తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Mauni Amavasya 2026 | సంవత్సరంలో వచ్చే పన్నెండు అమావాస్యలలో మౌని అమావాస్య అత్యంత పవిత్రమైంది. అంతేకాకుండా మహోన్నతమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఇది మాఘ మాసం కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య. మాఘ అమావాస్య లేదా మాఘి అమావాస్య అనే పేర్లతో దీనిని పిలుస్తారు. ఈ ఏడాది మౌని అమావాస్య రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా సమకూరడంతో ఈ రోజు ఆధ్యాత్మిక మహత్త్వం మరింత ప్రముఖ్యత ఏర్పడింది.

Mauni Amavasya 2026
పుణ్యస్నానాలు, దానధర్మాలు..
ఈ Mauni Amavasya 2026 రోజును దానధర్మాలు చేయడంతో పాటు పుణ్య స్నానాలు ఆచరించడం ద్వారా ఎంతో పుణ్యం వస్తుందని భావిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర దివ్య స్నానం ఆచరిస్తారు. కాగా.. 2026లో మౌని అమావాస్య జనవరి 18న రానుంది.
మౌని అమావాస్య 2026 తేదీ, తిథి మరియు సమయం
- మౌని అమావాస్య: జనవరి 18, 2026 (ఆదివారం)
- అమావాస్య తిథి ప్రారంభం: జనవరి 18, 2026 రాత్రి 12:03 గంటల నుంచి..
- అమావాస్య తిథి ముగింపు: జనవరి 19, 2026 రాత్రి 01:21 గంటల వరకు..
మాఘ స్నానానికి ఎందుకు అంత ప్రాధాన్యం
మౌని అమావాస్య రోజున దేవతలు స్వయంగా త్రివేణి సంగమంలో స్నానమాచరించడానికి వస్తారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం ఆదరించడం ద్వారా ఎంతో పుణ్యం కలుగుతుందని భావిస్తారు. మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు. మౌని అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉండడం వల్ల ఏర్పడే అద్భుతమైన ఖగోళ సంయోగం మోక్ష ప్రాప్తికి శుభప్రదమని భావిస్తారు.
జన్మజన్మల పుణ్యఫలం
ఈ రోజున మౌన వ్రతాన్ని ఆచరించి, భక్తి శ్రద్ధలతో సంగమ నీటిలో స్నానం చేసినవారి పాపాలన్నీ నశించి, పుణ్యఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే పితృ దేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఈ రోజు ఎంతో పవిత్రమైందిగా చెబుతారు. దానధర్మాల విషయంలో నువ్వులు, ధాన్యాలు, వస్త్రాలు, గోదానం వంటివి చేయడం ఈ Mauni Amavasya 2026 రోజున ప్రత్యేక ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు.
ఇది కూడా చదవండి..: Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.
