తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు గురక వస్తోందా..? అది సాధారణ సమస్యనే అనుకుంటున్నారా? కానీ.. రోజూ గురకపెడుతున్నట్లయితే మీకు ఇబ్బందులు పొంచి ఉన్నాయనే సిగ్నల్‌గా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్లీప్ అప్నియాను ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, హైపర్‌టెన్షన్, స్ట్రోక్ వంటి ముప్పుల తప్పించుకోవచ్చంటున్నారు.
Snoring in Sleep |స్లీప్ అప్నియా ఎందుకు పెరుగుతోంది?
స్లీప్ అప్నియా (Snoring in Sleep) అనేది నిద్రలో శ్వాస చాలాసార్లు ఆగిపోయి, తిరిగి ప్రారంభమయ్యే సాధారణమైన పరిస్థితి. ఇది శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. గురక, ఉదయం తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉండవచ్చు, అయితే చికిత్స చేయించుకోకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో స్లీప్ అప్నియా గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇది వృద్ధుల్లోనే కాకుండా యువతలోనూ సర్వసాధారణంగా మారుతోంది. డెస్క్ జాబ్స్, లేట్ నైట్ స్క్రీన్ టైం, వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ లాంటి పెరుగుతున్నాయి. హార్ట్ స్ట్రోక్ వచ్చిన 50-70 శాతంలో మందిలో స్లీప్ అప్నియా ఉంటుందని అంటున్నారు. యువకుల్లో కూడా రీకరెంట్ స్ట్రోక్స్ వస్తున్నాయట. అయితే లైఫ్‌స్టైల్ మార్చుకోకపోతే ఇది మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందంటున్నారు.
Snoring in Sleep ఏం జరుగుతుందంటే..!
స్లీప్ అప్నియా వల్ల నిద్రలో మీ ఎయిర్‌వే రిపీటెడ్‌గా బ్లాక్ అవుతూ ఉంటుంది. రాత్రంతా అనేక సార్లు ఇలా జరగడం వల్ల మెదడు, శరీరానికి ఆక్సిజన్ అందదు. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ వెసెల్స్ డ్యామేజ్ అవుతాయి. అయితే ఇది సైలెంట్‌గా స్ట్రోక్, హార్ట్ డిసీజ్లకు దారి తీస్తుందట.

Snoring in Sleep లక్షణాలు ఇవే..
చాలా మంది ఏళ్ల తరబడి స్లీప్ అప్నియా లక్షణాలు గమనించరు. గురక వచ్చేవారు, నిద్రలో గ్యాస్పింగ్ లేదా చోకింగ్ ఫీలింగ్, రోజంతా టైర్డ్‌నెస్, మార్నింగ్ హెడేక్, డ్రై మౌత్, ఏకాగ్రత లేకపోవడం, మూడ్ స్వింగ్స్ లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి ఎదురైనట్లయితే సంబంధిత వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
గురక తగ్గడానికి ఏం చేయాలంటే..
గురక తగ్గాలంటే జీవనశైలి మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. బెడ్టైంకు ముందు ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అలాగే రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్, అలాగే ఒకవైపు పడుకోవడం లాంటివి చేయాలి. వీటి వల్ల మార్పు వస్తే ఒకే. లేదంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని ఇచ్చాం. వీటిని పాటించే ముందు మీరు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..: Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai




