తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన బ్యాకింగ్ సవరణ చట్టం వల్ల నవంబర్ 1 నుంచి కొన్ని కీలకమైన మార్పులు రానున్నాయి. బ్యాంక్ ఖాతా నామినీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. కాగా.. క్రెడిట్ కార్డ్ రూల్స్, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్ గడువు కూడా ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మారనున్న నిబంధలను గురించి తెలుసుకుందాం.
Credit Card Rules Changes : ఖాతాదారులకు నలుగురు నామినీలు..
బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్న వారికి గతంలో ఒక్కరే నామినీగా ఉండేవారు. కాగా.. బ్యాంకింగ్ సవరణ చట్టం కారణంగా.. ఇక నుంచి నలుగురిని నామినీగా ఎంచుకునే వీలుంది. కేంద్రం తెచ్చి ఈ కొత్త నిబంధన నవంబరరు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ రూల్ వల్ల ఖాతాదారుడు మరణించినట్లయితే.. డబ్బు విషయంలో వారసత్వ గొడవలు, చట్టపరమైన సమస్యలు తగ్గనున్నాయి.
Credit Card Rules Changes : లావాదేవీలకు ఒక శాతం ఫీజు..!
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగించే వారు కొత్త మార్పును గమనించాలి. ఇక నుంచి ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులు, వాలెట్ లోడింగ్‌కు సంబంధించి కొత్త ఛార్జెస్ అమలులోకి రానున్నాయి. క్రెడ్, ఫోన్‌పే, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ ఫీజు చెల్లిస్తే ఒక శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీ వెబ్సైట్లు, పీవోఎస్ మెషీన్ల ద్వారా చెల్లించినట్లయితే ఈ ఫీజు వర్తించదు. వాలెట్లో రూ.1000 మించి చేసే లావాదేవీలకు సైతం ఒక శాతం ఫీజు వర్తించనుంది.
Credit Card Rules Changes : లైఫ్ సర్టిఫికెట్..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ పెన్షన్ పొందడానికి నవంబర్ 1 నుంచి 30లోపు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. పింఛన్ పొందే వ్యక్తులు తాము జీవించి ఉన్నట్లుగా ఈ పత్రాన్ని సమర్పించాలి. ఈ ప్రక్రియ ప్రతియేటా కొనసాగుతుంది. కాగా.. 80 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు అక్టోబర్ 1 నుంచే ప్రక్రియ ప్రారంభమైంది.
సిలిండర్ రేటులో మార్పు
ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లోనూ నవంబర్ 1న మార్పు రానుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఆయిల్ సంస్థలు వీటి ధరలను సవరిస్తూ ఉంటాయి. అయితే.. కొన్ని నెలలుగా గృహ వినియోగ సిలిండర్ ధరలో మార్పూ చేయలేదు. కానీ.. కమర్షియల్ సిలిండర్ రేటులో మాత్రం హెచ్చుతగ్గులు జరిగే అవకాశం ఉంది.
ఈ US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. కూడా చదివేయండి.
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!