Penci Sport plugin only working with the Soledad theme.

Harsha Vardhan - Telugu News Today - Page 11 of 13

Author: Harsha Vardhan

  • Dhantrayodashi | ధన త్రయోదశి రోజు బంగారం కొనలేకపోతున్నారా..? అయితే వీటిని కొనండి.. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది..!

    Dhantrayodashi | ధన త్రయోదశి రోజు బంగారం కొనలేకపోతున్నారా..? అయితే వీటిని కొనండి.. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Dhantrayodashi | వెలుగు దివ్వెల దీపావళి పండుగ వచ్చేసింది. ఐదురోజుల వేడుకల్లో తొలి రోజు ధన త్రయోదశి (ధన్ తేరస్​) జరుపుకొంటామని మనకు తెలిసిందే. అయితే ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మి కటాక్షం పొందవచ్చని కోట్ల మంది నమ్మకం. ఈ రోజున తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాలా.. ఒకవేళ కొనలేకపోతే ఎలా.. ఇంకా ఏవైనా కొంటే లక్ష్మ కటాక్షం సిద్ధిస్తుందా అనే విషయాలు తెలుసుకుందాం..

    Dhantrayodashi | ధన త్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత

    ధన త్రయోదశి (Dhantrayodashi) తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆశ్వయుజ అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకొంటాం. ఈ రోజున ప్రదోషకాలంలో అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి 8 గంటల వరకు శివారాధన చేయడం ఎంతో శ్రేష్టమైంది.

    Dhantrayodashi | ఆనవాయితీగా వస్తున్న బంగారం కొనుగోలు..

    ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఈ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకొంటారు. దీనిని ఉత్తరాదిలో ధన్ తేరస్ అని అంటారు. ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు ఉంటాయని భావిస్తారు. దీపావళి ముందు వచ్చే ఈ ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీ వస్తోంది. ఎక్కువ మంది పసడి కొనుగోలుకే ఆసక్తి చూపిస్తుంటారు.

    Dhantrayodashi | ఎందుకు కొనాలని చెబుతారంటే..

    ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా భావించే బంగారు, వెండి వంటివి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. వీటి కొనుగోలు వల్ల లక్ష్మీదేవితో పాటు సంపదలకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం కూడా కలుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే ఈ రోజున బంగారం, వెండి కొంటుంటారు. అలాగే ఇదే రోజు నుంచి దీపావళి వేడుకలు ప్రారంభం అవుతాయి. బంగారంతో దీపావళి సంబరాల్లో మొదటిరోజు లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడం సంప్రదాయం వస్తోంది.

    Dhantrayodashi | బంగారం తప్పకుండా కొనాలా..!

    జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధన త్రయోదశి రోజు బంగారం, వెండి లాంటివి వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదమని భావిస్తారు. అయితే బంగారం ధరలు భారీగా పెరిగిపోవడం వల్ల కొనుగోలు చేయడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. వీటికి ప్రత్యామ్నాయంగా ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు.

    Dhantrayodashi | వీటిని కూడా కొనుగోలు చేయవచ్చు..

    సాధారణంగా ఇంట్లో వాడే ఉప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చ కర్పూరం లాంటి వాటిని లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు. అందుకే ధన త్రయోదశి రోజు ఈ వంటింటి సరుకులు కొనడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చునని పండితులు పేర్కొంటున్నారు. అలాగే కొత్త పాత్రలు కొనడం అనాదిగా వస్తోంది. భాగవతం ప్రకారం ధన్వంతరి క్షీర సాగరం నుంచి అమృత కలశంతో ఉద్భవించాడు. కావున ఈ రోజు కొత్త పాత్రలు కొనడం శుభంగా భావిస్తారు. అలాగే ఇత్తడి అనేది ధన్వంతరికి ప్రీతికరమైన లోహంగా చెబుతారు. అందుకే.. ఇత్తడి పాత్రలు కొనడం వల్ల ఆరోగ్యం, అదృష్టంతో పాటు సంపద కూడా పెరుగుతుందని విశ్వసిస్తారు. కొత్త చీపురు కొనడం కూడా మంచిదని చెబుతున్నారు.

    Dhantrayodashi | వీటిని ఇంట్లో ఉంచడం మంచిది..

    ధన్​ తేరస్​ రోజు బంగారం, వెండి కొనలేనివారు శ్రీయంత్రం, కుబేర యంత్రం కొనుగోలు చేయడం శుభప్రదం. వీటిని ఇంట్లో గాని వ్యాపార ప్రదేశంలో గాని పెట్టడం ద్వారా లక్ష్మీకుబేరుల అనుగ్రహం సిద్ధిస్తుందని చెబుతారు. 11 గోమతి చక్రాలను కొని.. వాటిని ఎర్రటి గుడ్డలో చుట్టి ఇంట్లో పెట్టుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు. అదేవిధంగా పసుపు గవ్వలు కొని పూజామందిరంలో ఉంచితే సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు.

    గమనిక : పైన తెలిపిన వివరాలు మాకు ఉన్న సమాచారం మేరకు ఇచ్చినవి మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు. దీనిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత అంశం.

    Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్​ పేషెంట్స్​ తినొచ్చా..!

  • Macbook pro m5 | భారత్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం 5 లాంఛ్​.. ధర ఎంతో తెలుసా..!

    Macbook pro m5 | భారత్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం 5 లాంఛ్​.. ధర ఎంతో తెలుసా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Macbook pro m5 | దిగ్గజ మొబైల్​ సంస్థ ఆపిల్​ తన అభిమానులను ఆకట్టుకునేలా నూతన మ్యాక్‌బుక్ ప్రోను (Macbook pro m5) భారత్‌లో గ్రాండ్​గా లాంచ్ చేసింది. ఎమ్5 చిప్​తో అత్యాధునికమైన ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో పాటు గ్రాఫిక్స్ వర్క్​ చేసేవారికి అద్భుతమైన వేగాన్ని అందించనుంది. దీని ధర రూ. 1,69,900ల నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రొఫెషనల్స్​తో పాటు క్రియేటర్లకు వారి పనిని మరింత సులభతరంగా మారుస్తుందని కంపెనీ పేర్కొంది.

    Macbook pro m5 | వేగవంతమైన పనితీరు.

    ఆపిల్ లాంచ్​ చేసిన ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా.. మ్యాక్‌బుక్ లైనప్‌ను మరింత శక్తివంతం చేసింది. గతంలోని ఎం4 చిప్‌తో పోలిస్తే.. ఈ ఎం 5 చిప్ ఏఐ పనుల్లో 3.5 రెట్లు వేగవంతమైన పనితీరు చూపిస్తుంది. గ్రాఫిక్స్‌లో 1.6 రెట్లు మెరుగైన ప్రదర్శనను కనబరుస్తుంది. దీనివల్ల క్రియేటివ్ యాప్‌లలో ఏఐ టూల్స్ మరింత సులభంగా వర్క్​ అవుతాయి. అంతేకాకుండా ఎస్‌ఎస్‌డీ పనితీరు 2 రెట్లు వేగవంతంగా పనిచేస్తుంది. బ్యాటరీ లైఫ్ 24 గంటల వరకు ఉంటుంది.

    Macbook pro m5 | స్పెసిఫికేషన్లు, ఫీచర్స్​ ఇవే..

    నూతన మ్యాక్‌బుక్ ప్రో 14 ఇంచ్ మోడల్‌తో వస్తోంది. ఇందులో 14.2 ఇంచ్ లిక్విడ్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే రిజల్యూషన్ 3024×1964 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కంపెనీ తెచ్చింది. నానో – టెక్స్​చర్​ గ్లాస్ ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇది రిఫ్లెక్షన్లను తగ్గించి మెరుగైన వ్యూయింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇస్తుంది.

    ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఎం5 చిప్‌లో 10-కోర్ సీయూ (4 పర్​ఫార్మెన్స్​ కోర్​లు, 6 ఎఫిషియెన్సీ కోర్​లు), 10-కోర్ జీయూ, 16-కోర్ న్యూరల్ ఇంజిన్లు ఉన్నాయి. మెమరీ 16 జీబీ నుంచి 24 జీబీ వరకు లభ్యవమవుతున్నాయి. స్టోరేజ్ 512 జీబీ నుంచి వన్​ టీబీ వరకు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ఇచ్చిన 12 ఎంపీ సెంటర్ స్టేజ్ కెమెరాతో పాటు సిక్స్-స్పీకర్ స్పెషల్ ఆడియో సిస్టమ్‌తో వీడియో కాన్ఫరెన్సింగ్​ మరింత సౌకర్యంగా మారనుంది. మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్, ఎస్‌డీ కార్డ్ స్లాట్, హెడ్‌ఫోన్ జ్యాక్, హెడ్‌ఎంఐ పోర్ట్‌లు సైతం ఇందులో ఉన్నాయి. కాగా.. ఈ ల్యాప్‌టాప్ macOS తాహో అనే ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఇందులో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. ఇందులో స్పేస్ బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

    Macbook pro m5 | మ్యాక్‌బుక్ ప్రో ధరలు ఇలా..

    • 16జీబీ ర్యామ్ / 512జీబీ స్టోరేజ్: రూ. 1,69,900
    • 16జీబీ ర్యామ్/1టీబీ స్టోరేజ్: రూ. 1,89,900
    • 24జీబీ ర్యామ్/1టీబీ స్టోరేజ్: రూ. 2,09,900 వేరియంట్లు ఉన్నాయి.

    Macbook pro m5 | డిస్కౌంట్​ ఆఫర్లు ఇవే..

    అయితే స్టూడెంట్స్​ కోసం డిస్కౌంట్​ ఆఫర్లు ఉన్నాయి. స్టూడెంట్స్ ఆపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ ద్వారా రూ. 10,000 డిస్కౌంట్ పొందవచ్చు. ప్రీ-ఆర్డర్ ఆపిల్ వెబ్‌సైట్, దేశంలోని నాలుగు ఆపిల్ స్టోర్లు, అథరైజ్డ్ రీసెల్లర్ల ద్వారా చేసుకోవచ్చు. ఇక అధికారిక సేల్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.

    Read aslo : Gmail account | మీ జీమెయిల్ ఖాతా హ్యాక్ అయిందా..? అయితే వెంటనే ఇలా చేయండి..!

  • Late night sleep | రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..

    Late night sleep | రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Late night sleep | ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కంటి మీద కునుకు కరువైపోయింది. పని ఒత్తిడి, ఇతర టెన్షన్స్​, మొబైల్​, టీవీ స్క్రీన్​లకు అతుక్కుపోవడం నిద్రకు దూరం చేస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహ్లాదకరమైన జీవన శైలికి సమతుల ఆహారం ఎంత ముఖ్యమో.. సుఖమయమైన నిద్ర అంతే తప్పనిసరి. ఈ రెండు సక్రమంగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా సగటు మానవుడు ఎన్ని గంటలు నిద్ర పోవాలి తదితర విషయాలు తెలుసుకుందాం పదండి..

    Late night sleep | నిద్రలేమికి కారణాలివే..

    రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వారు (late night sleep) అనారోగ్య సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారనేది సత్యం. ముఖ్యంగా బిజీబిజీ జీవితం, అనేక ఒత్తిళ్లు ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆలస్యంగా నిద్రించే వారు అనారోగ్యకమైన అలవాట్ల వల్ల సగటు ఆయు ప్రమాణం తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో పని చేసేవారు.. లేదంటే ఫోన్లు, టీవీలు ఎక్కువగా చూసే వాళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీనివల్ల నిద్రలేమి సమస్య తలెత్తి అనారోగ్యాల భారిన పడుతున్నారు. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యం సైతం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి అనేది భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

    Late night sleep | మానసిక ఆరోగ్యంపై ప్రభావం

    నిద్ర లేకపోవడం మూలంగా కేవలం శారీరక ఆరోగ్యం కాకుండా.. మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. సరిపోనూ నిద్ర లేకపోతే, ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు వస్తుంటాయి. నిద్రలో మెదడు రోజూ వారి కార్యకలాపాలను ప్రాసెస్ చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి అనేది తగ్గపోతుంది. కాగా.. నిద్రలేమి సమస్య ఎదుర్కొనే వారిలో మెదడుపై ప్రభావం పడుతుంది. దీనివల్ల మానసిక స్థితిలో మార్పులు, చిరాకు, కోపం తదితర ఇబ్బందులు కలుగుతాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు.

    Late night sleep | రోగనిరోధక శక్తిపై ప్రభావం..

    నిద్ర అనేది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. సరిగ్గా నిద్రపోక పోయినట్లయితే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశాలు ఉంటాయి.

    Late night sleep | జ్ఞాపకశక్తి దెబ్బతినే అవకాశాలు..

    మెదడుకు నిద్ర అనేది ఎంతో ముఖ్యం. ఇది జ్ఞాపకశక్తితో పాటు అభ్యాసన సామర్థ్యాన్ని, ఏకాగ్రతను కాపాడడంలో దోహదం చేస్తుంది. నిద్రలేమి (Insomnia) వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం లాంటి వాటిపై సైతం ప్రభావం కనిపిస్తుంది.

    Late night sleep | బరువు పెరుగుదల సమస్య..

    నిద్రలేమికి.. ఊబకాయం మధ్య సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరిపోయేంత నిద్ర లేకపోవల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని చెబుతున్నారు. దీనివల్ల ఆకలిని ప్రేరేపించే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ క్రమంలో ఎక్కువగా తినే అవకాశాలుంటాయి. అధిక కేలరీలు ఉండే ఆహారంతో పాటు తీపి పదార్థాలు తినాలని అనిపిస్తుందట. ఇవి ఇది బరువు పెరగడానికి దారితీస్తాయి. జీవక్రియపై ప్రభావం చూపడంతో బరువు పెరుగుదలకు దారితీయొచ్చు.

    Late night sleep | ఇతర ప్రభావాలూ ఉంటాయి..

    నిద్ర సమస్య కారణంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. నిద్రలో మన శరీరం రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశాలుంటాయి. దీంతో గుండెకు ఒత్తిడి పడి హృదయ సంబంధ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.

    Late night sleep | ఎంతసేపు నిద్ర పోవాలంటే..

    సాధారణంగా మనిషిలో వయసు ఆధారంగా నిద్రపోయే విధానం ఉంటుంది. పసిపిల్లలు ఎక్కువ సేపు నిద్రపోతారు. అయితే క్రమంగా వయస్సు పెరిగే కొద్దీ నిద్ర అనేది తగ్గుతుంది. అప్పుడే పుట్టిన శిశువు రోజుకు 11 నుంచి 14 గంటల వరకు నిద్రపోవడం అవసరం. ఇక మూడు నుంచి ఐదళ్ల మధ్య వయస్సు గల పిల్లలు 10 గంటలు పడుకోవాల్సి ఉంటుంది. స్కూల్​కు వెళ్లే పిల్లలు రోజుకు కనీసం 8 గంటలు నిద్రించాలి. 18 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన వారయితే రోజు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి. 60 ఏళ్లు పైబడిన వారైతే కనీసం 6 గంటలైనా రోజుకు నిద్రపోవాల్సి ఉంటుంది.

    Late night sleep | చక్కగా నిద్ర పోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి..

    నిత్య జీవితంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. నిద్ర విషయం సమయపాలన పాటించాలి. రోజూ ఒక సమయం పెట్టుకుని నిద్రపోవాలి. నిద్ర లేవడంలోనూ సమయం పాటిస్తే చాలా మంచిది. రాత్రి సమయంలో భోజనానికి, నిద్రకు మధ్య కనీసం రెండు, మూడు గంటల సమయం ఉండేలా చూసుకోండి. నిద్రపోయేందుకు గంట ముందు నుంచే గ్యాడ్జెట్లను పక్కన పెట్టేయండి. అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు గోరువెచ్చటి పసుపు పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. నిద్రపోయే గదిలో సరైన వెంటిలేషన్‌తో పాటు చీకటిగా ఉండేలా చూసుకోవాలి. అలా ఇష్టం లేని వారుంటే కనీసం తక్కువ వెలుతురు ఉండే చూసుకోండి. ఇలా కొన్ని చర్యలు తీసుకోవడం నిద్ర బాగా పడుతుంది. హాయిగా నిద్ర పోవడం వల్ల ప్రశాంతమైన జీవితం గడపవచ్చు.

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం. Late night sleep can lead to various health issues, including fatigue and decreased cognitive function. It is advisable to prioritize a consistent sleep schedule to promote overall well-being.

    Follow Us : X.com, Facebook

    Read also : Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్​ పేషెంట్స్​ తినొచ్చా..!

  • Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్​ పేషెంట్స్​ తినొచ్చా..!

    Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్​ పేషెంట్స్​ తినొచ్చా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Custard Apple | చలికాలం వచ్చిందంటే.. సీతాఫలాలు విరివిరిగా లభ్యమవుతాయి. పోషక విలువలు అధికంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి. గుల్లలు గుల్లలు తెచ్చుకుని ఇంట్లో మగ్గబెట్టుకుని పొద్దునా, సాయంత్రం తినేవాళ్లం. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఈ పండును లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. వీటిని చూస్తే తినాలని మనసు ఇట్టే లాగేస్తుందంటే అతిశయోక్తి కాదు. వీటి రుచి అలా ఉంటుంది మరి. రుచి ఒకటే కాదు.. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి.

    Custard Apple | ఒత్తిడి దూరం..

    సీతాఫలాన్ని ఒక్కోచోట ఒక్కోలా పలుకుతారు.. చిత్తలపండు, చిత్తలకాయ, చిత్పలకాయ ఇలా ఎవరు ఎలా పిలిచినా.. దీని రుచి మాత్రం అమోఘం. వీటిని తినడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు సైతం దరి చేరకుండా ఉంటాయి. అలాగే గాయాలు కూడా త్వరగా మానుతాయని చెబుతుంటారు. అంతేకాకుండా మలబద్ధం సైతం తగ్గుతుంది. ఇవి ఒంటికి చలవ చేస్తాయి. అందుకే సీజన్​లో రోజూ వీటిని తినడం వల్ల కడపులో మంట తగ్గుతుంది. వీటి వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. కండరాలు, నరాల బలహీనత తగ్గడానికి సైతం సీతాఫలం తోడ్పడుతుంది.

    Custard Apple

    Custard Apple | పోషకాలు అధికం..

    సీతాఫలంలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. కస్టర్డ్ యాపిల్ (Custard Apple) అని పిలిచే ఈ ఫలంలో ఐరన్, మెగ్రీషియం, పాస్ఫరస్​లతో పాటు విటమిన్-సి (Vitamin-C) సైతం సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వంద గ్రాముల సీతాఫలంలో 68.6 గ్రాముల తేమ, 26.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.6 గ్రాముల కొవ్వు, 2.4 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయని పేర్కొంటున్నారు.

    Custard Apple | డయాబెటిస్​ ఉన్న వాళ్లూ తినొచ్చు..

    మధుమేహం (Diabetes) ఉన్నవాళ్లు మితంగా ఈ పండుని తినొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది ఇన్‌ ఫ్లమేషన్‌ను తగ్గించడంతో పాటు గుండెకు మేలు చేస్తుందంటున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, పీచు, ఐరన్‌, విటమిన్‌-ఏ, సీ (Vitamin A) ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే సీతాఫలం తినడం ద్వారా జలుబు చేస్తుందని చాలామందికి అపోహ ఉంటుంది. కానీ అది నిజం కాదని వైద్యులు చెబుతున్నారు.

    Custard Apple | అనారోగ్య సమస్యలుంటే దూరం ఉండడం మంచిది..

    ఈ పండును కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎలర్జీతో బాధపడేవాళ్లు దీనిని తినడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవాళ్లు సీతాఫలం తినొద్దని పేర్కొంటున్నారు.

    ఇక సీతాఫలంలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో వైద్యులు రక్తహీనతతో బాధపడుతున్న దీనిని తీసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఇది అలసటను సైతం దూరం చేస్తుంది. సీతాఫలంలోని పీచు పదార్థం టాక్సిన్స్​ను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాక ఎసిడిటీ లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇంకేం.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఈ సీతాఫలాన్ని ఈ సీజన్​లో ఆస్వాదిద్దాం మరి..

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం (Health tips) మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

  • Donald Trump | ట్రంప్‌నకు ఇజ్రాయిల్‌ అత్యున్నత పౌర పురస్కారం.. ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు..

    Donald Trump | ట్రంప్‌నకు ఇజ్రాయిల్‌ అత్యున్నత పౌర పురస్కారం.. ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు ఇజ్రాయిల్​ అత్యున్నత పురస్కారం అందజేయనుంది. గాజా ఒప్పందం కుదిర్చిన నేపథ్యంలో అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ఆ దేశం ప్రకటించింది. గాజా ఒప్పందం.. బందీల విడుదలకు కృషి చేసినందుకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌’ (Presidential Medal of Honor)ను ప్రదానం చేయనున్నట్లు అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ తెలిపారు. త్వరలో సమయం, వేదిక నిర్ణయించి అందజేయనున్నట్లు ప్రకటింటించారు. డొనాల్డ్​ ట్రంపు ఈ గౌరవాన్ని అందుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన మద్దతు, దేశ పౌరుల భద్రత కోసం కృషి తాము ఈ విధంగా గౌరవిస్తున్నట్లు తెలిపారు.

    Donald Trump | గాజా యుద్ధం ముగిసిందన్న ట్రంప్​

    ఇజ్రాయిల్ – హ‌మాస్ మ‌ధ్య రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధం ముగిసింద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్ర‌క‌టించారు. గాజా శాంతి ఒప్పందం (Gaza Peace Agreement) కోసం పశ్చిమాసియాకు బయలుదేరిన వేళ ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఇజ్రాయిల్‌కు వెళ్లే మార్గంలో ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇప్ప‌టికే అనేక యుద్ధాల‌ను ఆపాన‌ని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న సంఘ‌ర్ష‌ణ‌ను కూడా నిలువ‌రిస్తానంటూ చెప్పుకొచ్చారు.

    Donald Trump | నోబెల్ బహుమతిపై కీలక వ్యాఖ్యలు

    అనేక దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు నిలువ‌రించాన‌ని ట్రంప్‌ మ‌రోసారి చెప్పారు. యుద్ధాలు ఆపాడంలో తాను స్పెషలిస్టున‌ని వ్యాఖ్యానించారు. అయినా తనకు నోబెల్ బ‌హుమ‌తి ఎందుకు రాలేదో తెలియ‌ద‌ని పేర్కొన్నారు. అయినా కూడా తమ శాంతి ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతూనే ఉంటాయని చెప్పారు. గాజా శాంతి ఒప్పందం గురించి మాట్లాడుతూ.. అన్ని పార్టీలను సంతోషపెట్టామని తెలిపారు. ఈజిప్టును సందర్శించి, మధ్యప్రాచ్య పరిస్థితిపై సైతం చర్చించడానికి ప్రాంతీయ నాయకులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. ‘మేం అందరినీ సంతోషపెట్టబోతున్నాం.. యూదులు అయినా, ముస్లింలు అయినా, అరబ్ దేశాలైనా..’ అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ తర్వాత ఈజిప్టు దేశానికి వెళ్తున్నా. శక్తివంతమైన, పెద్ద దేశాలు, ధనిక దేశాలు, నాయకును కలవబోతున్నా వారందరూ ఈ ఒప్పందంలో ఉన్నారు” అని పేర్కొన్నారు.

    Donald Trump | రష్యా రాజీకి రాకపోతే వాటిని రంగంలోకి దించుతాం

    ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై కూడా ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేవారు. ఈ యుద్ధం పరిష్కారానికి కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. మాస్కో రాజీకి రాకపోతే.. కీవ్‌కు తోమహాక్‌ క్షిపణులను అందజేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. ఆదివారం ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీతో ట్రంప్‌ మాట్లాడిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Green chilli | పచ్చి మిర్చి ఘాటుగానే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదే..!

    Green chilli | పచ్చి మిర్చి ఘాటుగానే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​​డెస్క్​: Green chilli | భారతీయ సంప్రదాయంలో పచ్చిమిర్చి (Green chilli) లేకుండా వంట అసంపూర్ణమే అని చెప్పారు. ఎందుకు దాదాపు అన్ని వంటకాల్లో పచ్చిమిర్చి వాడుతుంటాం. అయితే పచ్చి మిరపకాయలు రుచికి కారంగానే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి బహుళ ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయనే విషయం తెలుసుకోవాలి. పచ్చి మిరపకాయలను ఆహారంలో తగిన మోతాదులో చేర్చుకోవడం ద్వారా కలిగే తెలుసుకుందాం!

    Green chilli | విటమిన్లు ఇవే..

    ఒక కప్పు పచ్చిమిరపకాయల్లో విటమిన్ సి (52.76 శాతం), సోడియం (36.80 శాతం), ఇనుము (23.13 శాతం), విటమిన్ బి9 (18.29 శాతం), విటమిన్ బి6 (12.85 శాతం) ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదనంగా, ఇందులో విటమిన్లు A, B, C, E, P, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

    పచ్చిమిర్చిలో విటమిన్ సితో పాటు క్యాప్సైసిన్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా గుండె, రక్తపోటును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయని, కంటి చూపును మెరుగుపరుస్తాయని అంటున్నారు నిపుణులు.

    Green-chilli

    Green chilli | పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు..

    పచ్చి మిర్చిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ (Flavonoids), కెరోటినాయిడ్స్ (carotenoids) తదితర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటి వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయట. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. వీటిలో విటమిన్​ ఎ, బి2, బి3, బి6, బి9, సి, ఇ ఉంటాయని పేర్కొంటున్నారు. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండడంతో.. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ను (Free radicals) నుంచి రక్షణ కల్పిస్తుందని National Library of Medicine అధ్యయనంలో తేలింది.

    Green chilli | వెయిట్​ తగ్గేందుకు దోహదం..

    పచ్చి మిర్చి అనేది జీవక్రియను వేగవంతం చేసి, ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది. ఇందులో ఉండే క్యాప్సైసిన్ కొవ్వును కరిగించడంతో పాటు కొవ్వు నిల్వలు ఏర్పడకుండా నిరోధిస్తుందట. అంతేకాకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగించడం వల్ల అతిగా తినకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.

    Green chilli | షుగర్​ను అదుపులో ఉంచుతుంది..

    మిరపకాయల్లోని కార్బోహైడ్రేట్ల (Carbohydrates) వల్ల జీర్ణక్రియ నెమ్మదించడంతో పాటు ఇన్సులిన్ (Insulin) ఉపయోగాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరం శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటుందట. దీంతో రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంటుందని పేర్కొంటున్నారు. మిరపకాయలు ఒబెసిటీ, షుగర్​, గుండె సంబంధ రుగ్మతల చికిత్సకు సానుకూల ప్రభావాలను కలిగిస్తాయని ఓ అధ్యయనంలో తెలిసింది.

    Green chilli | గుండె ఆరోగ్యానికి మంచిది..

    పచ్చి మిరపకాయలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను (Cholesterol level) నియంత్రించడం లాంటి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి రక్తనాళాల్లో ఇన్​ఫ్లమేషన్​ను సైతం తగ్గిస్తాయట. దీంతో గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుందంటున్నారు. ఇలా మోతాదులో పచ్చి మిరపకాయలను ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే వీటికి అధికంగా తీసుకోవడం వల్ల అలర్జీలు లేదా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం (Health tips) మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

  • Health Tips | చన్నీటితో స్నానం మంచిదా.. వేడి నీటితోనా.. ఎలా చేయడం మంచిదంటే..!

    Health Tips | చన్నీటితో స్నానం మంచిదా.. వేడి నీటితోనా.. ఎలా చేయడం మంచిదంటే..!

    తెలుగున్యూస్​టుడే, వెబ్​డెస్క్​: Health Tips | స్నానం చేయడం ద్వారా బాడీ అంత రిఫ్రేష్​ అవుతుందని మనందరికీ తెలిసిందే. ఇది శరీరంతో పాటు మనసును సైతం శుద్ధి చేసే ప్రక్రియ. స్నానం (Bath) చేయడం ద్వారా తనువు, మనసు ఉత్సాహంగా మారాతాయి. అయితే స్నానం ఎప్పడు చేయాలి. ఎలా చేయడం మంచిదనే విషయాల గురించి తెలుసుకుందామా..

    Health Tips | చన్నీళ్లతో స్నానం..

    చన్నీళ్లతో స్నానం చేయడం ద్వారా అనేక శారీరక సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. మెదడు నుంచి కాలి బొటన వేలి వరకూ ఏకకాలంలో ఉత్తేజితమవుతాయంటున్నారు. చన్నీళ్లలో ఈత కొట్టేవాళ్లు ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్లకు చాలా తక్కువ గురవుతారని పేర్కొంటున్నారు. ఒకవేళ సోకినా తీవ్రత తక్కువగా ఉంటుందట. అలాగే రోగనిరోధక వ్యవస్థ (Immune system), మెదడు, గుండె, హృదయ నాళాల్లో పేరుకునే కొవ్వులను ప్రభావితం చేస్తుందంటున్నారు. అయితే.. చన్నీళ్లు పడని వారు మాత్రం రెండు నిమిషాలకు మించి చన్నీటితో స్నానం చేయవద్దని చెబుతున్నారు.

    Health Tips | వేడి నీటితో స్నానం..

    వేడి నీళ్లు నాచురల్​ పెయిన్​ కిల్లర్​గా (Natural pain killer) పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేడినీటి స్నానంతో (Hot water bath) చేయడం ద్వారా బిగుసుకున్న కండరాలు వ్యాకోచిస్తాయని.. దీని వల్ల విశ్రాంత స్థితికి వస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా పలు నొప్పుల నుంచి సైతం వేడినీటితో ఉపశమనం కలుగుతుందంటున్నారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల నాడీ వ్యవస్థ సైతం ప్రశాంతంగా ఉంటుందంటున్నారు. అలాగే మానసిక స్థితి మెరుగుపడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

    Health Tips | టబ్​ బాత్​..

    స్పైనల్ బాత్, హిప్ బాత్ రెండు రకాలుగా తొట్టి స్నానాలు ఉంటాయి. వీటివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆకలి లేమి, అజీర్తి, కడుపుబ్బరం తదితర సమస్యలను తొలగిస్తుందని పేర్కొంటున్నారు. రోజుకు 20 నుంచి 25 నిమిషాలు పరగడుపున టబ్​లో కూర్చోవాలి.

    Health Tips | అభ్యంగన స్నానం..

    అభ్యంగన స్నానం ఆయుర్వేదంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పరగడుపున నువ్వుల నూనె, కొబ్బరి, ఆముదం ఇలా ఏదైనా ఒక నూనెను ఒంటికి రాసుకోవాలి. అనంతరం 15-40 నిమిషాలు ఆగి… సున్నిపిండి, శనగపిండి ఏదో ఒక దాంతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుందని చెబుతారు.

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

  • AI-powered video game | AI-ఆధారిత వీడియో గేమ్‌.. xAI 2026లో అందుబాటులోకి తేనుందా..!

    AI-powered video game | AI-ఆధారిత వీడియో గేమ్‌.. xAI 2026లో అందుబాటులోకి తేనుందా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: AI-powered video game | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. త్వరలో గేమింగ్​ రంగంలోనూ విస్తృతంగా ఉపయోగంలోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​లో ప్రముఖ సంస్థ అయిన ఎలన్​ మస్క్​కు చెందిన xAI.. 2026లో వినూత్నమైన ఏఐ ఆధారిత వీడియో గేమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. AI సాంకేతికతను ఉపయోగించి రూపొందించనున్న ఈ గేమింగ్స్​.. గేమర్లకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది.

    xAIకి చెందిన ఈ నూతన ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఈ వీడియో గేమ్.. AI ఆధారిత డైనమిక్ స్టోరీలైన్‌లు, ఇంటరాక్టివ్ పాత్రలు, వినియోగదారుల ఆటతీరుకు అనుగుణంగా మారే గేమ్‌ప్లేను కలిగి ఉంటుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. xAI గ్రోక్ (Grok) AI, ఇప్పటికే వివిధ రంగాల్లో వినియోగదారులకు సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ గేమింగ్​ ప్రాజెక్టు కోసం కూడా గ్రోక్ సామర్థ్యాలను ఉపయోగించునే అవకాశం ఉందని తెలుస్తోంది.

    AI-powered video game | టెక్​ పరిశ్రమలో ఆసక్తి

    xAI రూపొందించనున్న ఈ ఏఐ గేమింగ్​ ప్రాజెక్టు (AI-powered video game) పట్ల టెక్ పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. గేమింగ్ పరిశ్రమలో AI పాత్ర గురించి చర్చలు ఊపందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే xAI ప్రవేశపెట్టనున్న గేమింగ్ విధానం.. ఆటగాళ్లలు, డెవలపర్లకు కొత్త ఒరవడిని సృష్టించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇవన్ని టెక్​ పరిశ్రమలో వస్తున్న ఊహాగానాలు.. వీటిపై xAI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.