తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Crypto Market | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒకే ఒక్క ప్రకటన క్రిప్టో కరెన్సీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. చైనాపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తానంటూ ఆయన ప్రకటించడంతో క్రిప్టో మార్కెట్ భారీగా క్రాష్ అయింది. బ్లూమ్‌బెర్గ్ (Bloom berg) నివేదిక ప్రకారం.. క్రిప్టో ట్రేడర్లు రూ.68 లక్షల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాయిన్ గ్లాస్ డేటా ఆధారంగా.. కేవలం గత 24 గంటల్లో 16 లక్షల ట్రేడర్లు లిక్విడేట్ అయినట్లు నివేదిక తెలిపింది. అనగా.. వారి ఇన్వెస్ట్మెంట్లు ఆటోమేటిక్‌గా అమ్ముడైపోవడంతో నష్టపోయారు. అతిపెద్ద క్రిప్టో మార్కెట్ క్రాష్లలో ఇదీ ఒకటిగా మారింది.
Crypto Market | బిట్‌కాయిన్, ఈథర్ నేల చూపులు
క్రిప్టో మార్కెట్లోని దాదాపు అన్ని కరెన్సీలు పడిపోయాయి. బిట్‌కాయిన్ (Bit coin) రూ.1,22,000 నుంచి రూ.1,07,000కు పడిపోయింది. ఇథేరియం (ethereum) రూ.3,700 కంటే దిగువకు వచ్చిఒంది. ఎక్స్ఆర్పీ (XRP), సొలన (Solana), డిజీ కాయిన్ (Dogecoin) 20-30 శాతం వరకు క్షీణించాయి.
Crypto Market | ట్రంప్ ప్రకటనతో పాటు మరిన్ని కారణాలు..
చైనాపై 100 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనతో పాటు మరిన్ని కారణాలు క్రిప్టో మార్కెట్ కుంగేలా చేశాయి. అలాగే 16 లక్షల ట్రేడర్లు లిక్విడేట్ అయ్యాయి. ఇది కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. బిట్ కాయిన్ సైతం ఆల్ టైం హైకి చేరుకోవడం వలన ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కూడా క్రిప్టో క్రాష్‌కు కారణమైంది.
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!