Health Tips | చన్నీటితో స్నానం మంచిదా.. వేడి నీటితోనా.. ఎలా చేయడం మంచిదంటే..!

స్నానం శరీరంతో పాటు మనసును శుద్ధి చేసే ప్రక్రియ. స్నానం చేయడం ద్వారా తనువు, మనసు ఉత్సాహంగా మారాతాయి.

by Harsha Vardhan
1 comment
Health Tips

తెలుగున్యూస్​టుడే, వెబ్​డెస్క్​: Health Tips | స్నానం చేయడం ద్వారా బాడీ అంత రిఫ్రేష్​ అవుతుందని మనందరికీ తెలిసిందే. ఇది శరీరంతో పాటు మనసును సైతం శుద్ధి చేసే ప్రక్రియ. స్నానం (Bath) చేయడం ద్వారా తనువు, మనసు ఉత్సాహంగా మారాతాయి. అయితే స్నానం ఎప్పడు చేయాలి. ఎలా చేయడం మంచిదనే విషయాల గురించి తెలుసుకుందామా..

Health Tips | చన్నీళ్లతో స్నానం..

చన్నీళ్లతో స్నానం చేయడం ద్వారా అనేక శారీరక సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. మెదడు నుంచి కాలి బొటన వేలి వరకూ ఏకకాలంలో ఉత్తేజితమవుతాయంటున్నారు. చన్నీళ్లలో ఈత కొట్టేవాళ్లు ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్లకు చాలా తక్కువ గురవుతారని పేర్కొంటున్నారు. ఒకవేళ సోకినా తీవ్రత తక్కువగా ఉంటుందట. అలాగే రోగనిరోధక వ్యవస్థ (Immune system), మెదడు, గుండె, హృదయ నాళాల్లో పేరుకునే కొవ్వులను ప్రభావితం చేస్తుందంటున్నారు. అయితే.. చన్నీళ్లు పడని వారు మాత్రం రెండు నిమిషాలకు మించి చన్నీటితో స్నానం చేయవద్దని చెబుతున్నారు.

Health Tips | వేడి నీటితో స్నానం..

వేడి నీళ్లు నాచురల్​ పెయిన్​ కిల్లర్​గా (Natural pain killer) పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేడినీటి స్నానంతో (Hot water bath) చేయడం ద్వారా బిగుసుకున్న కండరాలు వ్యాకోచిస్తాయని.. దీని వల్ల విశ్రాంత స్థితికి వస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా పలు నొప్పుల నుంచి సైతం వేడినీటితో ఉపశమనం కలుగుతుందంటున్నారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల నాడీ వ్యవస్థ సైతం ప్రశాంతంగా ఉంటుందంటున్నారు. అలాగే మానసిక స్థితి మెరుగుపడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

Health Tips | టబ్​ బాత్​..

స్పైనల్ బాత్, హిప్ బాత్ రెండు రకాలుగా తొట్టి స్నానాలు ఉంటాయి. వీటివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆకలి లేమి, అజీర్తి, కడుపుబ్బరం తదితర సమస్యలను తొలగిస్తుందని పేర్కొంటున్నారు. రోజుకు 20 నుంచి 25 నిమిషాలు పరగడుపున టబ్​లో కూర్చోవాలి.

Health Tips | అభ్యంగన స్నానం..

అభ్యంగన స్నానం ఆయుర్వేదంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పరగడుపున నువ్వుల నూనె, కొబ్బరి, ఆముదం ఇలా ఏదైనా ఒక నూనెను ఒంటికి రాసుకోవాలి. అనంతరం 15-40 నిమిషాలు ఆగి… సున్నిపిండి, శనగపిండి ఏదో ఒక దాంతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుందని చెబుతారు.

గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
Focus Mode
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00