Late night sleep | రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..

బిజీబిజీ జీవితం మనిషికి నిద్ర లేకుండా చేస్తోంది. పని ఒత్తిడి, ఇతర టెన్షన్స్​, స్క్రీన్​లకు అతుక్కుపోవడం వంటివి నిద్రకు దూరం చేస్తున్నాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

by Harsha Vardhan
1 comment
Late night sleep

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Late night sleep | ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కంటి మీద కునుకు కరువైపోయింది. పని ఒత్తిడి, ఇతర టెన్షన్స్​, మొబైల్​, టీవీ స్క్రీన్​లకు అతుక్కుపోవడం నిద్రకు దూరం చేస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహ్లాదకరమైన జీవన శైలికి సమతుల ఆహారం ఎంత ముఖ్యమో.. సుఖమయమైన నిద్ర అంతే తప్పనిసరి. ఈ రెండు సక్రమంగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా సగటు మానవుడు ఎన్ని గంటలు నిద్ర పోవాలి తదితర విషయాలు తెలుసుకుందాం పదండి..

Late night sleep | నిద్రలేమికి కారణాలివే..

రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వారు (late night sleep) అనారోగ్య సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారనేది సత్యం. ముఖ్యంగా బిజీబిజీ జీవితం, అనేక ఒత్తిళ్లు ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆలస్యంగా నిద్రించే వారు అనారోగ్యకమైన అలవాట్ల వల్ల సగటు ఆయు ప్రమాణం తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో పని చేసేవారు.. లేదంటే ఫోన్లు, టీవీలు ఎక్కువగా చూసే వాళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీనివల్ల నిద్రలేమి సమస్య తలెత్తి అనారోగ్యాల భారిన పడుతున్నారు. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యం సైతం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి అనేది భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

Late night sleep | మానసిక ఆరోగ్యంపై ప్రభావం

నిద్ర లేకపోవడం మూలంగా కేవలం శారీరక ఆరోగ్యం కాకుండా.. మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. సరిపోనూ నిద్ర లేకపోతే, ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు వస్తుంటాయి. నిద్రలో మెదడు రోజూ వారి కార్యకలాపాలను ప్రాసెస్ చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి అనేది తగ్గపోతుంది. కాగా.. నిద్రలేమి సమస్య ఎదుర్కొనే వారిలో మెదడుపై ప్రభావం పడుతుంది. దీనివల్ల మానసిక స్థితిలో మార్పులు, చిరాకు, కోపం తదితర ఇబ్బందులు కలుగుతాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు.

Late night sleep | రోగనిరోధక శక్తిపై ప్రభావం..

నిద్ర అనేది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. సరిగ్గా నిద్రపోక పోయినట్లయితే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశాలు ఉంటాయి.

Late night sleep | జ్ఞాపకశక్తి దెబ్బతినే అవకాశాలు..

మెదడుకు నిద్ర అనేది ఎంతో ముఖ్యం. ఇది జ్ఞాపకశక్తితో పాటు అభ్యాసన సామర్థ్యాన్ని, ఏకాగ్రతను కాపాడడంలో దోహదం చేస్తుంది. నిద్రలేమి (Insomnia) వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం లాంటి వాటిపై సైతం ప్రభావం కనిపిస్తుంది.

Late night sleep | బరువు పెరుగుదల సమస్య..

నిద్రలేమికి.. ఊబకాయం మధ్య సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరిపోయేంత నిద్ర లేకపోవల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని చెబుతున్నారు. దీనివల్ల ఆకలిని ప్రేరేపించే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ క్రమంలో ఎక్కువగా తినే అవకాశాలుంటాయి. అధిక కేలరీలు ఉండే ఆహారంతో పాటు తీపి పదార్థాలు తినాలని అనిపిస్తుందట. ఇవి ఇది బరువు పెరగడానికి దారితీస్తాయి. జీవక్రియపై ప్రభావం చూపడంతో బరువు పెరుగుదలకు దారితీయొచ్చు.

Late night sleep | ఇతర ప్రభావాలూ ఉంటాయి..

నిద్ర సమస్య కారణంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. నిద్రలో మన శరీరం రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశాలుంటాయి. దీంతో గుండెకు ఒత్తిడి పడి హృదయ సంబంధ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.

Late night sleep | ఎంతసేపు నిద్ర పోవాలంటే..

సాధారణంగా మనిషిలో వయసు ఆధారంగా నిద్రపోయే విధానం ఉంటుంది. పసిపిల్లలు ఎక్కువ సేపు నిద్రపోతారు. అయితే క్రమంగా వయస్సు పెరిగే కొద్దీ నిద్ర అనేది తగ్గుతుంది. అప్పుడే పుట్టిన శిశువు రోజుకు 11 నుంచి 14 గంటల వరకు నిద్రపోవడం అవసరం. ఇక మూడు నుంచి ఐదళ్ల మధ్య వయస్సు గల పిల్లలు 10 గంటలు పడుకోవాల్సి ఉంటుంది. స్కూల్​కు వెళ్లే పిల్లలు రోజుకు కనీసం 8 గంటలు నిద్రించాలి. 18 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన వారయితే రోజు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి. 60 ఏళ్లు పైబడిన వారైతే కనీసం 6 గంటలైనా రోజుకు నిద్రపోవాల్సి ఉంటుంది.

Late night sleep | చక్కగా నిద్ర పోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి..

నిత్య జీవితంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. నిద్ర విషయం సమయపాలన పాటించాలి. రోజూ ఒక సమయం పెట్టుకుని నిద్రపోవాలి. నిద్ర లేవడంలోనూ సమయం పాటిస్తే చాలా మంచిది. రాత్రి సమయంలో భోజనానికి, నిద్రకు మధ్య కనీసం రెండు, మూడు గంటల సమయం ఉండేలా చూసుకోండి. నిద్రపోయేందుకు గంట ముందు నుంచే గ్యాడ్జెట్లను పక్కన పెట్టేయండి. అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు గోరువెచ్చటి పసుపు పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. నిద్రపోయే గదిలో సరైన వెంటిలేషన్‌తో పాటు చీకటిగా ఉండేలా చూసుకోవాలి. అలా ఇష్టం లేని వారుంటే కనీసం తక్కువ వెలుతురు ఉండే చూసుకోండి. ఇలా కొన్ని చర్యలు తీసుకోవడం నిద్ర బాగా పడుతుంది. హాయిగా నిద్ర పోవడం వల్ల ప్రశాంతమైన జీవితం గడపవచ్చు.

గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం. Late night sleep can lead to various health issues, including fatigue and decreased cognitive function. It is advisable to prioritize a consistent sleep schedule to promote overall well-being.

Follow Us : X.com, Facebook

Read also : Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్​ పేషెంట్స్​ తినొచ్చా..!

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

1 comment

binance sign up bonus January 5, 2026,6:46 am - January 5, 2026,6:46 am

I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.

Reply

Leave a Comment

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00