తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Leh-Manali highway | ఆనంద్ మహీంద్రా (Anand mahindra) తాజాగా పోస్ట్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. “లెహ్ – మనాలి హైవే ప్రపంచంలోని అత్యంత సుందరమైన వాటిల్లో ఒకటి. ఇది మిమ్మల్ని కుర్చీలో కూర్చోకుండా.. భారత సహజ వైభవాన్ని పునరావిష్కరింపజేయాలని అనిపిస్తుంది” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. పోస్ట్ చేసిన 24 గంటల్లోపే లక్షల మంది వీక్షించారు.
Leh-Manali highway | ప్రకృతి రమణీయం లెహ్ – మనాలి హైవే..
ప్రకృతి రమణీయత లేహ్–మనాలి హైవే సొంతం. 428 కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉన్న ఈ రహదారిపై ప్రయాణించడం ఒక అద్భుతమైన ప్రయాణం ఎత్తయిన పర్వాతాలు, మధ్యలో లోయలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, గడ్డకట్టిన నదుల అందాలు ప్రయాణికులను మంతముగ్ధులను చేస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి లద్దాఖ్‌లోని లేహ్ వరకు సాగే ఈ రహదారి అందాలు కట్టిపడేస్తాయి. దేశంలోని నాలుగు అత్యధిక ఎత్తయిన మోటరబుల్ పాస్‌లను దాటి వెళ్తుంది. రోతాంగ్ లా, బరలాచా లా, లుంగలాచా లా, టాంగ్లాంగ్ లా పాస్‌లు 16,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండడం విశేషం. కాగా.. ఈ మార్గాన్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిర్వహిస్తుంది.
Leh-Manali highway | సాహసయాత్రికులకు స్పెషల్
ఈ రహదారి సాహసయాత్రికులకు ఎంతో స్పెషల్. రైడర్స్ తప్పకుండా టూర్ వేయాల్సిన హైవే ఇది. కొండలు, లోయలు, హిమాలయాల్లోని హై-ఆల్టిట్యూడ్ సరస్సులు, మౌనంగా ఉండే గ్రామాలు ఇవన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా అనిపిస్తుంది. అయితే గతంలో ఈ దారి ఏడాదిలో కేవలం ఆరు నెలలపాటు మాత్రమే తెరిచి ఉండేది. అది కూడా మంచు వర్షాల వల్ల ఎంతో క్లిష్టంగా ఉండేది. అయితే అటల్ టన్నెల్ నిర్మాణం చేపట్టడంతో ఈ మార్గం 45 కి.మీ. తగ్గిపోయింది. ప్రయాణం సులువుగా మారింది. కాగా.. ఈ రహదారిపై శింగో లా టెన్నల్ నిర్మాణం కూడా చేపట్టారు. ఇది పూర్తయితే అన్ని కాలాల్లో ప్రయాణం చేయడానికి సులువుగా మారనుంది. అంతేకాకుండా ఈ రహదారి భారత సైన్యానికి కూడా వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన మార్గంగా చెబుతారు.
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!