Donald Trump | ట్రంప్‌నకు ఇజ్రాయిల్‌ అత్యున్నత పౌర పురస్కారం.. ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు..

ట్రంప్‌నకు ఇజ్రాయిల్‌ తన అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు వెల్లడించారు.

by Harsha Vardhan
1 comment
Donlad Trump

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు ఇజ్రాయిల్​ అత్యున్నత పురస్కారం అందజేయనుంది. గాజా ఒప్పందం కుదిర్చిన నేపథ్యంలో అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ఆ దేశం ప్రకటించింది. గాజా ఒప్పందం.. బందీల విడుదలకు కృషి చేసినందుకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌’ (Presidential Medal of Honor)ను ప్రదానం చేయనున్నట్లు అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ తెలిపారు. త్వరలో సమయం, వేదిక నిర్ణయించి అందజేయనున్నట్లు ప్రకటింటించారు. డొనాల్డ్​ ట్రంపు ఈ గౌరవాన్ని అందుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన మద్దతు, దేశ పౌరుల భద్రత కోసం కృషి తాము ఈ విధంగా గౌరవిస్తున్నట్లు తెలిపారు.

Donald Trump | గాజా యుద్ధం ముగిసిందన్న ట్రంప్​

ఇజ్రాయిల్ – హ‌మాస్ మ‌ధ్య రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధం ముగిసింద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్ర‌క‌టించారు. గాజా శాంతి ఒప్పందం (Gaza Peace Agreement) కోసం పశ్చిమాసియాకు బయలుదేరిన వేళ ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఇజ్రాయిల్‌కు వెళ్లే మార్గంలో ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇప్ప‌టికే అనేక యుద్ధాల‌ను ఆపాన‌ని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న సంఘ‌ర్ష‌ణ‌ను కూడా నిలువ‌రిస్తానంటూ చెప్పుకొచ్చారు.

Donald Trump | నోబెల్ బహుమతిపై కీలక వ్యాఖ్యలు

అనేక దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు నిలువ‌రించాన‌ని ట్రంప్‌ మ‌రోసారి చెప్పారు. యుద్ధాలు ఆపాడంలో తాను స్పెషలిస్టున‌ని వ్యాఖ్యానించారు. అయినా తనకు నోబెల్ బ‌హుమ‌తి ఎందుకు రాలేదో తెలియ‌ద‌ని పేర్కొన్నారు. అయినా కూడా తమ శాంతి ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతూనే ఉంటాయని చెప్పారు. గాజా శాంతి ఒప్పందం గురించి మాట్లాడుతూ.. అన్ని పార్టీలను సంతోషపెట్టామని తెలిపారు. ఈజిప్టును సందర్శించి, మధ్యప్రాచ్య పరిస్థితిపై సైతం చర్చించడానికి ప్రాంతీయ నాయకులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. ‘మేం అందరినీ సంతోషపెట్టబోతున్నాం.. యూదులు అయినా, ముస్లింలు అయినా, అరబ్ దేశాలైనా..’ అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ తర్వాత ఈజిప్టు దేశానికి వెళ్తున్నా. శక్తివంతమైన, పెద్ద దేశాలు, ధనిక దేశాలు, నాయకును కలవబోతున్నా వారందరూ ఈ ఒప్పందంలో ఉన్నారు” అని పేర్కొన్నారు.

Donald Trump | రష్యా రాజీకి రాకపోతే వాటిని రంగంలోకి దించుతాం

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై కూడా ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేవారు. ఈ యుద్ధం పరిష్కారానికి కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. మాస్కో రాజీకి రాకపోతే.. కీవ్‌కు తోమహాక్‌ క్షిపణులను అందజేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. ఆదివారం ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీతో ట్రంప్‌ మాట్లాడిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

Leave a Comment

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00