Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్​ పేషెంట్స్​ తినొచ్చా..!

సీతాఫలం.. ఈ పేరు వింటేనే ఈ పండును తినాలని మనసు లాగేస్తుంటుంది. రుచి ఒకటే కాదు.. దీని రుచి అమోఘం.. అంతేకాకుండా ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది..

by Harsha Vardhan
1 comment
Custard Apple

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Custard Apple | చలికాలం వచ్చిందంటే.. సీతాఫలాలు విరివిరిగా లభ్యమవుతాయి. పోషక విలువలు అధికంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి. గుల్లలు గుల్లలు తెచ్చుకుని ఇంట్లో మగ్గబెట్టుకుని పొద్దునా, సాయంత్రం తినేవాళ్లం. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఈ పండును లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. వీటిని చూస్తే తినాలని మనసు ఇట్టే లాగేస్తుందంటే అతిశయోక్తి కాదు. వీటి రుచి అలా ఉంటుంది మరి. రుచి ఒకటే కాదు.. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి.

Custard Apple | ఒత్తిడి దూరం..

సీతాఫలాన్ని ఒక్కోచోట ఒక్కోలా పలుకుతారు.. చిత్తలపండు, చిత్తలకాయ, చిత్పలకాయ ఇలా ఎవరు ఎలా పిలిచినా.. దీని రుచి మాత్రం అమోఘం. వీటిని తినడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు సైతం దరి చేరకుండా ఉంటాయి. అలాగే గాయాలు కూడా త్వరగా మానుతాయని చెబుతుంటారు. అంతేకాకుండా మలబద్ధం సైతం తగ్గుతుంది. ఇవి ఒంటికి చలవ చేస్తాయి. అందుకే సీజన్​లో రోజూ వీటిని తినడం వల్ల కడపులో మంట తగ్గుతుంది. వీటి వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. కండరాలు, నరాల బలహీనత తగ్గడానికి సైతం సీతాఫలం తోడ్పడుతుంది.

Custard Apple

Custard Apple | పోషకాలు అధికం..

సీతాఫలంలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. కస్టర్డ్ యాపిల్ (Custard Apple) అని పిలిచే ఈ ఫలంలో ఐరన్, మెగ్రీషియం, పాస్ఫరస్​లతో పాటు విటమిన్-సి (Vitamin-C) సైతం సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వంద గ్రాముల సీతాఫలంలో 68.6 గ్రాముల తేమ, 26.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.6 గ్రాముల కొవ్వు, 2.4 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయని పేర్కొంటున్నారు.

Custard Apple | డయాబెటిస్​ ఉన్న వాళ్లూ తినొచ్చు..

మధుమేహం (Diabetes) ఉన్నవాళ్లు మితంగా ఈ పండుని తినొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది ఇన్‌ ఫ్లమేషన్‌ను తగ్గించడంతో పాటు గుండెకు మేలు చేస్తుందంటున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, పీచు, ఐరన్‌, విటమిన్‌-ఏ, సీ (Vitamin A) ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే సీతాఫలం తినడం ద్వారా జలుబు చేస్తుందని చాలామందికి అపోహ ఉంటుంది. కానీ అది నిజం కాదని వైద్యులు చెబుతున్నారు.

Custard Apple | అనారోగ్య సమస్యలుంటే దూరం ఉండడం మంచిది..

ఈ పండును కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎలర్జీతో బాధపడేవాళ్లు దీనిని తినడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవాళ్లు సీతాఫలం తినొద్దని పేర్కొంటున్నారు.

ఇక సీతాఫలంలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో వైద్యులు రక్తహీనతతో బాధపడుతున్న దీనిని తీసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఇది అలసటను సైతం దూరం చేస్తుంది. సీతాఫలంలోని పీచు పదార్థం టాక్సిన్స్​ను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాక ఎసిడిటీ లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇంకేం.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఈ సీతాఫలాన్ని ఈ సీజన్​లో ఆస్వాదిద్దాం మరి..

గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం (Health tips) మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
Focus Mode
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00