తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Vande Mataram 150 years celebrations | దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో దేశ భక్తిని నింపిన జాతీయ గీతం ‘వందేమాతరం’. దీనిని రచించి నవంబర్ 7తో సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన వందేమాతరం గేయం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరిస్తారు. స్మారక తపాలా బిల్ల, స్మారక నాణేలను కూడా విడుదల చేయనున్నారు.

Vande Mataram 150 years celebrations | దేశ వ్యాప్తంగా వేడుకలు
వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.50 గంటలకు దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా ‘వందేమాతరం’ గేయాలాపన జరగనుంది. అలాగే స్వదేశీ వస్తువులను ఉపయోగించాలన్న ప్రతిజ్ఞ చేయనున్నారు.
Vande Mataram 150 years celebrations | 150 ఏళ్ల మహోన్నత చరిత్ర..
వందేమాతరం గేయానికి మహోన్నత చరిత్ర ఉంది. దీనిని బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న అక్షయ నవమి పర్వదినం సందర్భంగా రచించినట్లు చెబుతారు. ఆయన రచించిన నవల ‘ఆనందమఠ్’లో తొలుత ఈ గేయం కనిపించింది. ఈ నవల అప్పట్లో ‘బంగదర్శన్’ అనే సాహిత్య పత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. అనంతరం 1882లో ప్రత్యేక పుస్తకంగా వెలువడింది. ఈ గేయం నాడు ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్పూర్తి నింపింది. అంతేకాకుండా జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వందేమాతరం స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిందని ప్రకటించారు. దీనికి జాతీయ గీతం జనగణమనతో సమాన గౌరవం ఇచ్చారు.
ఇది కూడా చదవండి.. : Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
