తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Water Heater Precautions | చలికాలం వచ్చిందంటే చాలు.. చన్నీటితో స్నానం చేయడం, ముఖం కడుక్కోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, నీళ్లు వేడి చేసుకోవడానికి కొందరు గీజర్ ఉపయోగిస్తుంటారు. మరికొందరు గ్యాస్ స్టౌ వాడుతుంటారు. ఇంకా కొందరైతే వాటర్ హీటర్‌తో నీటిని వేడి చేస్తుంటారు. అయితే.. ఎక్కువ మంది మాత్రం వాటర్ హీటరే వాడుతుంటారు. ఎందుకంటే వాటర్ హీటర్ అందుబాటులో ధరలో లభిస్తుంది. తక్కువ సమయంలో నీళ్లు వేడి కావడం వల్ల చాలామంది దీనిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే దీనిని ఉపయోగించే సమయంలో కొందరు పొరపాట్లు చేస్తూ ప్రాణాల మీదకు ముప్పు తెచ్చుకుంటారు. కాబట్టి వీటిని వాడే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం..!
కొనుగోలు సమయంలో జాగ్రత్త
హీటర్ కొనుగోలు సమయంలో ఐఎస్ఐ మార్క్ ఉన్నవి, బ్రాండెడ్ కంపెనీలవే కొనుగోలు చేయాలి. హీటర్ కాయిల్స్పై ఉండే సిలికా కోటింగ్ రెండేళ్ల తర్వాత తొలగిపోతుంది. ఆ సమయంలో పాతది పక్కన పెట్టేసి.. కొత్త దానిని వినియోగించాలి.
Water Heater Precautions : బకెట్ కూడా ముఖ్యమే..
చాలామంది హీటర్‌ను ప్లాస్టిక్ బకెట్లలో పెట్టి నీటిని వేడి చేస్తుంటారు. అంతేకాకుండా బకెట్‌కు హీటర్ హుక్‌ను తగిలిస్తుంటారు. దీనివల్ల వేడికి ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది. ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ప్లాస్టిక్ బకెట్‌పై ఒక సన్నటి చెక్క (కట్టె) పెట్టి ఉపయోగించవచ్చు. అల్యూమినియం బకెట్ వినియోగిస్తున్నట్లయితే హీటర్‌ను నేరుగానే పెట్టవచ్చు. అయితే విద్యుత్తు షాక్ తగిలే ప్రమాదం ఉన్నందున ఇనుప బకెట్‌ను యూజ్ చేయకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
బకెట్ నీటిని ఎంతవరకు పట్టాలంటే..
బకెట్లో నింపిన తర్వాత హీటర్‌ను నీళ్లలో పెట్టాలి. అయితే హీటింగ్ కాయిల్ అనేది మునిగేలా చూసుకోవాలి. అనంతరం ప్లగ్‌ను పవర్ సాకెట్‌కు పెట్టి స్విచ్ ఆన్ చేసుకోవాలి. మీరు వాడే హీటర్‌పై దానిని ఎంత వరకు ముంచాలనే మార్క్ ఉంటుంది. దానిని చూసుకుని బకెట్లో వాటర్ నింపుకోవాలి.
Water Heater Precautions | కొన్ని విషయాల్లో జాగ్రత్తం
హీటర్ ఆన్ చేసిన కొద్దిసేపటికి నీళ్లు వేడి అయ్యాయా లేదా చెక్ చేయడానికి పవర్ సాకెట్‌ను స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసిన తర్వాతే నీటిని వేడి చూడాలి. అయితే కొందరు ఏమరపాటులో స్విచ్ ఆఫ్ చేయకుండా చూస్తుంటారు. ఇలా చేయడం ప్రాణాల మీదకు తెస్తుంది.
Water Heater Precautions : కొందరు వాటర్ హీటర్స్ బాత్రూమ్స్లో వినియోగిస్తుంటారు. ఇలా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా 2 ఇన్ 1 కనెక్షన్ ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల.. ఒక్కోసారి స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయి బాత్రూంలోకి వెళ్తే.. తేమ వల్ల విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
మరో విషయం ఏమిటంటే పిల్లలున్న ఇళ్లలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు తిరిగే ప్రదేశాల్లో వీటిని అస్సలు పెట్టకూడదు. ఎవరూ వెళ్లని ఓ మూల చూసుకుని హీటర్ పెట్టాలి. లేదంటే ప్రత్యేకంగా ఓ గదిలో నీటిని వేడి పెట్టుకోవడం ఉత్తమం.
గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
