 ఏళ్లకు పైబడి ఉండాలి.
    షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారు అయ్యి ఉండాలి.
    దారిద్య్ర రేఖకు దిగువన గల కుటుంబం (BPL) ఉండాలి.
    ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు కావలసిన పత్రాలు..
    ఆధార్ కార్డు (aadhar card)
    నివాస ధృవీకరణ పత్రం
    పాస్‌పోర్ట్ సైజు ఫొటో
    ఆహార భద్రత కార్డు
    కుల ధ్రువీకరణ పత్రం

    Ujjwala Scheme కి ఈ–కేవైసీ (e-KYC) తప్పనిసరి..

    ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా ఈ–కేవైసీ (e-KYC) చేయించుకోవాలి. ఇందుకోసం బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ (IFSC code) అవసరం అవుతాయి. ఉజ్వల యోజన అధికారిక వెబ్‌సైట్‌లో (https://pmuy.gov.in/) దరఖాస్తు చేసుకోవచ్చు.


    Benefits of smile | ఎంత నవ్వితే అంత ఆరోగ్యం.. నవ్వులో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం..!
  • Benefits of smile | ఎంత నవ్వితే అంత ఆరోగ్యం.. నవ్వులో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం..!

    Benefits of smile | ఎంత నవ్వితే అంత ఆరోగ్యం.. నవ్వులో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Benefits of smile | నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం.. అన్నాడో మహాకవి.. ఈ యాంత్రిక యుగంలో ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్ర పోయే వరకు ఉరుకులు పరుగులు.. ఒకరినొకరు పలకరించుకోవడమే గగనమైపోయింది. ఎవరి గోల వారిదేలా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న చాలా జీవనశైలి సమస్యలకు మానసిక ప్రశాంతత కొరవడడమే కారణంగా మారుతోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎన్నో మానసిక సమస్యలకు నవ్వు నిజమైన ఔషధంగా పనిచేస్తుది. ఒక్క నవ్వుతో ఆనందాన్ని, ప్రశాంతతను సాధించొచ్చు. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యం మన సొంతమవుతుంది.

    నవ్వు నాలుగు విధాల చేటు అనేది ఒకప్పటి మాట.. కానీ నవ్వు పలు విధాలా మంచిదనేది నేటి మాట. నవ్వడం (smile) వల్ల ఎన్నో మానసిక, శారీరక సమస్యలు దూరమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కడుపు నిండా నవ్వడం.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం వంటి పదాలు చాలా మంది నోట వింటూ ఉంటాం. అంటే మనస్పూర్తిగా నవ్వడం అన్నట్లు. ఇలా ఎంత ఆహ్లాదకరమైన, సంతోషకరమైన స్థితిలో ఉంటే అంతలా నవ్వుతామన్నట్లు. ఇలా నవ్వడం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు, డొపమైన్​, సెరెటోనిన్​ వంటి హ్యాపీ హార్మోన్స్​ ఉత్పత్తి అవుతాయి. మనం ఎంత నవ్వితే అంత ఎక్కువ ఆనంద హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మెదడు మరింతగా ఆనందిస్తుందన్నమాట. నవ్వడం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం పదండి..

    Benefits of smile | ఔషధంగానూ పనిచేస్తుంది..

    నవ్వడంలో పిల్లలు ఛాంపియన్లు. పిల్లలు రోజుకు సగటున 300 – 400 సార్లు నవ్వుతారని పరిశోధనలు పేర్కొంటున్నారు. ఇక పెద్దవారయితే రోజుకు దాదాపు 40-50 సార్లే నవ్వుతారు. పిల్లలు అంత సంతోషంగా, కల్మషం లేకుండా ఉండడానికి నవ్వే కారణమట. గతంలో వైద్యులు తమ వద్దకు చికిత్స కోసం వచ్చేవారికి మందులతో పాటు రోజుకు 500 సార్లు నవ్వాలని సూచించే వారట.. దీంతో మానసిక స్థితి మెరుగుపడి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆనాడే గ్రహించారనుందుకు ఇది నిదర్శనం.

    Benefits of smile | మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది..

    నవ్వు మన మెదడుతో పాటు శారీరానికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆరోగ్యానికి అన్ని రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. నవ్వడం వల్ల ఎండార్ఫిన్‌లు విడుదలై మనసు ప్రశాంతంగా మారుతుంది. దీంతో మానసిక ఒత్తిడి దూరమై మానసిక స్థితి ఎంతో మెరుగుపడుతుంది. నవ్వు ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ఒక గొప్ప మార్గంగా చెప్పవచ్చు. నిరాశలో ఉన్న సమయంలో నవ్వు తెప్పించే పనులు చేయడం వల్ల ఎంతో రిలీఫ్​ పొందవచ్చు.

    Benefits of smile

    Benefits of smile | ఒత్తిడిని తగ్గించే మార్గం..

    నవ్వు అనేది ఒత్తిడిని తగ్గించడానికి ఒక గొప్ప మార్గంగా చెబుతుంటారు. మీరు నవ్విన సమయంలో మీ శరీరం హ్యాపీ హార్మోన్లను విడుదల చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇవి కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ బలపడేలా చేస్తుంది. రక్తపోటు, హృదయం సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అందుకే ఒత్తిడికి గురైనప్పుడు ఫన్నీ సినిమాలు చూడడం.. హాస్యభరితమైన పుస్తకం చదవడం, లేదంటే మిమ్మల్ని నవ్వించే స్నేహితులతో సమయం గడపండి.

    Benefits of smile | రోగనిరోధక శక్తి పెరుగుదల

    నవ్వు రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుందనే వాస్తవం. నవ్వు శరీరంలోని రోగనిరోధక కణాల సంఖ్యను పెంచుతుంది. మనం నవ్విన ప్రతి సారి శరీరం తెల్ల రక్త కణాలను విడుదల చేస్తుంది. దీని వల్ల రోగ నిరోధ శక్తి పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

    Benefits of smile | హృదయనాళ పనితీరుపైనా ప్రభావం

    ఆరోగ్యకరమైన హృదయానికి నవ్వు ఉత్తమ ఔషధం చెప్పవడచ్చు. ఎందుకంటే నవ్వు మీ హృదయనాళ పనితీరును మెరుగుపరుస్తుంది. మీ హృదయ స్పందన రేటుతో పాటు రక్త ప్రవాహాన్ని పెంచడంవల్ల ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో దోహదం చేస్తుంది. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.

    Benefits of smile | నొప్పిని తగ్గించే నవ్వు

    నవ్వడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక అధ్యయనంలో నవ్విన వారిలో కలిగిన నొప్పి కంటే నవ్వని వారిలో నొప్పి అధికంగా కలిగినట్లు తేలింది. ఆర్థరైటిస్, తలనొప్పి, రుతు సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో నవ్వు సహాయపడుతుందని స్టడీస్​ పేర్కొంటున్నాయి.

    Benefits of smile | శక్తిని ఇవ్వడంలో కీలకం

    మీరు నవ్వినప్పుడు మంచి అనుభూతిని కలిగించడమే కాదు.. మీలో శక్తిని కూడా పెంచుతుందట. నవ్విన సమయం కండరాలు సంకోచించబడడం వల్ల హృదయ స్పందన రేటు, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది శరీరంలోని కేలరీలను బర్న్ చేస్తుంది. రోజుకు 10 నుంచి 15 నిమిషాల పాటు నవ్వడం వల్ల 40 కేలరీల వరకు బర్న్ అవుతాయి. ఆక్సిజన్ తీసుకోవడం పెంచుతుంది. దీంతో మనలోని శక్తి పెరుగుతుంది.

    Benefits of smile | మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది..

    నవ్వడం వల్ల మనలోని మెదడు పనితీరు సైతం మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, దృష్టిని పెంచడానికి సహాయం చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో.. నవ్వడానికి విరామం తీసుకునే ఉద్యోగులు, నవ్వని వారి కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉంటారని తేలింది. నవ్వు దృష్టితో పాటు సృజనాత్మక, ఆలోచన శక్తిని పెంచుతుంది.

    Benefits of smile | జీవిత కాలం పెంచుతుంది..

    నవ్వు ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడుతుందట. నవ్వు కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. నవ్వు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడడంతో యాంటీబాడీలు, పోరాట కణాల ఉత్పత్తిని పెంచుతుంది. రక్త ప్రవాహంలో పెరుగుదల, ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వల్ల ఆయుర్ధాయం మెరుగుపడుతుంది.

    Benefits of smile | ఇతరులు నవ్వితే నవ్వకుండా ఉండలేరు..

    ఎవరైనా నవ్వడం చూసినప్పుడు మనలోనూ ఆటోమెటిక్​గా నవ్వు పుడుతుంది. మీరు ఒక సమూహంలో ఉన్న సమయంలో ఎవరైనా నవ్వడం మొదలుపెట్టారంటే.. ఇతరులు కూడా నవ్వడం ప్రారంభిస్తారు. ఇలా మొత్తం సమూహం నవ్వుతుంది. ఉదాహరణకు మీరు కామెడీ సినిమాను ఒంటరిగా చూసిన సమయంలో కంటే.. అందరితో కలిసి థియేటర్​లో చూస్తే ఎక్కువగా నవ్వుతారు. ఒకరిని మరొకరికి నవ్వు పుడుతుందనడానికి చుట్టు పక్కల పరిస్థితులు కూడా దోహదం చేస్తాయి.

    నవ్వడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా.. కాబట్టి నిత్య జీవితంలో వీలైనంత ఎక్కువగా నవ్వండి.. ఆనందంగా ఉండండి.. నవ్వడం వల్ల పోయేదేముంది బాస్​.. అనేక రోగాలు తప్పా.. అందుకే హాయిగా నవ్వేస్తూ జీవితాన్ని గడిపేద్దాం.. చిన్న చిరునవ్వుతో కథనాన్ని ముగిద్దాం..

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

    Late night sleep | రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..

  • Chronic constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఐదు రకాల ఆహారాలు తీసుకోండి..!

    Chronic constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఐదు రకాల ఆహారాలు తీసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Chronic constipation | మలబద్ధకం.. ఈ సమస్య రోజంతా చిరాకు తెప్పిస్తుంది. సరిగ్గా తినలేకపోతుంటాం.. నీళ్లు తాగలేకపోతుంటాం.. ఒక వేళ బయటకు వెళ్లాలంటే కూడా ఇబ్బందిగానే ఉంటుంది.. ప్రశాంతంగా కూర్చోలేకపోతుంటాం.. నిలబడలేకపోతుంటాం.. ఈ సమస్య నుంచి బయట పడాలంటే మంచి లైఫ్​స్టైల్​ను మెయింటెయిన్​ చేయడం ఎంతో ముఖ్యం.

    ఈ సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు అనేక అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల.. బ్రిటిష్ డైటెటిక్ అసోసియేషన్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ప్రచురించింది. ఈ ఐదు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల మలబద్ధకం (Chronic constipation) సమస్య తగ్గుతుందని NBC న్యూస్ నివేదిక పేర్కొంది.

    Chronic constipation | కివీ ఫ్రూట్​..

    కివీలో ఫైబర్ సమృద్ధి ఉంటుంది. ఇందులో యాక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పేగు కండరాలను ప్రోత్సహించి జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీర్ఘకాల మలబద్ధకం ఉన్నవారు కివీని క్రమం తప్పకుండా తినడం వల్ల మలవిసర్జన తరచూ జరుగుతుంది. రోజూ 1-2 కివీలు తినొచ్చు. ఉదయం భోజనంలో, పెరుగులో సైతం జోడించి ఆరగించవచ్చు.

    Chronic constipation | రై బ్రెడ్..

    రై బ్రెడ్ అనేది హోల్-గ్రెయిన్ రై, నీటిని శోషించే ద్రావణీయ ఫైబర్‌ను అందిస్తుంది. ఇది కాన్టిపేషన్​ సమస్యను తగ్గిస్తుంది. కొన్ని పరిశోధనలు రై బ్రెడ్.. సాధారణంగా ఫైబర్ పెంచే ఆహారాల కంటే ఎక్కువ ప్రభావితం చేసినట్లు పరిశోధనల్లో కనుగొన్నారు.

    Chronic constipation | మెగ్నీషియం అధికంగా ఉండే మినరల్ వాటర్

    మెగ్నీషియం సరైన రీతిలో ఉపయోగించినప్పుడు లాక్సటివ్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెగ్నీషియం అధికంగా ఉన్న మినరల్ వాటర్ తాగడం వల్ల స్టూల్​ అనేది సులభంగా బయటకు రావడానికి దోహదం చేస్తుంది.

    Chronic constipation | ప్రోబయాటిక్స్

    మలబద్ధకం సమస్యను నివారించడంలో ప్రోబయాటిక్స్​ సైతం దోహదం చేస్తాయి. అయితే ఆహారం ద్వారా పూర్తిస్థాయిలో లభించకపోతే.. సప్లిమెంట్స్​ తీసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. తక్కువ మోతాదులో వైద్యుడు సిఫారసు చేసిన ప్రోబయాటిక్ స్ట్రెయిన్‌ను వాడొచ్చు.

    Chronic constipation | ఎండు ద్రాక్ష

    ఎండు ద్రాక్ష సైతం కాన్ట్సిపేషన్​ సమస్యను తగ్గించడంలో దోహం చేస్తుంది. వీటిని స్నాక్స్​ లేదా భోజనంలో భాగంగా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

    గమనిక: మేం అందించిన ఈ సమాచారం కేవలం సాధారణ సలహా కోసమే. ఆహార మార్పులు లేదా సప్లిమెంట్లను ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి.

    Source : Indiatv news

    Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్​ పేషెంట్స్​ తినొచ్చా..!

  • Late night sleep | రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..

    Late night sleep | రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Late night sleep | ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కంటి మీద కునుకు కరువైపోయింది. పని ఒత్తిడి, ఇతర టెన్షన్స్​, మొబైల్​, టీవీ స్క్రీన్​లకు అతుక్కుపోవడం నిద్రకు దూరం చేస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహ్లాదకరమైన జీవన శైలికి సమతుల ఆహారం ఎంత ముఖ్యమో.. సుఖమయమైన నిద్ర అంతే తప్పనిసరి. ఈ రెండు సక్రమంగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా సగటు మానవుడు ఎన్ని గంటలు నిద్ర పోవాలి తదితర విషయాలు తెలుసుకుందాం పదండి..

    Late night sleep | నిద్రలేమికి కారణాలివే..

    రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వారు (late night sleep) అనారోగ్య సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారనేది సత్యం. ముఖ్యంగా బిజీబిజీ జీవితం, అనేక ఒత్తిళ్లు ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆలస్యంగా నిద్రించే వారు అనారోగ్యకమైన అలవాట్ల వల్ల సగటు ఆయు ప్రమాణం తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో పని చేసేవారు.. లేదంటే ఫోన్లు, టీవీలు ఎక్కువగా చూసే వాళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీనివల్ల నిద్రలేమి సమస్య తలెత్తి అనారోగ్యాల భారిన పడుతున్నారు. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యం సైతం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి అనేది భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

    Late night sleep | మానసిక ఆరోగ్యంపై ప్రభావం

    నిద్ర లేకపోవడం మూలంగా కేవలం శారీరక ఆరోగ్యం కాకుండా.. మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. సరిపోనూ నిద్ర లేకపోతే, ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు వస్తుంటాయి. నిద్రలో మెదడు రోజూ వారి కార్యకలాపాలను ప్రాసెస్ చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి అనేది తగ్గపోతుంది. కాగా.. నిద్రలేమి సమస్య ఎదుర్కొనే వారిలో మెదడుపై ప్రభావం పడుతుంది. దీనివల్ల మానసిక స్థితిలో మార్పులు, చిరాకు, కోపం తదితర ఇబ్బందులు కలుగుతాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు.

    Late night sleep | రోగనిరోధక శక్తిపై ప్రభావం..

    నిద్ర అనేది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. సరిగ్గా నిద్రపోక పోయినట్లయితే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశాలు ఉంటాయి.

    Late night sleep | జ్ఞాపకశక్తి దెబ్బతినే అవకాశాలు..

    మెదడుకు నిద్ర అనేది ఎంతో ముఖ్యం. ఇది జ్ఞాపకశక్తితో పాటు అభ్యాసన సామర్థ్యాన్ని, ఏకాగ్రతను కాపాడడంలో దోహదం చేస్తుంది. నిద్రలేమి (Insomnia) వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం లాంటి వాటిపై సైతం ప్రభావం కనిపిస్తుంది.

    Late night sleep | బరువు పెరుగుదల సమస్య..

    నిద్రలేమికి.. ఊబకాయం మధ్య సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరిపోయేంత నిద్ర లేకపోవల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని చెబుతున్నారు. దీనివల్ల ఆకలిని ప్రేరేపించే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ క్రమంలో ఎక్కువగా తినే అవకాశాలుంటాయి. అధిక కేలరీలు ఉండే ఆహారంతో పాటు తీపి పదార్థాలు తినాలని అనిపిస్తుందట. ఇవి ఇది బరువు పెరగడానికి దారితీస్తాయి. జీవక్రియపై ప్రభావం చూపడంతో బరువు పెరుగుదలకు దారితీయొచ్చు.

    Late night sleep | ఇతర ప్రభావాలూ ఉంటాయి..

    నిద్ర సమస్య కారణంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. నిద్రలో మన శరీరం రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశాలుంటాయి. దీంతో గుండెకు ఒత్తిడి పడి హృదయ సంబంధ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.

    Late night sleep | ఎంతసేపు నిద్ర పోవాలంటే..

    సాధారణంగా మనిషిలో వయసు ఆధారంగా నిద్రపోయే విధానం ఉంటుంది. పసిపిల్లలు ఎక్కువ సేపు నిద్రపోతారు. అయితే క్రమంగా వయస్సు పెరిగే కొద్దీ నిద్ర అనేది తగ్గుతుంది. అప్పుడే పుట్టిన శిశువు రోజుకు 11 నుంచి 14 గంటల వరకు నిద్రపోవడం అవసరం. ఇక మూడు నుంచి ఐదళ్ల మధ్య వయస్సు గల పిల్లలు 10 గంటలు పడుకోవాల్సి ఉంటుంది. స్కూల్​కు వెళ్లే పిల్లలు రోజుకు కనీసం 8 గంటలు నిద్రించాలి. 18 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన వారయితే రోజు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి. 60 ఏళ్లు పైబడిన వారైతే కనీసం 6 గంటలైనా రోజుకు నిద్రపోవాల్సి ఉంటుంది.

    Late night sleep | చక్కగా నిద్ర పోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి..

    నిత్య జీవితంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. నిద్ర విషయం సమయపాలన పాటించాలి. రోజూ ఒక సమయం పెట్టుకుని నిద్రపోవాలి. నిద్ర లేవడంలోనూ సమయం పాటిస్తే చాలా మంచిది. రాత్రి సమయంలో భోజనానికి, నిద్రకు మధ్య కనీసం రెండు, మూడు గంటల సమయం ఉండేలా చూసుకోండి. నిద్రపోయేందుకు గంట ముందు నుంచే గ్యాడ్జెట్లను పక్కన పెట్టేయండి. అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు గోరువెచ్చటి పసుపు పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. నిద్రపోయే గదిలో సరైన వెంటిలేషన్‌తో పాటు చీకటిగా ఉండేలా చూసుకోవాలి. అలా ఇష్టం లేని వారుంటే కనీసం తక్కువ వెలుతురు ఉండే చూసుకోండి. ఇలా కొన్ని చర్యలు తీసుకోవడం నిద్ర బాగా పడుతుంది. హాయిగా నిద్ర పోవడం వల్ల ప్రశాంతమైన జీవితం గడపవచ్చు.

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం. Late night sleep can lead to various health issues, including fatigue and decreased cognitive function. It is advisable to prioritize a consistent sleep schedule to promote overall well-being.

    Follow Us : X.com, Facebook

    Read also : Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్​ పేషెంట్స్​ తినొచ్చా..!