Penci Sport plugin only working with the Soledad theme.

Harsha Vardhan - Telugu News Today - Page 12 of 13

Author: Harsha Vardhan

  • Winter Health Care | చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. మీ ఆరోగ్యం సేఫ్..

    Winter Health Care | చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. మీ ఆరోగ్యం సేఫ్..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Winter Health Care : చలికాలం వచ్చిందంటే చాలు.. మనల్ని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చలి కారణంగా చర్మ సంబంధిత సమస్యలతో ఇతర ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే సీజన్​ ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడంతో చలి అంతగా లేదు. కానీ.. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా సంరక్షించుకోవచ్చు.

    Winter Health Care | శీతాకాలం.. వాధ్యుల కాలం..

    చలికాలం(Winter) అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. జలుబు, దగ్గు నుంచి మొదలు పెడితే ఆస్తమా వరకు అనేక సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి. చర్మం పొడిబారడం, పగుళ్లు ఏర్పడడంతో పాటు విటమిన్ లోపాలు తలెత్తుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఇలా అనేక సమస్యలు ఇబ్బంది పెడతాయి.

    Winter Health Care | ఈ జాగ్రత్తలు పాటించండి..

    చలి కాలంలో కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సరైన నియమాలు పాటించడం వల్ల చలికాలాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో దాహం ఎక్కువగా కాదు.. అయినా కూడా నీటి అధికంగా తీసుకోవాలి. దీని వల్ల అందంతో పాటు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. అందుకే చర్మానికి తేమ అవసరం.. కాబట్టి మాయిశ్చరైజర్లు (Moisturizers) వాడాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో పెదాలు కూడా పగిలే అవకాశం ఉంటుంది. లిప్ బామ్​లు వినియోగించడం వల్ల ఈ సమస్యకు చెక్​ పెట్టవచ్చు.

    Winter Health Care | రోగనిరోధక శక్తిని పెంచుకోండి..

    పలు ఆహార నియమాలు పాటించడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చే. విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు తీసుకోవడం వల్ల జలుబు(Cold), దగ్గు (Cough) నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. నారింజ, నిమ్మకాయలు వంటివి వాటిలో సి విటమిన్​ అధికంగా ఉంటుంది. విటమిన్ డి లోపం ఉన్న వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉదయాన్నే ఎండలో వాకింగ్‌కు వెళ్లడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్‌ డి లభిస్తుంది.

    Winter Health Care | వెచ్చదనం కలిగించే దుస్తులు ధరించాలి

    చలికాలంలో మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తే.. వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు కాకుండా ఉన్నితో (Woolen cloths) రూపొందించనవి ఎంచుకోండి. అలాగే పాలీప్రొఫైలిన్ వంటి సింథటిక్ ఫాబ్రిక్‌ను కూడా ధరించవచ్చు. ఎందుకంటే ఇది తేమను దూరం చేసి వేడిని కలిగిస్తుంది.

    • చలికాలంలో వ్యాయామం, వాకింగ్​, యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
    • అత్యవసరమైతేనే దూర ప్రయాణాలు చేయాలి.
    • వేడినీటితో కాకుండా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి.
    • స్నానం చేసిన 15 నిమిషాల అనంతరం మాయిశ్చరైజర్లు చర్మానికి రాసుకోవాలి.
    • బయటకు వెళ్లే సమయంలో స్వెటర్లు, గ్లౌజులు, కోట్లు ధరించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

    గమనిక : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

  • Most expensive coffee | ఈ కాఫీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. గిన్నెస్ రికార్డు సాధించిన అత్యంత ఖరీదైన రోస్టర్స్​ కాఫీ..

    Most expensive coffee | ఈ కాఫీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. గిన్నెస్ రికార్డు సాధించిన అత్యంత ఖరీదైన రోస్టర్స్​ కాఫీ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Most expensive coffee | సాధారణంగా మనం తాగే కాఫీ 20 నుంచి 30 రూపాయలు ఉంటుంది. ఇంకా పెద్ద కెఫేలకు వెళ్తే.. సుమారు రూ. 400 నుంచి రూ. 500 వరకు ఉండొచ్చు. కానీ ఈ కాఫీ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెతారు. దీని రేటు అక్షరాలా రూ. 60 వేలు. ధర చూసి ఆశ్చర్యపోతున్నారా.. అవునండీ మీరు చదివేది నిజమే. దుబాయ్​లోని రోస్టర్స్​ స్పెషాలిటీ కాఫీ హౌస్​ ఈ కాఫీతో గిన్నిస్​ వరల్డ్​ రికార్డు సైతం సాధించింది.

    Most expensive coffee | ఒక కప్పు ధర రూ.2500 దిర్హమ్స్​

    దుబాయ్ ‘రోస్టర్స్ స్పెషాల్టీ కాఫీ హౌస్’లో (Roasters Specialty Coffee House) లభించే ఈ కాఫీ అత్యంత ఖరీదైనదిగా గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness World Records) చోటు సాధించింది. ఒక్క కప్ ధర ఏకంగా 2,500 దిర్హామ్స్​ అంటే 680 యూఎస్​ డాలర్లు. ఇక మన కరెన్సీలో రూ. 60వేలకు పైమాటే. ఎందుకింత రేటు అనుకుంటున్నారు. ఈ కాఫీలో వాడే బీన్స్​ ధర కిలోకు రూ. లక్షల్లో ఉంటుంది.

    Most expensive coffee | దుబాయ్ కాఫీ కల్చర్‌కు కొత్త ఒరవడి

    రోస్టర్స్ స్పెషాల్టీ కాఫీ హౌస్ యూఏఈలో 15 ఔట్‌లెట్లను నడుపుతోంది. అంతేకాకుండా దుబాయ్‌లో నాలుగు బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. ఈ రికార్డు దుబాయ్‌లోని స్పెషాలిటీ కాఫీ సంస్కృతికి కొత్త ఒరవడి తెచ్చిన్లయ్యింది.

    Most expensive coffee | ఈ కాఫీ ఎందుకు ప్రత్యేకమంటే..

    ఈ కప్ కాఫీ కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. ఇది ఒక లగ్జరీ అనుభూతి.. గెయిషా బీన్స్‌ను V60 టెక్నిక్‌తో బ్రూయింగ్ చేస్తారు. ఎడో కిరికో గ్లాస్‌లో సర్వ్ చేస్తారు. దీని తయారీలో ప్రతి దశలో శ్రద్ధ వహిస్తారు.

    Most expensive coffee | మీకూ టేస్ట్​ చేయాలనుందా..!

    గిన్నిస్​ రికార్డును సాధించిన ఈ కాఫీని మీరు టేస్ట్​ చేయాలనుకునే దుబాయ్‌లోని రోస్టర్స్ ఔట్‌లెట్‌లకు సందర్శించాల్సిందే.. ‘ఈ కప్పు కాఫీతో పెద్ద దావత్​ చేసుకోవచ్చు.. ఇంత లగ్జరీ మనకెందుకులే బాసు’ అనుకుంటున్నారా.. అయితే మన దగ్గర మాంచీ టేస్ట్​తో పాటు మన బడ్జెట్​లో దొరికే కేఫ్​లున్నాయి.. అక్కడికి వెళ్లి తాగేద్దాం పదండి..

  • Crypto Market | ఎంత పనిచేవయ్యా​ ట్రంపు.. ఒక్క మాటతో క్రిప్టో మార్కెట్​ క్రాష్​ చేశావ్​గా..!

    Crypto Market | ఎంత పనిచేవయ్యా​ ట్రంపు.. ఒక్క మాటతో క్రిప్టో మార్కెట్​ క్రాష్​ చేశావ్​గా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Crypto Market | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒకే ఒక్క ప్రకటన క్రిప్టో కరెన్సీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. చైనాపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తానంటూ ఆయన ప్రకటించడంతో క్రిప్టో మార్కెట్ భారీగా క్రాష్ అయింది. బ్లూమ్‌బెర్గ్ (Bloom berg) నివేదిక ప్రకారం.. క్రిప్టో ట్రేడర్లు రూ.68 లక్షల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాయిన్​ గ్లాస్​ డేటా ఆధారంగా.. కేవలం గత 24 గంటల్లో 16 లక్షల ట్రేడర్లు లిక్విడేట్ అయినట్లు నివేదిక తెలిపింది. అనగా.. వారి ఇన్వెస్ట్​మెంట్లు ఆటోమేటిక్‌గా అమ్ముడైపోవడంతో నష్టపోయారు. అతిపెద్ద క్రిప్టో మార్కెట్​ క్రాష్​లలో ఇదీ ఒకటిగా మారింది.

    Crypto Market | బిట్‌కాయిన్, ఈథర్ నేల చూపులు

    క్రిప్టో మార్కెట్​లోని దాదాపు అన్ని కరెన్సీలు పడిపోయాయి. బిట్‌కాయిన్ (Bit coin) రూ.1,22,000 నుంచి రూ.1,07,000కు పడిపోయింది. ఇథేరియం (ethereum) రూ.3,700 కంటే దిగువకు వచ్చిఒంది. ఎక్స్​ఆర్​పీ (XRP), సొలన (Solana), డిజీ కాయిన్​ (Dogecoin) 20-30 శాతం వరకు క్షీణించాయి.

    Crypto Market | ట్రంప్​ ప్రకటనతో పాటు మరిన్ని కారణాలు..

    చైనాపై 100 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనతో పాటు మరిన్ని కారణాలు క్రిప్టో మార్కెట్​ కుంగేలా చేశాయి. అలాగే 16 లక్షల ట్రేడర్లు లిక్విడేట్​ అయ్యాయి. ఇది కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. బిట్​ కాయిన్​ సైతం ఆల్​ టైం హైకి చేరుకోవడం వలన ప్రాఫిట్​ బుకింగ్​ చేసుకోవడం కూడా క్రిప్టో క్రాష్​కు కారణమైంది.

  • Trump tariffs on china | ట్రంప్​ మరో సంచలన నిర్ణయం.. చైనాపై 100 శాతం టారిఫ్‌ల విధింపు

    Trump tariffs on china | ట్రంప్​ మరో సంచలన నిర్ణయం.. చైనాపై 100 శాతం టారిఫ్‌ల విధింపు

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Trump tariffs on china | రోజుకో నిర్ణయంతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరో సంచలన డిసిషన్​ తీసుకున్నారు. ప్రపంచంలో రెండో ఆర్థిక వ్యవస్థ అయిన చైనాపై వంద శాతం టారిఫ్​లు (Trump tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1 నుంచి చైనా దిగుమతులపై 100 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు తన సోషల్​ మీడియా వేదిక ట్రూత్​లో పోస్టు చేశారు. ఇది ప్రస్తుత్తం విధిస్తున్న టారిఫ్​లకు అదనం.

    అంతేకాకుండా అమెరికాలో తయారైన కీలకమైన సాఫ్ట్​వేర్​లపై కఠినమైన ఎగుమతి నియంత్రణ అమలు చేస్తామంటూ పేర్కొన్నారు. ట్రంపు తాజా నిర్ణయంతో ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరీ తీవ్రంగా మారే అవకాశం నెలకొంది.

    Trump tariffs on china | అందుకేనా ఈ నిర్ణయం..

    చైనా అంతర్జాతీయ వాణిజ్యంలో (International trade) అసాధారణంగా దూసుకొస్తుందంటూ ట్రంప్​ పేర్కొన్నారు. “చైనా వాణిజ్యంలో అసాధారణంగా దూకుడుతో పాటు ప్రపంచానికి శత్రుత్వపూరితమైన లేఖ రాసింది. వారు తయారు చేసిన ఉత్పత్తులతో పాటు వారు తయారు చేయని వాటిపై కూడా నవంబర్ నుంచి భారీగా ఎక్స్‌పోర్ట్ కంట్రోల్స్ విధిస్తున్నారు. దీనికి ప్రతిస్పందంగానే అమెరికా ఆ దేశంపై 100 శాతం టారిఫ్ విధిస్తుంది. ఇవి ప్రస్తుతం అమలవుతున్న టారిఫ్‌లకు అదనం. అంతేకాకుండా అన్ని క్రిటికల్ సాఫ్ట్‌వేర్స్​పై ఎక్స్‌పోర్ట్ కంట్రోల్స్ అమలు చేస్తాం.” అంటూ రాసుకొచ్చారు. చైనా తన రేర్​ ఎర్త్​ మినరల్స్​పై ఎగుమతి నియంత్రణలను పెంచడం సైతం ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణమైందని తెలుస్తోంది. తాజా టారిఫ్​లతో ఎలక్ట్రానిక్స్​ నుంచి ఎలక్ట్రిక్​ వాహనాల దాకా చాలా రంగాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

    Trump tariffs on china | రేర్ ఎర్త్ మినరల్స్‌పై చైనా ఆంక్షలు

    చైనాలో లభించే రేర్​ ఎర్త్ మినరల్స్​ (), కీలక ఖనిజాల ఎక్స్‌పోర్ట్‌లపై కొత్త నియంత్రణలు ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాలో ఉత్పత్తి చేసిన లేదా చైనా టెక్నాలజీతో తయారు చేసిన 0.1 శాతం కన్నా ఎక్కువ రేర్ ఎర్త్‌ మినరల్స్​ ఉన్న ఉత్పత్తుల ఎగుమతి కోసం విదేశీ సంస్థలకు లైసెన్స్ తప్పనిసరి చేసింది. ప్రపంచంలో 70 శాతం రేర్ ఎర్త్‌ మినరల్స్​ చైనా నియంత్రణలోనే ఉన్నాయి. ఇవి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రాడార్ సిస్టమ్‌లు, జెట్ ఇంజన్‌ల తయారీలో కీలకం. వీటిపై నియంత్రణ విధించడంతో అమెరికా ఈ చర్యకు దిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

    Trump tariffs on china | వాణిజ్య యుద్ధం..

    అమెరికా – చైనా (US – China) మధ్య కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోసారి ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభింస్తుందనే ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం చైనా దిగుమతులపై సగటు టారిఫ్ రేటు 40 శాతంగా ఉంది. ఈ అదనపు టారిఫ్‌తో మొత్తం 140 శాతానికి చేరవచ్చు.

    కాగా.. ఈ పరిణామంతో ట్రంప్, జిన్‌పింగ్‌ మధ్య ఈ నెల చివరలో దక్షిణ కొరియాలో జరిగే ఏపెక్ సమ్మిట్​కు ముందు జరిగే సమావేశం రద్దు కావొచ్చనే సూచనలు వెలువడుతున్నాయి.

  • Junk food | మీ పిల్లలకు జంక్​ ఫుడ్​ తినిపిస్తున్నారా.. రోగాలను కొనిస్తున్నట్టే లెక్క..!

    Junk food | మీ పిల్లలకు జంక్​ ఫుడ్​ తినిపిస్తున్నారా.. రోగాలను కొనిస్తున్నట్టే లెక్క..!

    తెలుగున్యూస్​టుడే, వెబ్​డెస్క్​: Junk food | మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. నేటి కాలంలో జంక్​ ఫుడ్ (Junk food)​ దొరకని ప్రదేశం లేకుపోయింది. మెట్రోపాలిటన్​ సిటీ నుంచి కుగ్రామాల వరకు జంక్​ఫుడ్​ విస్తరించేసింది. టేస్టీగా ఉండడం, ఆకర్షనీయమైన ప్యాకింగ్​లు ఉండడంతో పిల్లలు వీటిని తినడానికి ఇష్టపడుతుంటారు. కొన్ని కంపెనీలు పిల్లలను ఆకర్షించేందుకు ప్యాకేజింగ్​లో చిన్నచిన్న బొమ్మలు, స్టిక్కర్లు ఇస్తుండడంతో పిల్లలు వీటిని కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆకర్షణీయమైర రుంగులతో, టేస్ట్‌తో పిల్లల మనసులను ఎల్లప్పుడూ లాగేస్తుంటాయి. అయితే వారిని ఈ ఆహారాలకు దూరంగా ఉంచడానికి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవడం తీసుకోవాలి.

    Junk food | జంక్ ఫుడ్​ తీసుకోవడం కలిగే నష్టాలు..

    పిజ్జాలు, బర్గర్లు, డొనట్స్​, కూల్​డ్రింక్​లతో పాటు ఇతర జంక్ ఫుడ్​లో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి హానికరం. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్​ లోపం వల్ల జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి బలహీనంగా మారుస్తుంది.

    Junk food | ఊబకాయం

    జంక్ ఫుడ్​లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎంత తిన్నా తృప్తి తక్కువగా ఉంటుంది, దీంతో పిల్లలకు కడుపు నిండినట్లు అనిపించకపోవడంతో అతిగా తింటారు. ఈ అతి వినియోగం అధిక కేలరీలకు దారితీస్తుంది. దీంతో బాల్యంలో ఊబకాయం (Obesity) వచ్చే ప్రమాదాన్ని పెరుగుతుంది. ఇంకా వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. తరచుగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ఒబెసిటీకి దారితీస్తుంది.

    Junk food | అధిక రక్తపోటు

    చాలా వరకు జంక్ ఫుడ్స్‌లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. సోడియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక రక్తపోటుకు దారి తీస్తుంది. గుండె జబ్బులు (Heart desecss), స్ట్రోక్‌కు ప్రధాన కారకాలుగా మారతాయి.

    Junk food | అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)

    జంక్ ఫుడ్‌లో న్యూరోట్రాన్స్​మీటర్​ పనితీరు, మెదడు అభివృద్ధికి అవసరమైన పోషకాలు ఉండవు. చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు పిల్లల్లో ADHD లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.

    Junk food | ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ (Autoimmune disorders)

    ప్రాసెస్ చేసిన ఆహారంలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. జంక్​ ఫుడ్​ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. కొందరిలో ఆటో ఇమ్యూన్​ డిజార్డర్ సమస్యలు ఏర్పడవచ్చు. ఇది వ్యక్తి శరీరం పొరపాటున దాని సొంత కణజాలాలపై దాడి చేస్తుంది.

    Junk food | థైరాయిడ్ సమస్యలు 

    జంక్ ఫుడ్‌లోని అనారోగ్యకరమైన కొవ్వులు, అందులోని రసాయన మిశ్రమాలు థైరాయిడ్ (Thyroid) సమస్య తలెత్తుతుంది. థైరాయిడ్ సమస్య వల్ల బరువు పెరగడం, అలసట, హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది.

    Junk food | ఎలాంటి ఆహారం అందించాలంటే..

    జంక్​ ఫుడ్​ పిల్లల పెరుగుదల, మెదడు పనితీరుపై ప్రభావితం చేస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలి. పిల్లలకు గింజలు, ఎండిన పండ్లు, సలాడ్లు, సీజనల్​ ఫ్రుట్స్​ వంటివి అందించాలి. అలాగే భోజనం సమతుల్యంగా ఉండాలి. రోజు సూర్యరశ్మికి కొద్ది సేపు పిల్లలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల డి విటమిన్​ లభిస్తుంది. క్రమంతప్పకుండా నీటిని తీసుకునేలా చూడాలి. అలాగే సరైన నిద్ర పోయేలా చూసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

  • Credit cards | వామ్మో ఏం వాడకమయ్యా సామి..

    Credit cards | వామ్మో ఏం వాడకమయ్యా సామి..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్ డెస్క్: Credit cards | నేటి కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

    సూపర్​మార్కెట్​కు (Super market) వెళ్లినా, షాపింగ్​ మాల్​కు (Shopping mall) వెళ్లినా, రెస్టారెంట్​కు (Restaurant) వెళ్లినా ఇలా అన్ని చోట్లా ప్రజలు క్రెడిట్​ కార్డులు వాడుతున్నారు.

    అంతలా అలవాటు పడిపోయారు. అయితే సాధారంగా ఓ వ్యక్తి ఐదు నుంచి పది కార్డులు ఉంటే ఎక్కువ. కానీ ఈ వ్యక్తి వద్ద ఉన్న క్రెడిట్​ కార్డులెన్నో తెలిస్తే నోరెళ్లబెడతారు.

    Credit cards | వందల కార్డులు

    హైదరాబాద్​కు చెందిన మనీష్ ధమేజా అనే వ్యక్తి దగ్గర ఏకంగా 1,638 క్రెడిట్​ కార్డులు ఉన్నాయి. ఏంటి నిజమేనా అనుకుంటున్నారా.. నిజ్జంగా నిజమేనండి.. ప్రపంచంలో ఇన్ని కార్డులు ఏకైక వ్యక్తి ఈయనే. ఇన్ని క్రెడిట్​ కార్డులు వాడుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో (guinness world record) చోటు సంపాదించుకున్నాడు. ఈ ఘనత సాధించిన వ్యక్తి తెలంగాణ వాసి కావడం హాట్ టాపిక్​గా మారింది. అయితే మనీష్ అన్ని వందల కార్డులు ఎలా మెయింటెన్​ చేస్తున్నాడనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది.

    Credit cards | అప్పటి నుంచి..

    2016లో నోట్లు రద్దు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది క్యాష్​ కోసం ఇబ్బందులు పడ్డారు. మనీష్​కు సైతం అందరిలాగే కరెన్సీ నోట్ల సమస్య రావడంతో క్రెడిట్​ కార్డుల వినియోగం మొదలు పెట్టాడు. కరెన్సీకి బదులుగా వీటితో చెల్లింపు చేయడం ప్రారంభించాడు. ఇలా అతడి క్రెడిట్​ కార్డుల ప్రయాణం మొదలైంది.  కార్డుల ద్వారా ఆర్థిక సౌలభ్యంతో పాటు రికార్డులు, క్యాష్​బాక్​లు, డిస్కౌంట్లు, మూవీ కూపన్లు వస్తుండడంతో విరివిరిగా వాడుతూ వచ్చాడు.

    Credit cards | మనీష్​ ఏమంటున్నారంటే..

    క్రెడిట్​ కార్డుల వినియోగంలో గిన్నిస్​ రికార్డు సాధించిన మనీష్​ ఏమంటున్నాడంటే.. ‘క్రెడిట్ కార్డులు నా జీవితంలో ఒక పెద్ద భాగమైపోయాయి. ఇవి లేకుండా నా జీవితం అసంపూర్ణం. వీటి వల్ల నేను ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాను. హోటల్ బుకింగ్ డిస్కౌంట్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫ్రీ మూవీ టిక్కెట్లు, స్పా వోచర్లు, గోల్ఫ్ సెషన్లు, ఫ్యుయల్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఇవన్నీ ఈ కార్డుల వల్లే లభిస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. కొందరైతే ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

  • Heart diseases in youngers | యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు.. అందుకు కారణాలేమింటంటే..!

    Heart diseases in youngers | యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు.. అందుకు కారణాలేమింటంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Heart diseases in youngers | గుండె జబ్బులు ఒకప్పుడు 50 నుంచి 60 వయస్సు పైబడిన వారికే అత్యధికంగా వచ్చేవి. కానీ ప్రస్తుతం యువతలో గుండెజబ్బు సమస్యలు గణనీయంగా పెరిగాయి. 20 నుంచి 30 ఏళ్ల వయస్సు యువత సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోతున్నారు. చాలా మంది ముందస్తుగా హార్ట్​ఎటాక్​ లక్షణాలు కనిపించడం లేదు. గుండెపోటు లక్షణాలు ఇందుకు గల కారణలపై ‘India tv’ కథనం ప్రకారం..

    Heart diseases in youngers | మారిన జీవనశైలి

    నేటి ఆధునిక యుగంలో ప్రజల జీవనశైలి మారిపోయింది. జంక్​ ఫుడ్​కు (junk food) అలవాటు పడడం, పని ఒత్తిడి, ఎక్కువసేపు కూర్చుని కంప్యూటర్లపై పనిచేయడం ఇలా వివిధ కారణాల వల్ల డయాబెటిస్ (Diabetes), అధిక కొలెస్ట్రాల్ (high cholesterol), ఊబకాయం (obesity) వంటివి వస్తున్నాయి. దీనివల్ల యువకులలో గుండె జబ్బుల ప్రాబల్యం పెరుగుతోంది. ఓ డయాగ్నోస్టిక్స్ డేటా ప్రకారం.. 25–35 సంవత్సరాల వయస్సు గల యువకుల్లో 13 శాతం మంది డయాబెటిక్, 25 శాతం మంది ప్రీ-డయాబెటిక్ స్టేజ్​ ఉన్నారు. అంతేకాకుండా 28 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్నారు.

    Heart diseases in youngers | గంటల తరబడి కూర్చుని పనిచేయడం..

    గుండె జబ్బులు పెరగడానికి మన ప్రస్తుత జీవన విధానం ఎంతో ప్రభావం చూపిస్తోంది. యువత గంటల తరబడి డెస్క్‌ల వద్ద కూర్చుని పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో వండిన భోజనానికి బదులుగా.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, జంక్​ఫుడ్​, కూల్​డ్రింక్స్​​ లాంటివి అధికంగా తీసుకున్నారు. ఇలా ఆరోగ్యానికి హానీ చేసి ఫుడ్​ తీసుకోవడం వల్ల చిన్న వయస్సులో అధిక కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి.

    Heart diseases in youngers | ఒత్తిడి మరో సమస్య

    ప్రస్తుతం యువతలో పెరుగుతున్న ఒత్తిడి కూడా హార్ట్​ ప్రాబ్లమ్స్​ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఉద్యోగంతో పాటు ఇతర ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీర్ఘకాలిక ఒత్తిడి ఎదుర్కోవడం అనేది రక్తపోటును పెంచుతుంది. ఇది కాలక్రమేణా గుండెకు హాని చేస్తుంది. దీనికి తోడు 20 నుంచి 30 ఏళ్ల వయస్సుల్లోనే డయాబెటిక్​ బారిన పడుతున్నారు.

    Heart diseases in youngers | నిద్ర లేమి, బయటి ఆహారం తీసుకోవడం వల్ల..

    యువత ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. సగటు మనిషి సరిపోయేంత నిద్ర పోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో రక్తపోటు, గుండె ఒత్తిడిని పెంచే హార్మోన్లను విడుదల చేస్తుంది. సుదీర్ఘమైన కార్యాలయ గంటలు, లేట్​ నైట్​ వరకు సోషల్ మీడియా స్క్రోలింగ్ అనేవి నిద్రను దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా ప్రాసెస్ చేసిన ఆహారం మరో కారణం. అధిక చక్కెర ఉంటే పానీయాలు, జంక్​ఫుడ్​, ఫాస్ట్ ఫుడ్‌లో చెడు కొవ్వులు, సోడియం, చక్కెరతో నిండి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, ఊబకాయం, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవన్నీ గుండె జబ్బులకు దారి తీస్తున్నాయి.

    Heart diseases in youngers | ఇలా చేయండి..

    • తక్కువ ప్రాసెస్ చేసిన, ఫ్రైడ్​ ఆహారాన్ని తీసుకోండి. ఇంట్లో వండిన భోజనానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వండి.
    • రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. వాకింగ్​, సైక్లింగ్​, యోగా లాంటివి చేయండి.
    • వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోండి. రాత్రి పూట కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోండి.
    • ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి.
    • అలసట, ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
  • Leh-Manali highway | ప్రపంచంలో అత్యంత సుందరమైన హైవే.. వైరల్​ అవుతున్న ఆనంద్​ మహీంద్రా ట్వీట్

    Leh-Manali highway | ప్రపంచంలో అత్యంత సుందరమైన హైవే.. వైరల్​ అవుతున్న ఆనంద్​ మహీంద్రా ట్వీట్

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్ డెస్క్​: Leh-Manali highway | ఆనంద్​ మహీంద్రా (Anand mahindra) తాజాగా పోస్ట్​ చేసిన ట్వీట్​ నెట్టింట వైరల్​గా మారింది. “లెహ్ – మనాలి హైవే ప్రపంచంలోని అత్యంత సుందరమైన వాటిల్లో ఒకటి. ఇది మిమ్మల్ని కుర్చీలో కూర్చోకుండా.. భారత సహజ వైభవాన్ని పునరావిష్కరింపజేయాలని అనిపిస్తుంది” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్​ మారింది. పోస్ట్​ చేసిన 24 గంటల్లోపే లక్షల మంది వీక్షించారు.

    Leh-Manali highway | ప్రకృతి రమణీయం లెహ్ – మనాలి హైవే..

    ప్రకృతి రమణీయత లేహ్–మనాలి హైవే సొంతం. 428 కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉన్న ఈ రహదారిపై ప్రయాణించడం ఒక అద్భుతమైన ప్రయాణం ఎత్తయిన పర్వాతాలు, మధ్యలో లోయలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, గడ్డకట్టిన నదుల అందాలు ప్రయాణికులను మంతముగ్ధులను చేస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి లద్దాఖ్​లోని లేహ్ వరకు సాగే ఈ రహదారి అందాలు కట్టిపడేస్తాయి. దేశంలోని నాలుగు అత్యధిక ఎత్తయిన మోటరబుల్ పాస్‌లను దాటి వెళ్తుంది. రోతాంగ్ లా, బరలాచా లా, లుంగలాచా లా, టాంగ్లాంగ్ లా పాస్​లు 16,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండడం విశేషం. కాగా.. ఈ మార్గాన్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిర్వహిస్తుంది.

    Leh-Manali highway | సాహసయాత్రికులకు స్పెషల్​

    ఈ రహదారి సాహసయాత్రికులకు ఎంతో స్పెషల్​. రైడర్స్​ తప్పకుండా టూర్​ వేయాల్సిన హైవే ఇది. కొండలు, లోయలు, హిమాలయాల్లోని హై-ఆల్టిట్యూడ్ సరస్సులు, మౌనంగా ఉండే గ్రామాలు ఇవన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా అనిపిస్తుంది. అయితే గతంలో ఈ దారి ఏడాదిలో కేవలం ఆరు నెలలపాటు మాత్రమే తెరిచి ఉండేది. అది కూడా మంచు వర్షాల వల్ల ఎంతో క్లిష్టంగా ఉండేది. అయితే అటల్ టన్నెల్ నిర్మాణం చేపట్టడంతో ఈ మార్గం 45 కి.మీ. తగ్గిపోయింది. ప్రయాణం సులువుగా మారింది. కాగా.. ఈ రహదారిపై శింగో లా టెన్నల్​ నిర్మాణం కూడా చేపట్టారు. ఇది పూర్తయితే అన్ని కాలాల్లో ప్రయాణం చేయడానికి సులువుగా మారనుంది. అంతేకాకుండా ఈ రహదారి భారత సైన్యానికి కూడా వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన మార్గంగా చెబుతారు.

    https://twitter.com/anandmahindra/status/1974766448561328605

     

  • Government apps | ఈ రెండు ప్రభుత్వ యాప్స్​ మీకు తెలుసా.. వీటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!

    Government apps | ఈ రెండు ప్రభుత్వ యాప్స్​ మీకు తెలుసా.. వీటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!

    తెలుగు న్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Government apps | కేంద్ర ప్రభుత్వం యువతలో స్కిల్స్​ పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వివిధ యాప్స్​ను కూడా నడుపుతోంది. వీటిలో రెండు యాప్ప్​ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

    Government apps | మై గోవ్​ యాప్​..

    మై గోవ్​ యాప్​ (My gov app) అనేది పౌర భాగస్వామ్యానికి వేదికగా నిలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని 2014లో ప్రారంభించారు. ప్రజలు వివిధ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల రూపకల్పనలో పాలుపంచుకునేలా చేసేందుకు దీనిని తీసుకువచ్చారు. ప్రజల నుంచి పాలనాపరంగా మంచి ఆలోచనలను సేకరించేందుకు ఇది వేదికగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో వివిధ క్విజ్​లు, సర్వేలు, కాంపిటీషన్లు నిర్వహిస్తూ ఉంటారు. అంతే క్విజ్ ఆప్షన్​ను సెలెక్ట్​ చేసుకోవాలి. అందులో చాలా క్విజ్​లు ఉంటాయి. మీకు నచ్చినది ఎంచుకుని పార్టిసిపేట్​ చేయవచ్చు. ఇందులో మీరు గెలిచినట్లయితే క్విజ్​ కాంపిటీషన్​ బట్టి రూ.5 వేల నుంచి రూ.లక్షల వరకు గెలుచుకోవచ్చు. అంతేకాకుండా గెలిచిన వారి వివరాలను ఇదే యాప్​లో నమోదు చేస్తారు.

    Government apps | స్కిల్​ ఇండియా యాప్

    స్కిల్​ ఇండియా యాప్ (Skill india) దేశంలోని ప్రజల్లో నైపుణ్యాన్ని పెంచడానికి ​కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో చాలా రకాల కోర్సులను ఉచితంగా అందిస్తోంది. దీనిలోకి వెళ్లి ఉచితంగా లభించే సెలెక్ట్​ చేసుకుని నేర్చుకోవచ్చు. వీటిలో ఏఐకి సంబంధించిన కోర్సులను సైతం అందిస్తోంది. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్​ కూడా అందిస్తారు. అంతేకాకుండా ఇదే యాప్​లో జాబ్స్​ కూడా సెర్చ్​ చేసుకుని అప్లయ్​ చేసుకుని జాబ్​ పొందవచ్చు. ఇలా ఈ ప్రభుత్వ యాప్​లను సద్వినియోగం చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు.

  • Self Driving auto | డ్రైవర్​ లేని ఆటోనా.. నిజమేనా..! అదీ మేడిన్​ ఇండియా.. ఎక్కి కూర్చుంటే అదే తీసుకెళ్తుంది..

    Self Driving auto | డ్రైవర్​ లేని ఆటోనా.. నిజమేనా..! అదీ మేడిన్​ ఇండియా.. ఎక్కి కూర్చుంటే అదే తీసుకెళ్తుంది..

    తెలుగు న్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Self Driving auto | డ్రైవర్​ లేని ఆటో.. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా.. టెక్నాలజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. పెరుగుతున్న సాంకేతిక కొత్త ఆవిష్కరణకు నాంది పలుకుతోంది. మన దేశానికి చెందిన ఓ ప్రముఖ త్రీవీలర్​ ఆటో మొబైల్​ సంస్థ ఈ సెల్ఫ్​ డ్రైవింగ్​ ఆటోను రూపొందించింది. దాని విశేషాలు తెలుసుకుందాం పదండి..

    Self Driving auto | అధునాతన ఫీచర్స్​ను ఉపయోగించి..

    ఓమెగా సీకి మొబిలిటీ (Omega Seiki Mobility) అనే సంస్థ సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ ఆటోను ఇటీవల ఆవిష్కరించింది. అయితే మనది జనాభా ఎక్కువ గల దేశం. అంతేకాకుండా విపరీతమైన ట్రాఫిక్​లో ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. దీనిని దృష్టిలో ఉంచుకునే సదరు కంపెనీ ఈ త్రీ వీలర్​ను తయారు చేసింది. దేశంలోని అధిక జనసాంద్రత, లో స్పీడ్ ట్రాఫిక్‌కు అనుకూలంగా దీనీని రూపొందించారు. లిడార్, జీపీఎస్​, ఏఐ ఆధారిత నావిగేషన్ (Navigation) వంటి ఆధునిక సాంకేతికతలతో తయారు చేయడం వలన సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. కాగా.. వీటిని త్వరలో ప్రయాణికుల వేరియంట్, రవాణా వేరియంట్లను మార్కెట్​లో తీసుకురానున్నారు.

    Self Driving auto | ఈ ఆటో ఫీచర్స్​ ఇవే..

    ఒమేగా సీకి సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇందులో ఒకటి ప్యాసింజర్ వెర్షన్ కాగా.. మరోటి కార్గో వెర్షన్​. పాసింజర్​ను మనషుల ప్రయాణానికి తగినట్లుగా తయారు చేశారు. ఇక కార్గో వెర్షన్ గూడ్స్ ట్రాన్స్ పోర్టేషన్​ కోసం తగినట్లుగా డిజైన్ చేశారు. ఈ ఆటో 10.3 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్​ చేస్తే 12‌‌0 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఏఐ బేస్డ్​ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో ఈ త్రీవీలర్​ నడవనుంది. ఇందులో మల్టీ సెన్సార్ నావిగేషన్​తో పాటు రిమోట్ సేఫ్టీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ముందుగా మీరు ఒక లొకేషన్ సెట్ చేస్తే.. అది ఆటోమెటిక్​గా, సేఫ్​గా తన రూట్ ఎంచుకుని గమ్యాన్ని చేరుకుంటుంది.

    ఈ సెల్ఫ్​ డ్రైవింగ్​ త్రీవీలర్ (Self driving auto) అనేది​ దేశ రవాణా రంగంలో కీలక ముందుడుగా మారుంతుందని చెప్పవచ్చు. దేశంలో అనేక మంది తక్కువ ఛార్జీలతో గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆటోలకు ప్రాధాన్యతనిస్తారనేది మనకు తెలిసిందే. అయితే త్వరలో అందుబాటులోకి రానున్న ఈ డ్రైవర్​ లేని ఆటోలు ఎంత వరకు సక్సెస్​ అవుతాయనేది ఆసక్తికరమైన అంశం. కాగా.. ‘మేము ప్రజలకు సేవ చేసే టెక్నాలజీని అందిస్తున్నాం’ అని కంపెనీ ఛైర్మన్​ ఉదయ్​ నారంగ్ ​చెప్పుకొచ్చారు.