Trump tariffs on china | ట్రంప్​ మరో సంచలన నిర్ణయం.. చైనాపై 100 శాతం టారిఫ్‌ల విధింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనాపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు.

by Harsha Vardhan
1 comment
Trump tariffs on china

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Trump tariffs on china | రోజుకో నిర్ణయంతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరో సంచలన డిసిషన్​ తీసుకున్నారు. ప్రపంచంలో రెండో ఆర్థిక వ్యవస్థ అయిన చైనాపై వంద శాతం టారిఫ్​లు (Trump tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1 నుంచి చైనా దిగుమతులపై 100 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు తన సోషల్​ మీడియా వేదిక ట్రూత్​లో పోస్టు చేశారు. ఇది ప్రస్తుత్తం విధిస్తున్న టారిఫ్​లకు అదనం.

అంతేకాకుండా అమెరికాలో తయారైన కీలకమైన సాఫ్ట్​వేర్​లపై కఠినమైన ఎగుమతి నియంత్రణ అమలు చేస్తామంటూ పేర్కొన్నారు. ట్రంపు తాజా నిర్ణయంతో ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరీ తీవ్రంగా మారే అవకాశం నెలకొంది.

Trump tariffs on china | అందుకేనా ఈ నిర్ణయం..

చైనా అంతర్జాతీయ వాణిజ్యంలో (International trade) అసాధారణంగా దూసుకొస్తుందంటూ ట్రంప్​ పేర్కొన్నారు. “చైనా వాణిజ్యంలో అసాధారణంగా దూకుడుతో పాటు ప్రపంచానికి శత్రుత్వపూరితమైన లేఖ రాసింది. వారు తయారు చేసిన ఉత్పత్తులతో పాటు వారు తయారు చేయని వాటిపై కూడా నవంబర్ నుంచి భారీగా ఎక్స్‌పోర్ట్ కంట్రోల్స్ విధిస్తున్నారు. దీనికి ప్రతిస్పందంగానే అమెరికా ఆ దేశంపై 100 శాతం టారిఫ్ విధిస్తుంది. ఇవి ప్రస్తుతం అమలవుతున్న టారిఫ్‌లకు అదనం. అంతేకాకుండా అన్ని క్రిటికల్ సాఫ్ట్‌వేర్స్​పై ఎక్స్‌పోర్ట్ కంట్రోల్స్ అమలు చేస్తాం.” అంటూ రాసుకొచ్చారు. చైనా తన రేర్​ ఎర్త్​ మినరల్స్​పై ఎగుమతి నియంత్రణలను పెంచడం సైతం ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణమైందని తెలుస్తోంది. తాజా టారిఫ్​లతో ఎలక్ట్రానిక్స్​ నుంచి ఎలక్ట్రిక్​ వాహనాల దాకా చాలా రంగాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Trump tariffs on china | రేర్ ఎర్త్ మినరల్స్‌పై చైనా ఆంక్షలు

చైనాలో లభించే రేర్​ ఎర్త్ మినరల్స్​ (), కీలక ఖనిజాల ఎక్స్‌పోర్ట్‌లపై కొత్త నియంత్రణలు ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాలో ఉత్పత్తి చేసిన లేదా చైనా టెక్నాలజీతో తయారు చేసిన 0.1 శాతం కన్నా ఎక్కువ రేర్ ఎర్త్‌ మినరల్స్​ ఉన్న ఉత్పత్తుల ఎగుమతి కోసం విదేశీ సంస్థలకు లైసెన్స్ తప్పనిసరి చేసింది. ప్రపంచంలో 70 శాతం రేర్ ఎర్త్‌ మినరల్స్​ చైనా నియంత్రణలోనే ఉన్నాయి. ఇవి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రాడార్ సిస్టమ్‌లు, జెట్ ఇంజన్‌ల తయారీలో కీలకం. వీటిపై నియంత్రణ విధించడంతో అమెరికా ఈ చర్యకు దిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

Trump tariffs on china | వాణిజ్య యుద్ధం..

అమెరికా – చైనా (US – China) మధ్య కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోసారి ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభింస్తుందనే ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం చైనా దిగుమతులపై సగటు టారిఫ్ రేటు 40 శాతంగా ఉంది. ఈ అదనపు టారిఫ్‌తో మొత్తం 140 శాతానికి చేరవచ్చు.

కాగా.. ఈ పరిణామంతో ట్రంప్, జిన్‌పింగ్‌ మధ్య ఈ నెల చివరలో దక్షిణ కొరియాలో జరిగే ఏపెక్ సమ్మిట్​కు ముందు జరిగే సమావేశం రద్దు కావొచ్చనే సూచనలు వెలువడుతున్నాయి.

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
Focus Mode
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00