తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Sabarimala special Trains | శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రెగ్యులర్ రైళ్ల బుకింగ్స్ ఫుల్ కావడంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రెయిన్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ, నాందేడ్, చర్లపల్లి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి.
Sabarimala special Trains | కొనసాగుతున్న బుకింగ్స్
ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లకు దక్షిణ మధ్య రైల్వే శనివారం నుంచి అవకాశం కల్పించింది. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. నవంబర్ 17వ తేదీ నుంచి జనవరి 20 వరకు రాకపోకలు సాగించనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కేరళలోని కొల్లాం, కొట్టాయం వైపు మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. హైదరాబాద్ చర్లపల్లి స్టేషన్ నుంచి ట్రైన్ అందుబాటులో ఉండనుంది.
Sabarimala special Trains | చర్లపల్లి – కొల్లాం స్పెషల్ రైలు (ట్రైన్ నెంబర్ 07113/07114)
చర్లపల్లి – కొల్లాం (07113) రైలు నవంబర్ 18 నుంచి జనవరి 13వ తేదీ వరకు ప్రతి మంగళవారం చర్లపల్లి స్టేషన్ నుంచి వెళ్లనుంది. కొల్లాం – చర్లపల్లి (07114) ట్రైన్ నవంబర్ 20 నుంచి జనవరి 15 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. ఈ రైలు సేవలు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల భక్తులకు ఉపయోగకరం కానున్నాయి.
Sabarimala special Trains | కాకినాడ టౌన్ – కొట్టాయం రైలు ( ట్రైన్ నంబర్ 07109/07110)
సౌత్ సెంట్రల్ జోన్ పరిధిలో కాకినాడ టౌన్ – కొట్టాయం (07109) ట్రైన్ నవంబర్ 17వ తేదీ నుంచి జనవరి 19 వరకు ప్రతి సోమవారం నడవనుంది. అలాగే కొట్టాయం – కాకినాడ టౌన్ (07110) రైలు నవంబర్ 18 నుంచి జనవరి 20 వరకు ప్రతి మంగళవారం తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది.
Sabarimala special Trains | నాందేడ్ – కొల్లాం రైలు ( ట్రైన్ నంబర్ 07111/07112)
భక్తుల రద్దీ దృష్ట్యా మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి కూడా స్పెషల్ ట్రైన్‌ను ప్రకటించారు. హజర్ సాహెబ్ నాందేడ్ – కొల్లాం (07111), కొల్లాం-హెచ్ఎస్ నాందేడ్ (07112) మధ్య ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. ఈ రైళ్లు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంత భక్తులకు సౌకర్యంగా మారనున్నాయి.
ఇది కూడా చదవండి.. : Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
