తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Heart diseases in youngers | గుండె జబ్బులు ఒకప్పుడు 50 నుంచి 60 వయస్సు పైబడిన వారికే అత్యధికంగా వచ్చేవి. కానీ ప్రస్తుతం యువతలో గుండెజబ్బు సమస్యలు గణనీయంగా పెరిగాయి. 20 నుంచి 30 ఏళ్ల వయస్సు యువత సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోతున్నారు. చాలా మంది ముందస్తుగా హార్ట్ఎటాక్ లక్షణాలు కనిపించడం లేదు. గుండెపోటు లక్షణాలు ఇందుకు గల కారణలపై ‘India tv’ కథనం ప్రకారం..
Heart diseases in youngers | మారిన జీవనశైలి
నేటి ఆధునిక యుగంలో ప్రజల జీవనశైలి మారిపోయింది. జంక్ ఫుడ్‌కు (junk food) అలవాటు పడడం, పని ఒత్తిడి, ఎక్కువసేపు కూర్చుని కంప్యూటర్లపై పనిచేయడం ఇలా వివిధ కారణాల వల్ల డయాబెటిస్ (Diabetes), అధిక కొలెస్ట్రాల్ (high cholesterol), ఊబకాయం (obesity) వంటివి వస్తున్నాయి. దీనివల్ల యువకులలో గుండె జబ్బుల ప్రాబల్యం పెరుగుతోంది. ఓ డయాగ్నోస్టిక్స్ డేటా ప్రకారం.. 25–35 సంవత్సరాల వయస్సు గల యువకుల్లో 13 శాతం మంది డయాబెటిక్, 25 శాతం మంది ప్రీ-డయాబెటిక్ స్టేజ్ ఉన్నారు. అంతేకాకుండా 28 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్నారు.
Heart diseases in youngers | గంటల తరబడి కూర్చుని పనిచేయడం..
గుండె జబ్బులు పెరగడానికి మన ప్రస్తుత జీవన విధానం ఎంతో ప్రభావం చూపిస్తోంది. యువత గంటల తరబడి డెస్క్‌ల వద్ద కూర్చుని పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో వండిన భోజనానికి బదులుగా.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, జంక్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్ లాంటివి అధికంగా తీసుకున్నారు. ఇలా ఆరోగ్యానికి హానీ చేసి ఫుడ్ తీసుకోవడం వల్ల చిన్న వయస్సులో అధిక కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి.
Heart diseases in youngers | ఒత్తిడి మరో సమస్య
ప్రస్తుతం యువతలో పెరుగుతున్న ఒత్తిడి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఉద్యోగంతో పాటు ఇతర ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీర్ఘకాలిక ఒత్తిడి ఎదుర్కోవడం అనేది రక్తపోటును పెంచుతుంది. ఇది కాలక్రమేణా గుండెకు హాని చేస్తుంది. దీనికి తోడు 20 నుంచి 30 ఏళ్ల వయస్సుల్లోనే డయాబెటిక్ బారిన పడుతున్నారు.
Heart diseases in youngers | నిద్ర లేమి, బయటి ఆహారం తీసుకోవడం వల్ల..
యువత ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. సగటు మనిషి సరిపోయేంత నిద్ర పోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో రక్తపోటు, గుండె ఒత్తిడిని పెంచే హార్మోన్లను విడుదల చేస్తుంది. సుదీర్ఘమైన కార్యాలయ గంటలు, లేట్ నైట్ వరకు సోషల్ మీడియా స్క్రోలింగ్ అనేవి నిద్రను దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా ప్రాసెస్ చేసిన ఆహారం మరో కారణం. అధిక చక్కెర ఉంటే పానీయాలు, జంక్‌ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌లో చెడు కొవ్వులు, సోడియం, చక్కెరతో నిండి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, ఊబకాయం, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవన్నీ గుండె జబ్బులకు దారి తీస్తున్నాయి.
Heart diseases in youngers | ఇలా చేయండి..
- తక్కువ ప్రాసెస్ చేసిన, ఫ్రైడ్ ఆహారాన్ని తీసుకోండి. ఇంట్లో వండిన భోజనానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వండి.
- రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. వాకింగ్, సైక్లింగ్, యోగా లాంటివి చేయండి.
- వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోండి. రాత్రి పూట కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోండి.
- ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి.
- అలసట, ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!