తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Arattai End-to-End Chat Encryption : జోహోకు చెందిన స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అరట్టై యాప్ డౌన్‌లోడ్స్‌లో దూసుకుపోతోంది. గత నెల రోజుల్లో కోటి మందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఇందులో కాల్స్‌కు ఎన్క్రిప్షన్ అందుబాటులో ఉండగా.. చాట్ కోసం మాత్రం లేదు. కాగా.. దీనిపై దృష్టి సారించిన సంస్థ త్వరలోనే చాట్ల కోసం వాట్సాప్ లాంటి ఎన్క్రిప్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని స్వయంగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు.
Arattai End-to-End Chat Encryptionచివరి ఫీచర్ టెస్టింగ్!
అరట్టై ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫీచర్ చివరి పరీక్ష దశలో ఉన్నట్లు సమాచారం. దీనిని వినియోగదారుల కోసం త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అందుబాటులోకి వచ్చినట్లయితే అరట్టై యాప్ వాట్సాప్‌కు మరింత బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది వినియోగదారుల చాట్లను లేదా డేటాను గోప్యంగా ఉంచుతుంది.
Arattai End-to-End Chat Encryption త్వరలో జోహో పే..!
అరట్టై ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో పాటు, UPI-ఆధారిత చెల్లింపు వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. జోహో పేను ప్లాట్ఫామ్లోకి ఇంటిగ్రేట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వచ్చినట్లయితే వినియోగదారులు యాప్‌లోనే డబ్బు పంపడం, స్వీకరించడం తదితర సౌకర్యాలు కలుగనున్నాయి. ఇది మనం వాట్సాప్ లాగే.. మల్టీ-యుటిలిటీ కమ్యూనికేషన్ సాధనంగా మారనుంది.
Top 7 Budget Tablets Under 15000 |బడ్జెట్ ధరలో ట్యాబ్లెట్ కోసం చూస్తున్నారా.. అయితే ట్యాబ్‌పై ఓ లుక్కేయండి..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
