Telangana Panchayat Elections |ఎన్నికల సంగ్రామానికి పల్లెలు సిద్ధం.. నేటి నుంచే తొలిదశ నామినేషన్ల ప్రక్రియ

by Telugu News Today
0 comments
Telangana Panchayat Elections

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Telangana Panchayat Elections |తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల జోష్ మొదలైంది. మొదటి దశలో భాగంగా ఈ రోజు (నవంబర్ 27) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 25వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు ఈ రోజు నోటీసులు జారీ చేసి, అభ్యర్థుల నుంచి నామినేషన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Telangana Panchayat Elections

నామినేషన్ కేంద్రాల్లో ఆయా పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాలను ప్రదర్శించనున్నారు. అభ్యర్థులు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

Telangana Panchayat Elections : ఒక అభ్యర్థి ఒకే వార్డు నుంచి..

ఒక అభ్యర్థి ఒకే వార్డు నుంచి మాత్రమే పోటీ చేయాలి. నామినేషన్‌తో పాటు నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, ఇతర బాధ్యతలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ సమర్పించాలి. ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, గ్రామ సేవకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అలాగే, ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు కూడా ఇటీవల చట్ట సవరణ ప్రకారం పోటీ చేయవచ్చు.

Telangana Panchayat Elections : మొదటి దశలో ఎన్ని పంచాయతీలు?

మొదటి దశలో 189 మండలాల్లోని 4,236 గ్రామ పంచాయతీలలోని మొత్తం 37,450 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల గడువు నవంబర్ 29 సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. 30న నామినేషన్ల పరిశీలన జరిగి, చెల్లుబాటు అయిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై డిసెంబర్ 1న అప్పీళ్లు స్వీకరిస్తారు. అనంతరం డిసెంబర్ 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అధికారిక అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

పోలింగ్, ఫలితాలు ఒకే రోజు..
డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి దశ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై, వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితాలు ప్రకటిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు పూర్తవుతుంది.

ఎన్నికల ఖర్చు పరిమితి
2011 జనాభా లెక్కల ప్రకారం 5,000కు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.2.5 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేలు మించి ఖర్చు చేయకూడదు. 5 వేలలోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు రూ.1.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ.30 వేలు మాత్రమే ఖర్చు పరిమితిగా నిర్ణయించారు.

హైదరాబాద్, Telangana Panchayat Elections మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలు మినహా మిగతా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల నియమాల ఉల్లంఘనలపై ఫిర్యాదులు SEC వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్​ పోర్టల్ ద్వారా లేదా 92400 21456 కాల్ సెంటర్‌కు సమర్పించవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. రెండో దశ ప్రక్రియ నవంబర్ 30 నుంచి, మూడో దశ డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది.

EPFO Passbook | ఈపీఎఫ్ పాస్‌బుక్‌ అప్​డేట్​ కాలేదా.. కారణమిదే..!

మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

Leave a Comment

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00