తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరో ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేసింది. ఇది బడ్జెట్ ధరలో వైఫై, LTE కనెక్టివిటీతో లభ్యమవుతోంది. వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ట్యాబ్లెట్ 11 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 9340mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాంకుడా ఈ ట్యాబ్‌లో క్వాడ్ స్పీకర్ యూనిట్ సైతం ఉంది. ఇందులో Kids Space ఫీచర్‌ను కూడా ఇచ్చారు. Budget Tablets Under 15000 India ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలివే…
Top 7 Budget Tablets Under 15000 | రూ.15,999 నుంచి ప్రారంభం..
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ట్యాబ్లెట్ ప్రస్తుతం అమెజాన్‌లో లభ్యమవుతోంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీతో వచ్చే ఈ ట్యాబ్ (Wi-Fi) ధర రూ.15,999గా ఉంది. అలాగే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ డివైజ్ (Wi-Fi + 4G LTE) ధర రూ.17,999గా లభ్యమవుతోంది.
Top 7 Budget Tablets Under 15000 |స్పెసిఫికేషన్స్ ఇవే..
90Hz రీఫ్రెష్ రేట్ 11 ఇంచెస్ HD+ LCD డిస్‌ప్లేతో ఈ ట్లాబ్లెట్ వస్తోంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. ఈ డిస్‌ప్లే Low Blue Light, ఫ్లిక్కర్ ఫ్రీతో కూడిన TUV Rheinland సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 15 ఓస్..
ఈ ట్యాబ్ మీడియాటెక్ హీలియో G100 SoC ప్రాసెసర్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15.0.1పై వర్క్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే.. వెనుక వైపు 5MP కెమెరా ఉంటుంది. ముందు వైపు 5MP కెమెరా వస్తుంది.
Top 7 Budget Tablets Under 15000 | భారీ బ్యాటరీ
ఈ వన్‌ప్లస్ ట్యాబ్ అనేది 33W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో పాటు 9340mAh బ్యాటరీతో లభిస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 80 గంటల మ్యూజిక్ ప్లే టైం, లేదంటే 11 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 54 రోజుల స్టాండ్‌బై టైంను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ బడ్జెట్ ట్యాబ్ Hi – Res ఆడియో గోల్డ్ స్టాండర్డ్ సర్టిఫికేషన్‌తో కూడిన క్వాడ్ స్పీకర్ యూనిట్ కలిగి ఉంటుంది. ఇందులో షేరింగ్ ఫీచర్.. కిడ్స్ మోడ్ సైతం ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా Wi-Fi, 4G LTE, బ్లూటూత్ 5.4 కలిగి ఉంది.
ఈ US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. కూడా చదివేయండి.
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!