తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: epfo | ఈపీఎఫ్‌వో తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వరుసగా నిబంధనలు సరళీకరిస్తూ వస్తున్న సంస్థ.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. విత్‌డ్రా నిబంధనలను మరింత సరళతరం చేసింది. ఇక నుంచి ప్రత్యేక సందర్భాల్లో ఖాతాదారులు తమ పీఎఫ్ అకౌంట్లోని వంద శాతం నిధులను ఉపసంహరించుకునే వీలు కల్పించింది.
EPFO | ఖాతాదారులకు మరింత సౌలభ్యం
ఈపీఎఫ్ (epfo) ఖాతాదారులకు మరింత సౌలభ్యం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. అనారోగ్యం, గృహ అవసరాలు, విద్య, వివాహం, అత్యవసర సమయాల్లో వంద శాతం పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అంతే ఉద్యోగులు తమ వాటాతో సహా యజమాని జమ చేసిన పీఎఫ్ డబ్బులు మొత్తం విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించింది.
కాగా.. గతంలో వివాహం, విద్య రెండింటికీ కలిపి కేవలం మూడు సార్లు మాత్రమే పీఎఫ్ అకౌంట్ నుంచి పాక్షిక విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు దీనిని మరింత సరళీకరించారు. ఇక నుంచి విద్య కోసం 10 సార్లు, వివాహం కోసం ఐదు సార్లు పీఎఫ్‌ను ఉపసంహరించుకునే వీలు కల్పించారు. కాగా.. ఉద్యోగులు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే కనీసం 12 నెలల సర్వీస్ ఉండాల్సి ఉంటుంది.
EPFO | ఇప్పుడు ఆ అవసరం లేదు..
పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే గతంలో కచ్చితంగా కారణాలు చెప్పాల్సి ఉండేది. సరైన కారణాలు లేకపోతే తరచుగా క్లెయిమ్‌లు రిజెక్ట్ అయ్యేవి. దీంతో ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు ఈ సమస్యను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఇక నుంచి పీఎఫ్ ఖాతాదారులు డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు.
EPFO | విశ్వాస్ పథకానికి శ్రీకారం
పీఎఫ్ వ్యాజాల పరిష్కారానికి ఈపీఎఫ్‌వో విశ్వాస్ పథకానికి (Vishwas scheme) శ్రీకారం ప్రారంభించింది. బకాయిల చెల్లింపులు ఆలస్యమవడం లాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ పథకం ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది. తరువాత మరో ఆరు నెలలు పొడిగిస్తారు. ఇది పీఎఫ్ ఖాతాదారులు, పెన్షనర్లకు ఉపయుక్తంగా ఉంటుందని ఈపీఎఫ్‌వో చెప్పింది.
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!