తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Fastag kyv Process | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI).. ఫాస్టాగ్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త చెప్పింది. కేవైసీ ప్రక్రియను సులభతరంగా మారుస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఐహెచ్ఎంసీఎల్ రిలీజ్ చేసిన తాజా నిబంధనల ప్రకారం.. కేవైవీ (Know Your Vehicle) ప్రక్రియ పూర్తి చేయని వాహనాల ఫాస్టాగ్ సేవలను వెంటనే నిలిపివేయబోరు. ఈ పక్రియను పూర్తి చేసేందుకు వినియోగదారులకు సమయం ఇవ్వనున్నారు. ఫాస్టాగ్ వినియోగదారులకు అసౌకర్యం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Fastag kyv Process |కేవైవీ పూర్తి చేయకపోతే..
కేవైవీ ప్రక్రియ కంప్లీట్ చేయని వాహనదారుల ఫాస్టాగ్ డీయాక్టివేట్ అవుతుందని కేంద్రం ఇదివరకు చెప్పింది. దీంతో వారు టోల్ ఫీజులను క్యాష్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా.. తాజాగా ప్రక్రియను సరళీకృతం చేయడం ద్వారా కేవైవీ ప్రక్రియ పూర్తి చేయని వారికి ఊరట లభించింది.
కేవైవీ నిబంధనల ప్రకారం.. కార్లు, జీపులు, వ్యాన్ల సైడ్ ఫొటోలు ఇకపై అవసరం ఉండదు. నంబర్ ప్లేట్, FASTag కనిపిస్తున్న ముందు చిత్రాన్ని మాత్రమే అప్‌లోడ్ చేయాలి. వాహనదారులు వెహికిల్, ఛాసిస్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసినప్పుడు ‘వాహన్’ పోర్టల్ నుంచి ఆర్సీ వివరాలు ఆటోమేటిక్‌గా పొందుతారు. ఒకే మొబైల్ నంబర్‌కు మీద ఎక్కువ వాహనాలు రిజస్టర్ అయి ఉన్నట్లయితే వినియోగదారులు ఏ వాహనాన్ని కేవైవీ పూర్తి చేయాలని భావిస్తే దానిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Fastag kyv Process | ఏదైనా సమస్య వస్తే..
కేవైవీ ప్రక్రియలో భాగంగా ఏవైనా సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు తలెత్తితే ఫస్టాగ్ జారీచేసే బ్యాంక్ కస్టమర్‌ను సంప్రదించాలి. వెంటనే డిస్‌కనెక్ట్ చేయకుండా కేవైవీ విధానం పూర్తి చేయడంలో సహాయం చేయాలి. వినియోగదారులు 1033లో నేషనల్ హైవే హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే బ్యాంకును సంప్రదించవచ్చు.
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!