తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Green chilli | భారతీయ సంప్రదాయంలో పచ్చిమిర్చి (Green chilli) లేకుండా వంట అసంపూర్ణమే అని చెప్పారు. ఎందుకు దాదాపు అన్ని వంటకాల్లో పచ్చిమిర్చి వాడుతుంటాం. అయితే పచ్చి మిరపకాయలు రుచికి కారంగానే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి బహుళ ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయనే విషయం తెలుసుకోవాలి. పచ్చి మిరపకాయలను ఆహారంలో తగిన మోతాదులో చేర్చుకోవడం ద్వారా కలిగే తెలుసుకుందాం!
Green chilli | విటమిన్లు ఇవే..
ఒక కప్పు పచ్చిమిరపకాయల్లో విటమిన్ సి (52.76 శాతం), సోడియం (36.80 శాతం), ఇనుము (23.13 శాతం), విటమిన్ బి9 (18.29 శాతం), విటమిన్ బి6 (12.85 శాతం) ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదనంగా, ఇందులో విటమిన్లు A, B, C, E, P, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
పచ్చిమిర్చిలో విటమిన్ సితో పాటు క్యాప్సైసిన్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా గుండె, రక్తపోటును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయని, కంటి చూపును మెరుగుపరుస్తాయని అంటున్నారు నిపుణులు.

Green chilli | పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు..
పచ్చి మిర్చిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ (Flavonoids), కెరోటినాయిడ్స్ (carotenoids) తదితర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటి వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయట. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. వీటిలో విటమిన్ ఎ, బి2, బి3, బి6, బి9, సి, ఇ ఉంటాయని పేర్కొంటున్నారు. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండడంతో.. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ను (Free radicals) నుంచి రక్షణ కల్పిస్తుందని National Library of Medicine అధ్యయనంలో తేలింది.
Green chilli | వెయిట్ తగ్గేందుకు దోహదం..
పచ్చి మిర్చి అనేది జీవక్రియను వేగవంతం చేసి, ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది. ఇందులో ఉండే క్యాప్సైసిన్ కొవ్వును కరిగించడంతో పాటు కొవ్వు నిల్వలు ఏర్పడకుండా నిరోధిస్తుందట. అంతేకాకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగించడం వల్ల అతిగా తినకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.
Green chilli | షుగర్‌ను అదుపులో ఉంచుతుంది..
మిరపకాయల్లోని కార్బోహైడ్రేట్ల (Carbohydrates) వల్ల జీర్ణక్రియ నెమ్మదించడంతో పాటు ఇన్సులిన్ (Insulin) ఉపయోగాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరం శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటుందట. దీంతో రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంటుందని పేర్కొంటున్నారు. మిరపకాయలు ఒబెసిటీ, షుగర్, గుండె సంబంధ రుగ్మతల చికిత్సకు సానుకూల ప్రభావాలను కలిగిస్తాయని ఓ అధ్యయనంలో తెలిసింది.
Green chilli | గుండె ఆరోగ్యానికి మంచిది..
పచ్చి మిరపకాయలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను (Cholesterol level) నియంత్రించడం లాంటి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ను సైతం తగ్గిస్తాయట. దీంతో గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుందంటున్నారు. ఇలా మోతాదులో పచ్చి మిరపకాయలను ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే వీటికి అధికంగా తీసుకోవడం వల్ల అలర్జీలు లేదా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం (Health tips) మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!